ఆరోగ్యకరమైన గుండె కోసం, రోగనిరోధక శక్తిని పెంచడం కోసం ఉపయోగపడే 5 యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు మీ ఆహారంలో చేర్చుకోగల ఐదు 5 యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఇవిగో మీకోసం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలూ అవసరం. ఫైబర్స్ ఆహారం జీర్ణమవడానికి సహాయపడతాయి, కార్బోహైడ్రేట్లు మనకు శక్తిని ఇస్తాయి. ప్రోటీన్లు తృప్తిని అందిస్తాయి. వీటన్నింటిలో, యాంటీఆక్సిడెంట్ల ప్రత్యేకతను మనం తరచుగా పట్టించుకోము. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు మీ ఆరోగ్యానికి […]

Share:

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు మీ ఆహారంలో చేర్చుకోగల ఐదు 5 యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఇవిగో మీకోసం.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలూ అవసరం. ఫైబర్స్ ఆహారం జీర్ణమవడానికి సహాయపడతాయి, కార్బోహైడ్రేట్లు మనకు శక్తిని ఇస్తాయి. ప్రోటీన్లు తృప్తిని అందిస్తాయి. వీటన్నింటిలో, యాంటీఆక్సిడెంట్ల ప్రత్యేకతను మనం తరచుగా పట్టించుకోము. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా సహాయపడతాయని మీకు తెలుసా? అందుకే ఇవి కూడా మీ ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉండాలి. యాంటీఆక్సిడెంట్లు అంటే ఆక్సిడెంట్లు (లేదా ఫ్రీ రాడికల్స్) వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించే సమ్మేళనం అని అర్థం. వ్యాధులతో పోరాడటానికి శరీరం ఆక్సిడెంట్లను ఉత్పత్తి చేస్తుంది, కానీ వాటి పరిమాణం పెరిగినప్పుడు, అవి కణాలపై దాడి చేసి, గుండె సమస్యలు కలిగే ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల, మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడటమే కాకుండా, ఆరోగ్యకరమైన గుండె కోసం కూడా యాంటీఆక్సిడెంట్లు కూడా ముఖ్యమైనవి. మీరు మీ ఆహారంలో చేర్చుకోగల యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలేవో ఇప్పుడు చూద్దాం.

మంచి గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి కోసం ఈ 5 యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి

1. కిడ్నీ బీన్స్

అనేక రకాల బీన్స్ ఉన్నాయి – ఎరుపు కిడ్నీ బీన్స్, బ్లాక్ కిడ్నీ బీన్స్, పింటో బీన్స్. వీటన్నింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నందున, అవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

2. వాల్ నట్స్

కార్డియాలజిస్టులు ప్రతిరోజూ వాల్‌నట్‌లను తినమని సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే వాటిలో కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి. కానీ పాలీఫెనాల్ అని పిలువబడే ఒక రకమైన యాంటీఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే నిపుణులు ప్రతిరోజూ 30 గ్రాముల వాల్‌ నట్స్ తినాలని సిఫార్సు చేస్తారు.

3. డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి మంచిదని మీకు తెలుసా? హార్వర్డ్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో కనీసం 70% కోకో ఉన్న చాక్లెట్లు మీ గుండె, మెదడు, మొత్తం శారీరక ఆరోగ్యానికి మంచివని కనుగొన్నారు.

4. బార్లీ

గత కొంతకాలంగా బార్లీ వల్ల కలిగే ప్రయోజనాలను గ్రహించినందున ఈ తృణధాన్యాలు ఆధునిక ఆహారంలో తిరిగి వస్తున్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ధాన్యం బార్లీ. కానీ ఇవి తింటే కడుపు బరువుగా ఉంటుంది కనుక ఇవి తినడానికి అందరూ ఇష్టపడరు. వీటిని నానబెట్టుకుని తినవచ్చు. నానబెట్టిన బార్లీలో యాంటీఆక్సిడెంట్ స్థాయి పెరుగుతుంది.

5. బెర్రీలు

బెర్రీలు బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ అన్నిటిలోనూ ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి, కణాలు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కి గురి కాకుండా ఇవి రక్షిస్తాయి. వాపు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బెర్రీలలో గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ఫైటోకెమికల్స్ కూడా ఉన్నాయి.