మిస్సింగ్ పీరియడ్స్ కి కారణాలు ఎన్నో…

పీరియడ్ మిస్ అవ్వడానికి గల మొదటి కారణం: ప్రెగ్నెన్సీ, ఇది క్లియర్ గా తెలిసే వరకు ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ చేసుకోకండి. హోమ్ ప్రెగ్నెన్సీ కిట్ యూస్  చేసి రిజల్ట్ తెలుసుకోండి. అది నెగిటివ్ వస్తే వేరే కారణాలు ఏంటో తెలుసుకోండి.   మన హెల్త్ బాగుంటేనే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి.    స్ట్రెస్: ఇది కూడా ఫీవర్ లాంటిదే. సడన్ గా వస్తుంది సడన్గా పోతుంది. స్ట్రెస్ లో ఉన్నప్పుడు హార్మోన్స్ విడుదల అవ్వక పీరియడ్ […]

Share:

పీరియడ్ మిస్ అవ్వడానికి గల మొదటి కారణం:

ప్రెగ్నెన్సీ, ఇది క్లియర్ గా తెలిసే వరకు ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ చేసుకోకండి. హోమ్ ప్రెగ్నెన్సీ కిట్ యూస్  చేసి రిజల్ట్ తెలుసుకోండి. అది నెగిటివ్ వస్తే వేరే కారణాలు ఏంటో తెలుసుకోండి.   మన హెల్త్ బాగుంటేనే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి.   

స్ట్రెస్:

ఇది కూడా ఫీవర్ లాంటిదే. సడన్ గా వస్తుంది సడన్గా పోతుంది. స్ట్రెస్ లో ఉన్నప్పుడు హార్మోన్స్ విడుదల అవ్వక పీరియడ్ లేట్ అవుతుంది. అందుకనే సాధ్యమైనంత స్ట్రెస్ కి దూరంగా ఉండాలి.   

ఆరోగ్య సమస్యలు: 

మీ ఒంట్లో అనారోగ్యంగా ఉంటే మీ పీరియడ్ లేట్ అవుతుంది.   

ఫుడ్ హ్యాబిట్స్ మారడం: 

ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నట్లయితే దానివల్ల మీ శరీరం మారి పీరియడ్స్ డీలే అవుతాయి.   

బ్రెస్ట్ ఫీడింగ్: 

దీనివల్ల కూడా పీరియడ్ లేట్ అవుతుంది.   

బర్త్ కంట్రోల్ పిల్స్: 

ఈ టాబ్లెట్లు వాడడం వల్ల పీరియడ్ లేట్ అవుతుంది. కారణం ఇవి హార్మోన్ల ను విడుదల అవ్వనివ్వవు.   

అధిక బరువు: 

మీరు ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండటం వల్ల కూడా పీరియడ్స్ అవ్వవు.   అధిక బరువు అనేది మనకు చాలా విధాలుగా హాని కలిగిస్తుంది. దీనివల్ల మనం తొందరగా అలసిపోతాం. మనం అధిక బరువు ఉన్నామంటే మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని అర్థం. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే అధిక బరువు ఉండకపోవడమే బెటర్.   

ఈటింగ్ ప్రాబ్లమ్స్: 

మనకు కొన్ని ఫుడ్స్ అరగవు, అలాంటివి ఎక్కువగా తిన్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది.   

బాడీ ఫ్యాట్: 

మన బాడీలో కొవ్వు ఎక్కువగా ఉంటే మన హార్మోన్లు హెల్తీగా ఉండవు, దీనివల్ల పీరియడ్స్ లేట్ అవుతాయి. బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటే గుండె సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఎక్కువగా వాకింగ్ చేసి ఈ సమస్య రాకుండా చూసుకుంటే బెటర్.   

ఎర్లీ మెనోపాజ్: 

ఇది కూడా పీరియడ్స్ లేట్ అవ్వడానికి కారణం.   

థైరాయిడ్ ప్రాబ్లం: 

మన శరీరంలో థైరాయిడ్ అనేది చాలా ముఖ్యమైనది.   థైరాయిడ్ ఎక్కువగా ఉన్నా ప్రాబ్లమే తక్కువగా ఉన్నా ప్రాబ్లమే. అందుకే థైరాయిడ్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి. బాడీలో థైరాయిడ్ సరిగా లేకుంటే పీరియడ్స్ లేట్ అవుతాయి.   

మన పీరియడ్స్ సరిగా అవ్వాలంటే కొన్ని నియమాలు పాటించాలి.   అవేంటో తెలుసుకుందాం.   

ప్రతిరోజు మూడు పూటలు తినాలి, పండ్ల రసాలు తాగాలి, పండ్ల రసాలు చేసుకోవడం కష్టం అనిపిస్తే పండ్లు తినాలి.   రోజు కాసేపు వాకింగ్ చేయాలి.   రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. మన బాడీకి కావలసినంత విశ్రాంతి ఇవ్వాలి.   మనం ఎప్పుడూ ఒత్తిడి పడకూడదు.   ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి.   మాంసాహారం కాస్త తగ్గించాలి.   

ఇవన్నీ చేసినట్లయితే మన పీరియడ్స్ ఏ కాదు బాడీలో అంతా బాగుంటుంది.   మన శరీరానికి కావలసినన్ని నీళ్లు కూడా మనం అందించాలి. ఇవన్నీ చేస్తే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అప్పుడు ఏ అనారోగ్యం మన దగ్గరికి కూడా రాదు.   ఇవన్నీ పాటించి మీ ఆరోగ్యాన్ని సరి చేసుకుంటారని అనుకుంటున్నాం.