విట‌మిన్ డి ఎక్కువుంటే న‌ష్ట‌మా?

విటమిన్ డి మీ శారీరిక ఆరోగ్యానికి  కోసం చాలా ముఖ్యమైనది. కండరాల కణాల పెరుగుదలకు, మీ రోగనిరోధక వ్యవస్థ సరైన పనితీరుకు మరియు మీ ఎముకల బలానికి విటమిన్ డి అవసరమని అధ్యయనాలు చెప్తున్నాయి. విటమిన్ డి లోపం వల్ల ఎంతో నష్టం వాటిల్లే అవకాశం. విటమిన్ డి లోపం పెరుగుతున్న నేపథ్యంలో, మళ్లీ విటమిన్ డి మన శరీరంలో సాధారణ స్థాయికి చేరుకోవడానికి సప్లిమెంట్లను తీసుకుంటారు. అయినప్పటికీ, విటమిన్ డి సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవడం కూడా […]

Share:

విటమిన్ డి మీ శారీరిక ఆరోగ్యానికి  కోసం చాలా ముఖ్యమైనది. కండరాల కణాల పెరుగుదలకు, మీ రోగనిరోధక వ్యవస్థ సరైన పనితీరుకు మరియు మీ ఎముకల బలానికి విటమిన్ డి అవసరమని అధ్యయనాలు చెప్తున్నాయి. విటమిన్ డి లోపం వల్ల ఎంతో నష్టం వాటిల్లే అవకాశం.

విటమిన్ డి లోపం పెరుగుతున్న నేపథ్యంలో, మళ్లీ విటమిన్ డి మన శరీరంలో సాధారణ స్థాయికి చేరుకోవడానికి సప్లిమెంట్లను తీసుకుంటారు. అయినప్పటికీ, విటమిన్ డి సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవడం కూడా చాలా ప్రమాదకరం అని కొంతమందికి తెలియదు. 

అంతేకాకుండా మనం శరీరంలో విటమిన్ డి అధికంగా ఉన్నప్పుడు, విటమిన్ డి టాక్సిసిటీ, లేదా హైపర్విటమినోసిస్ డి కూడా వాటిళ్లే అవకాశం ఉంది. డాక్టర్లు చెబుతున్న ప్రకారం ప్రకారం, విటమిన్ డి టాప్ టాక్సిసిటీ అనేది ముఖ్యంగా మనం బయట నుంచి సప్లిమెంట్ల ద్వారా విటమిన్ డి తీసుకోవడం వల్ల వస్తుంది.

అధిక విటమిన్ డి గుర్తించే కొన్ని సంకేతాలు:

ఆకలి ఉండదు

మలబద్ధకం

డీహైడ్రేషన్

అలసట

తరచుగా మూత్ర విసర్జన

అధిక రక్త పోటు

కండరాల బలహీనత

వికారం

దాహం

వాంతులు అవడం 

మీరు కూడా ఇటువంటి లక్షణాలను ఎదుర్కొంటుంటే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి మరియు మీరు తీసుకునే సప్లిమెంట్లు, మీరు వాడుతున్న మందులు గురించి, అదే విధంగా మీరు తీసుకునే ఆహారం గురించి చాలా క్లియర్ గా వివరించండి.

విటమిన్ డి స్థాయిల ఎక్కువగా ఉంటే వచ్చే ఇతర తీవ్రమైన సంకేతాలు గురించి తప్పకుండా తెలుసుకోండి: 

హైపర్‌కాల్సెమియా: 

విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం అధికంగా చేరుతుంది. ఈ పరిస్థితిని హైపర్‌కాల్సెమియా అంటారు.

కిడ్నీ సమస్యలు: 

విటమిన్ డి శరీరంలో అధికంగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు లేదా కిడ్నీ దెబ్బతినవచ్చు.

ఎముకుల సమస్యలు: ఎముకులు ఆరోగ్యానికి తగినంత విటమిన్ డి ఉండడం చాలా అవసరం అయినప్పటికీ, కానీ విటమిన్ డి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది. విటమిన్ డి మెగాడోస్ తీసుకునే వ్యక్తులు ఎముకులలో పగుళ్లకు గురయ్యే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది.

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, విటమిన్ డి అనేది మన శరీరంలో ఎంత అవసరం:

19 నుండి 50 సంవత్సరాల వయస్సు వారికి: 600 IU/d.

50 నుండి 70 సంవత్సరాల వయస్సు వారికి: కనీసం 600 IU/d.

70 ఏళ్లు పైబడిన వారికి: కనీసం 800 IU/d.

ఆరోగ్యకరమైన వారికి గరిష్టంగా రోజువారీ అవసరం ఉండే విటమిన్ డి4,000 IU/d.

శరీరంలో ఎంత విటమిన్ డి ఉండాలి అనే దాని గురించి మీ వైద్యుడిని సంప్రదించండి. మీరు విటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటే, మీ విటమిన్ డి మీ శరీరంలో అధిక స్థాయిలో ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేయించుకోవడం అవసరం. ఏదైనా సప్లిమెంట్‌ను మీరు తీసుకునే ముందు డాక్టర్ని సంప్రదించడం ఎంతో ఉత్తమం. ఒక‌వేళ మీలో పైన చెప్పిన ల‌క్షణాలు ఉన్న‌ట్లైతే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించండి. ప‌రీక్ష‌లు చేయించుకుంటే ఏ విష‌యం అనేది తెలిసిపోతుంది.