రాత్రి భోజనం అయిన తర్వాత ఈ 3 యోగాసనాలు వేయండి, జీర్ణశక్తి పెరుగుతుంది, ఉదయాన్నే పొట్ట శుభ్రపడుతుంది

తిన్న తర్వాత యోగా చేయకూడదని మీరు అనుకుంటే అది తప్పు. రాత్రి భోజనం తర్వాత ఈ 3 యోగాసనాలు వేయడం మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొందరు నూనె, మసాలాలు, కారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తిన్న తర్వాత కడుపులో ఎల్లప్పుడూ గ్యాస్ వస్తుందని అంటుంటారు. గ్యాస్ ఏర్పడిన తరువాత చాలా ఇబ్బందులు వస్తాయి. కడుపులో బరువుగా అనిపించడం, తరచుగా మలవిసర్జన చేయడం, వికారం వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. మీరు కూడా ఈ సమస్యల నుండి బయటపడటానికి […]

Share:

తిన్న తర్వాత యోగా చేయకూడదని మీరు అనుకుంటే అది తప్పు. రాత్రి భోజనం తర్వాత ఈ 3 యోగాసనాలు వేయడం మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కొందరు నూనె, మసాలాలు, కారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తిన్న తర్వాత కడుపులో ఎల్లప్పుడూ గ్యాస్ వస్తుందని అంటుంటారు. గ్యాస్ ఏర్పడిన తరువాత చాలా ఇబ్బందులు వస్తాయి. కడుపులో బరువుగా అనిపించడం, తరచుగా మలవిసర్జన చేయడం, వికారం వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. మీరు కూడా ఈ సమస్యల నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నట్లయితే.. యోగా మీకు మంచి ఎంపిక. యోగా చేయడం అందరికీ మంచిది. మీకు ఉదయం యోగా చేయడానికి సమయం దొరకకపోతే, ఆహారం తిన్న తర్వాత యోగా చేయడం కూడా మీ జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఈ రోజు మనం కడుపులో గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలిగించే మూడు యోగాసనాల గురించి మీకు తెలియజేస్తాము. మీరు ఆహారం తీసుకున్న 1 గంట తర్వాత ఈ యోగాసనాలను చేయవచ్చు. రోజూ భోజనం చేసిన తర్వాత ఈ యోగాసనాలు వేయడం వల్ల మీ జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ముందు అసలు గ్యాస్ లక్షణాలేమిటో తెలుసుకోండి.

కడుపులో గ్యాస్ సమస్యకి సంబంధించిన లక్షణాలు

  • కడుపు నొప్పి
  • గ్యాస్ ఏర్పడటం
  • తరచుగా త్రేనుపులు రావడం
  • కడుపులో శబ్దాలు
  • వికారం
  • వాంతులు 

1. పవన ముక్తాసనం

పవన ముక్తాసనం.. ఈ ఆసనం కడుపులోని జీర్ణవ్యవస్థ నుండి వ్యర్థ వాయువులను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అందుకే దీనిని ఆంగ్లంలో విండ్ రిలీజింగ్ పోజ్ అంటారు. ఇది చాలా సులభమైన ఆసనం, జీర్ణక్రియ సాఫీగా జరగాలంటే ఇది చాలా ముఖ్యం, ప్రతిరోజూ ఈ ఆసనం చేయాలి.

పవన ముక్తాసనం చేసే విధానం

  • యోగా మ్యాట్‌పై బోర్లాగా పడుకోవాలి.
  • ఎడమ మోకాలిని వంచి పొట్ట దగ్గరికి తీసుకురావాలి.
  • ఊపిరి పీల్చుకుంటూ, రెండు అరచేతులను ఒకదానితో ఒకటి కలపాలి.
  • చేతుల వేళ్లను మోకాళ్లకి కొద్దిగా క్రింద ఉంచాలి.
  • ఇప్పుడు మీ ఎడమ మోకాలితో మీ ఛాతీని తాకడానికి ప్రయత్నించాలి.
  • మీ తలను నేల నుండి పైకి లేపాలి.
  • మోకాళ్లను ముక్కుకు తాకడానికి ప్రయత్నించి, ఆ తర్వాత 10 నుండి 20 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండాలి.
  • నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవాలి.

2. వజ్రాసనం

ఆహారం తీసుకున్న 15 నిమిషాల తర్వాత, యోగా మ్యాట్‌పై, రెండు కాళ్లను ముందుకి చాచి కూర్చోండి.

కాళ్ళను మోకాలి వరకు వెనకకు మడిచి, పాదాల వేళ్లు వెనుక, పైకి ఉండే విధంగా కూర్చోండి.

రెండు కాలి వేళ్లను కలిపి ఉంచాలి.

రెండు చెవుల మధ్య దూరం ఉంచాలి.

మీ రెండు చేతులను మోకాళ్లపైనే ఉంచాలి.

కళ్ళు మూసుకుని, అదే సమయంలో నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండండి.

ప్రారంభంలో, 3 నుండి 5 నిమిషాలు మాత్రమే చేయండి.

3. సేతు బంధ సర్వాంగాసనం

సేతు బంధ సర్వాంగాసనం చేసే విధానం

యోగా మ్యాట్ పై వెల్లకిలా పడుకోవాలి. 

శ్వాసను సాధారణ స్థితిలో ఉంచాలి.

దీని తర్వాత చేతులను పక్కకు పెట్టుకోవాలి.

తర్వాత మీ కాళ్లను మడిచి నడుము దగ్గరకు తీసుకురావాలి.

నడుముని నేల నుండి వీలైనంత ఎత్తుకు ఎత్తాలి.

చేతులను నేలపైనే ఉంచండి.

కొంత సమయం పాటు శ్వాస పీల్చి అలానే ఉండాలి. 

దీని తరువాత, ఊపిరి పీల్చుకుంటూ, తిరిగి నేలపైకి దిగాలి.

ఈ యోగాసనాలు చేయడం వల్ల మీ జీర్ణవ్యవస్థకి ఎంతో మేలు జరుగుతుంది.