జుట్టు పెర‌గ‌డానికి సహాయపడే హెయిర్ ఆయిల్స్

ఆరోగ్యమైన జుట్టు ఎవరు కోరుకోరు? జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరగాలని అందరూ ప్రయత్నిస్తారు కానీ, అందులో చాలామంది విఫలమైపోతుంటారు. దీనికి ముఖ్య కారణం మనం వాడే హెయిర్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీరు అనేక రకాలైన జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటే, మేము తీసుకువచ్చిన హెయిర్ ఆయిల్ ద్వారా మీరు దృఢమైన జుట్టుని పొందవచ్చు. 1. వావ్ స్కిన్ సైన్స్ ఆనియన్ హెయిర్ ఆయిల్: కొన్ని అధ్యయనాల ప్రకారం, ఉల్లిపాయ రసం అనేది మన జుట్టు పెరుగుదలకు […]

Share:

ఆరోగ్యమైన జుట్టు ఎవరు కోరుకోరు? జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరగాలని అందరూ ప్రయత్నిస్తారు కానీ, అందులో చాలామంది విఫలమైపోతుంటారు. దీనికి ముఖ్య కారణం మనం వాడే హెయిర్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీరు అనేక రకాలైన జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటే, మేము తీసుకువచ్చిన హెయిర్ ఆయిల్ ద్వారా మీరు దృఢమైన జుట్టుని పొందవచ్చు.

1. వావ్ స్కిన్ సైన్స్ ఆనియన్ హెయిర్ ఆయిల్:

కొన్ని అధ్యయనాల ప్రకారం, ఉల్లిపాయ రసం అనేది మన జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని తేలింది. మరి అలాంటి ఉల్లిపాయ రసాన్ని కలిగిన బెస్ట్ హెయిర్ ఆయిల్ గనక మీరు ఉపయోగించడం మొదలు పెడితే, జుట్టు ఒత్తిగా అవ్వడమే కాకుండా, దృఢంగా ఎటువంటి సమస్య లేకుండా పెరుగుతుంది. హెయిర్ ఆయిల్ లో ఆల్మండ్ ఆయిల్, జోజోబా ఆయిల్, కాస్టర్ ఆయిల్ ఉపయోగించడం వల్ల మీ జుట్టుని ఆరోగ్యకరంగా పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

2. మామ ఎర్త్ ఆనియన్ హెయిర్:

ఈ హెయిర్ ఆయిల్ చాలా చక్కగా మన జట్టు సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఉల్లిపాయ యొక్క గుణాలు కారణంగా, మన తలను ఎంతో బాగా నౌరిష్ చేయగలుగుతుంది. అంతేకాకుండా మన కుదుళ్ళను ఎంతో బాగా దృఢపరుస్తుంది. ఇందులో ఉన్న అద్భుతమైన సన్ఫ్లవర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఆమ్లా ఆయిల్ గుణాలు మన జుట్టుకి హైడ్రేషన్ కలిగించి, మన జుట్టు రాలకుండా సహాయపడుతుంది.

3. అర్బన్ బొటానిక్స్ కోల్డ్  ప్రెస్డ్ జోజోబా ఆయిల్:

ఈ ఆయిల్ మన జుట్టుకే కాకుండా, మన చర్మానికి కూడా నిగారింపు తేవడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ పేరులోనే అది ఎలా తయారు చేయబడిందో మనం ఊహించవచ్చు. శరీరానికే మాయిశ్చరైజర్లగా కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది అన్ని రకాల జుట్టు వారికి సరిపోతుంది. అంతేకాకుండా మన కుదుళ్ళని బలంగా మార్చి, జుట్టు మెరిసేలా చేస్తుంది.

4. జూసీ కెమిస్ట్రీ చిల్లి, హార్స్ టైల్ అండ్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్:

ఈ ఆయిల్ లో ఉన్న ప్రత్యేకమైన ఫార్ములా, జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ సీడ్ ఆయిల్ లో ఉండే గుణాలు మన జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ మన కుదుల్లోకి చొచ్చుకుపోయి, బ్లడ్ సర్కులేషన్ బాగ జరిగేలా సహాయపడుతుంది, అంతేకాకుండా, జుట్టు కుదుళ్ళను బలపరుస్తుంది. జుట్టు ఒత్తుగా ఎదగడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.

5. కామ ఆయుర్వేద బ్రింగ్గడి ఇంటెన్సివ్ హెయిర్ ట్రీట్మెంట్: 

ఈ హెయిర్ ఆయిల్ గురించి మీరు విన్నారా? ఎందుకంటే ఈ ఆయిల్ లో ఉండే గుణాలు వింటే మీరు తప్పకుండా ఇది ఉపయోగించి తీరుతారు. ఇందులో ఉండే ప్రకృతి సిద్ధమైన గుణాలు మన జుట్టుని ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అంతేకాకుండా రాలిపోతున్న జుట్టును రిపేర్ చేస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ లో, ఆమ్లా, ఇండిగో, కోకోనట్ ఆయిల్, మరిన్ని ఇతర ప్రకృతి సిద్ధమైన గుణాలు ఉండడం వల్ల, మన జుట్టు కుదుళ్ళు దృఢంగా మారి, జుట్టు రాలడాన్ని ఆపుతుంది. మన జుట్టును ఒత్తుగా నిగనిగలాడుతూ మెరిసేలా చేస్తుంది.

ఈ ఐదు రకాల హెయిర్ ఆయిల్స్ మీ జుట్టును బలంగా దృఢంగా చేస్తుంది. ఈ ఆయిల్స్ లో ఉన్న ఎన్నో ఔషధ గుణాలు మీ జుట్టును రిపేర్ చేస్తాయి. ముఖ్యంగా మీరు ఈ ఆయిల్ యూస్ చేయడం మొదలు పెట్టేముందు, ప్యాచ్ టెస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.