పెసరపప్పుతో రుచికరమైన వంటలు

ఇప్పుడున్న ఉరుకుల పరుగుల హడావిడి కాలంలో ఆరోగ్యాన్ని చాలామంది మర్చి పోతున్నారు. అయితే మనం తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉంటే ఎక్కువ సమయం మనం చురుకుగా పని చేయగలుగుతాం. ముఖ్యంగా శరీరంలో బలం బాగా ఉంటే మనం ఏ పని చేసినా చురుగ్గా చేయగలుగుతాం ఆరోగ్యంగా ఉంటాం.. మరి బలం రావాలి అంటే రుచికరమైన ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం కదా.ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంగా […]

Share:

ఇప్పుడున్న ఉరుకుల పరుగుల హడావిడి కాలంలో ఆరోగ్యాన్ని చాలామంది మర్చి పోతున్నారు. అయితే మనం తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉంటే ఎక్కువ సమయం మనం చురుకుగా పని చేయగలుగుతాం. ముఖ్యంగా శరీరంలో బలం బాగా ఉంటే మనం ఏ పని చేసినా చురుగ్గా చేయగలుగుతాం ఆరోగ్యంగా ఉంటాం.. మరి బలం రావాలి అంటే రుచికరమైన ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం కదా.ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే పదార్థం మనకి తక్కువ ధరలో ఉత్తమమైన ఆరోగ్యాన్ని అందించే పదార్థం. ఆ పదార్థమే పెసరపప్పు. మరి ఆ పెసరపప్పు తో చేసుకునే రుచికరమైన ఆహార పదార్థాలు ఈరోజు తెలుసుకుందామా… 

పెసరట్లు: 

ఈ మాట వినగానే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. ఉప్మా పెసరట్టు అంటే అందరికీ ఇష్టమే కదా. మరి ఈ పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. చాలామందికి దోసెలు వేసుకోవడం అలవాటే, అయితే ఉత్తి పెసరపప్పుతో పెసరట్లు వేసుకోవచ్చు లేదంటే కాస్త బియ్యం కూడా యాడ్ చేసుకోవడం ద్వారా పెసరట్టు స్మూత్ గా వస్తుంది.. అయితే పూర్తిగా ఆరోగ్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మనకు కావాల్సినంత ఉత్తి పెసరపప్పు, చిటికెడు మెంతులు కలిపి ఒక ముందు రోజు రాత్రి నానబెట్టుకుని. తర్వాత రోజు ఉదయం, రుబ్బుకొని, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని వేడి చేసుకుని, ముందుగా ఉల్లిపాయ పెనం మీద రుద్దుకొని చిటికెడు ఆయిల్ వేసి పెసరట్టు వేసుకోవడమే.. ఈ పెసరట్టు మనం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది. 

ఆయిల్ ఫ్రీ పెసర వడలు: 

సాయంత్రం పూట అందరూ కలిసి సరదాగా తినడానికి కూడా మనం పెసర వడలు అనేవి తయారు చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. వడలు తయారు చేసుకోవడానికి చాలా సులభమైన పద్ధతులు ఉన్నాయి. అయితే మనం పెసరట్లు కోసం ఏదైతే పప్పు నానబెట్టుకుని ఉంచుకుంటామో అందులో నుంచి పావు కప్పు పప్పు తీసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కలుపుకొని తగినంత ఉప్పు వేసుకొని వడలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూనెలో వేపుకునే బదులు, పనం మీద కాస్త ఆయిల్ వేసి, వడలు వాటి మీద ఉంచి, మూత పెట్టుకున్నట్లయితే, ఆయిల్ ఫ్రీ పెసర వడలు రెడీ అయినట్టే. ఇవి మామూలు పెసర వడలతో పోలిస్తే ఎంతో ఆరోగ్యకరం. ఇందులో ఎక్కువగా ఆయిల్ ఉండదు కాబట్టి భయపడాల్సిన పని ఉండదు. 

పెసర మొలకలు: 

అయితే ఉదయం లేవగానే మనం టిఫిన్ కన్నా ముందుగానే ఈ పెసర మొలకలు అనేవి తినడం ఎంతో ఉత్తమం.. ఇందులో ఐరన్ మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. రక్తహీనత ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ పెసర మొలకలు తినడం అలవాటు చేసుకోవాలి. మొలకలు చేసుకోవడానికి, పెసరపప్పు బాగా కడుక్కొని, ముందు రోజు మధ్యాహ్నం నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. అయితే రాత్రి ఆ పెసరపప్పు శుభ్రంగా కడుక్కొని, నీరు లేకుండా ఆ పెసరపప్పు మొత్తాన్ని ఒక తడి గుడ్డలో మూట కట్టాలి. అయితే ఈ పెసరపప్పు ఉదయానికి మొలకలతో మనం చూడొచ్చు. మొలకలు వచ్చిన పెసరపప్పు తినడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. రక్తహీనత వారికి, శరీరంలో రక్తం కూడా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారు మొలకలు తినడం ఎంతో మంచిది.