ఇలా చేస్తే 4.6 మిలియన్ల ఇండియన్స్ లైఫ్ ని కాపాడొచ్చా?

హైపర్ టెన్షన్ బారిన పడుతున్న వారి గురించి క్లీయర్ గా తెలియజేసిన WHO: హైపర్ టెన్షన్ గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ప్రతి సంవత్సరం 188.3 మిలియన్ల జనాభా హైపర్ టెన్షన్ బారిన పడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హైపర్ టెన్షన్ బారిన పడుతున్న వారి  డీటెయిల్స్ తెలియజేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొదటి రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో నలుగురు హైపర్ టెన్షన్ పేషంట్లకి సరైన వైద్యం అందట్లేదని తెలియజేసింది. ఇది ఇలాగే కొనసాగితే […]

Share:

హైపర్ టెన్షన్ బారిన పడుతున్న వారి గురించి క్లీయర్ గా తెలియజేసిన WHO:

హైపర్ టెన్షన్ గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ప్రతి సంవత్సరం 188.3 మిలియన్ల జనాభా హైపర్ టెన్షన్ బారిన పడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హైపర్ టెన్షన్ బారిన పడుతున్న వారి  డీటెయిల్స్ తెలియజేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొదటి రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో నలుగురు హైపర్ టెన్షన్ పేషంట్లకి సరైన వైద్యం అందట్లేదని తెలియజేసింది. ఇది ఇలాగే కొనసాగితే 2050 వరకు 76 మిలియన్ల జనాలు చనిపోతారు అని తెలియజేసింది. ప్రపంచ దేశాలు దీని మీద ఫోకస్ చేస్తే వీళ్ళ చావు ఆపొచ్చు అని తెలియజేసింది. ఇండియాలో 2040 వరకు 40 మిలియన్ల మందిని కాపాడవచ్చు అని తెలియజేసింది.

మంగళవారం యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీలో ఈ విషయాలన్నింటి గురించి తెలియజేశారు. గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం సంవత్సరానికి 188.3 మిలియన్ల జనాలు దీనివల్ల సఫర్ అవుతున్నారు. ఇందులో 37% మంది సరైన టైమ్ కి దీని గురించి తెలుసుకుంటున్నారు, అందులో 30% మంది సరైన టైం కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 

హైపర్ టెన్షన్ ని కంట్రోల్ లోకి తీసుకురావడం ఎలా

హైపర్ టెన్షన్ ని కంట్రోల్ రేట్ కి తీసుకురావాలంటే కనీసం 67 మిలియన్ల జనాలకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి.140/90 బిపి ఉన్నవారందరినీ పరిగణలోకి తీసుకొని ఈ లిస్ట్ క్రియేట్ చేశారు.హైపర్ టెన్షన్ వల్ల హార్ట్ ఎటాక్ రావచ్చు, దీనివల్ల స్ట్రోక్ రావచ్చు, గుండె పాడవ్వవచ్చు, కిడ్నీ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది.దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే హెల్తీ డైట్ తీసుకోవాలి, సరైన టైం కి వర్కౌట్ చేయాలి, స్ట్రెస్ లెవెల్స్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. బీపీ రెగ్యులర్ గా చూసుకోవాలి.

లాంగ్ కోవిడ్ కి, హైపర్టెన్షన్ కి ఏమైనా సంబంధం ఉందా?

కోవిడ్ వచ్చి వెళ్లిన తర్వాత చాలామంది రోగాల బారిన పడుతున్నారు. వైరస్ మన బాడీని చాలా రకాలుగా డామేజ్ చేయడమే దీనికి కారణం. చాలామంది కోవిడ్ తగ్గాక కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది షుగర్ బారిన పడుతున్నారు. కొంతమంది హైపర్ టెన్షన్ బారిన పడుతున్నారు. కొంతమంది చాలా వీక్ గా తయారవుతున్నారు. అసలు కోవిడ్ కి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ వైరస్ వచ్చి వెళ్లిన తర్వాత చాలా రోజుల వరకు వైరస్ పార్టికిల్స్ మన బాడీలో ఉంటాయి. ఆ కారణం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కోవిడ్ తగ్గాక కూడా నీరసం అనేది కనీసం ఆరు నెలల వరకు మన బాడీలో అలాగే ఉంటుంది. కోవిడ్ మన ఇమ్యూనిటీ మీద దాడి చేయడమే దీనికి కారణం. మన బాడీ మీదకి ఏ వైరస్ వచ్చినా ఇమ్యూనిటీ దాన్ని అడ్డుకుంటుంది. కోవిడ్ వైరస్ వచ్చేసి మన ఇమ్యూనిటీ మీదనే దాడి చేస్తుంది. ఇలా దాడి జరిగిన తర్వాత మన ఇమ్యూనిటీ వీక్ అవుతుంది. అది రికవర్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. మన ఇమ్యూనిటీ రికవర్ అయ్యేలోపు మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే మీ ఇమ్యూనిటీని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇమ్యూనిటీ రావాలంటే ఎక్కువగా సి విటమిన్ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఇంకా ప్రతిరోజు పొద్దున్నే వచ్చే ఎండలో కూర్చోవాలి. ఇవి కాకుండా ఎక్కువ కొలెస్ట్రాల్ లేని ఫుడ్డు తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ షుగర్ లాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఇవాల్టి నుండి హైపర్ టెన్షన్, షుగర్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాం.