రక్షా బంధన్‌.. అద్భుతమైన గిఫ్టింగ్ ఐడియాలు

రక్షా బంధన్ రానే వచ్చింది. ఎన్ని సమస్యలు ఎన్ని మనస్పర్థలు, ఎన్ని ఆటుపోట్లు ఉన్నా.. అన్నా, చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లు సంవత్సరానికి జరుపుకునే పండుగ రక్షా బంధన్. రక్షా బంధన్ ఒక పండగ మాత్రమే కాదు, అన్నా చెల్లళ్ళ, అక్కా తమ్ముళ్ల బంధానికి ఒక ప్రతీక. భారత మూలాలతో ముడిపడి ఉన్న ఈ పండగ కోసం ప్రతీ ఒక్కరూ వేయి కళ్ళతో వేచి చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు తన చెల్లి, తన అక్క కట్టే ఆ రక్షా […]

Share:

రక్షా బంధన్ రానే వచ్చింది. ఎన్ని సమస్యలు ఎన్ని మనస్పర్థలు, ఎన్ని ఆటుపోట్లు ఉన్నా.. అన్నా, చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లు సంవత్సరానికి జరుపుకునే పండుగ రక్షా బంధన్. రక్షా బంధన్ ఒక పండగ మాత్రమే కాదు, అన్నా చెల్లళ్ళ, అక్కా తమ్ముళ్ల బంధానికి ఒక ప్రతీక. భారత మూలాలతో ముడిపడి ఉన్న ఈ పండగ కోసం ప్రతీ ఒక్కరూ వేయి కళ్ళతో వేచి చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు తన చెల్లి, తన అక్క కట్టే ఆ రక్షా బంధాన్ని కట్టించుకోవాలని అనుకుంటారు. అలాగే ప్రతి అన్న తన చెల్లిని నిండు మనుసుతో దీవించి, తనకు తోచిన కానుకను ఇవ్వాలని అనుకుంటారు. 

ఇంతటి పవిత్రమైన పండగలో తనకు రక్షాను కట్టి, ఆ దేవుడిని రక్షగా నిలవాలని కోరే ప్రతీ అక్కకు, ప్రతీ చెల్లెకు ఆ అన్నా, తమ్ముడు ఒక అమూల్యమైన బహుమతిని లేదా తనకు వీలయ్యే బహుమతిని ఇస్తారు. అలా మీకు మీ చెల్లెకు, అక్కకు ఎలాంటి బహుమతి ఇవ్వాలో అర్ధం కాకపోతే.. ఇక్కడ మేము మీకోసం కొన్ని ఐడియాలను లిస్ట్ చేసి ఉంచాము. వాటిపై ఓ లుక్కేయండి.

గిఫ్ట్ హాంపర్

గిఫ్ట్ హంపర్ అనేది ఒక ప్రత్యేమైన బహుమతి. మీ తోబుట్టువులకు ఎటువంటి విషయాలు నచ్చుతాయో ప్రత్యేకంగా అటువంటి బహుమతులను అందులో ఉంచి వారిని సర్ ప్రైజ్ చేయొచ్చు. మీరు ఇందులో వివిధ రకాల వస్తువులను ఎంచుకోవచ్చు. వీటి ద్వారా మీలో ఉన్న ప్రేమను వారికి తెలియజేసేందుకు మంచి అవకాశం లభిస్తుంది. కావున ఈ రాఖీ పండుగకు ఈ గిఫ్ట్ హాంపర్ ను బహుమతిగా ఇచ్చి మీ తోబుట్టువు మనసును గెలుచుకోండి. 

లిప్ స్టిక్ 

వినేందుకు ఇది చిన్న విషయంలా అనిపించినా కానీ సౌందర్య సాధనాలు ఆడవారికి ఎక్కువగా నచ్చుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కావున ఈ గిఫ్ట్ ను ఇచ్చి మీరు మీ తోబుట్టువులను ఫుల్ ఖుష్ చేయొచ్చు. ఈ లిప్ స్టిక్ కొనేందుకు ఎక్కువ ఖర్చు కూడా ఏమీ కాదు కాబట్టి ఈ ఆప్షన్ మీ పాకెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. కావున ఈ ఆప్షన్ ను మీరు ఎటువంటి చింత లేకుండా ట్రై చేసేందుకు వీలుంటుంది. ఈ లిప్ స్టిక్ ను పెదాలపై రాసుకున్నపుడు లిప్స్ అనేవి మరింత అట్రాక్టివ్ గా తయారవుతాయి. 

స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్

రోజులు మారాయి. ఇప్పుడు అందరూ స్మార్ట్ గా తయారయ్యారు. అందుకోసమే మీ తోబుట్టువులకు రక్షా బంధన్ గిఫ్ట్ గా స్మార్ట్ వాచ్ ఇస్తే వారు చాలా సంతోషపడతారు. ఇది మాత్రమే కాకుండా ఇయర్ బర్డ్స్ ఇచ్చి కూడా సర్ ప్రైజ్ చేయొచ్చు. ఈ స్మార్ట్ వాచ్ లో కేవలం సమయం చూసుకోవడం మాత్రమే  కాకుండా అనేక ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. బ్లూ టూత్ తో వర్క్ చేసే ఇయర్ బర్డ్స్ వల్ల మన ఫోన్ మనకు కొంత దూరంలో ఉన్నా కానీ కాల్స్ వచ్చినపుడు ఎటువంటి చింత లేకుండా ఎంచక్కా మాట్లాడేయచ్చు. అందుకోసమే నేటి రోజుల్లో అనేక మంది యువత ఈ ఇయర్ బర్డ్స్ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యాషన్ గురించి ట్రెండ్ గురించి అప్డేటెడ్ గా ఉండే వాళ్లు వీటిని తప్పకుండా వాడుతున్నారు. 

కేవలం పైన పేర్కొన్నవి మాత్రమే కాకుండా అనేక గిఫ్ట్ లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు అంటే గిఫ్ట్ కొనాలంటే షాప్ కి వెళ్లి సెలెక్ట్ చేసి కొనాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అంతా ఈ కామర్స్ జమానా నడుస్తోంది. మనకు నచ్చిన గిఫ్ట్ ను ఇలా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. కావున మనకు అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎంపికల నుంచి ఏదేనీ ఒక మంచి గిఫ్ట్ ను సెలెక్ట్ చేసుకుని మన తోబుట్టువులు సంతోషంగా ఉండేలా చూడడం మన బాధ్యత.