నలుగురిలో ఒకరికి ఎనీమియా సమస్య

ప్రపంచంలో నలుగురిలో ఒకరికి ఎనీమియా సమస్య వాటిలో ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఎనీమియా అనేది శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గినప్పుడు వాటిల్లుతుంది. ముఖ్యంగా ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఆక్సిజన్ సరఫరా చేసే ఆయుధాలు. అయితే ఎప్పుడైతే మన శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తగ్గిపోతాయో ఎనీమియా వాటిల్లుతుంది. ముఖ్యంగా ప్రపంచంలోనే ఎనీమియా ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారిపోయింది.  రోజురోజుకీ పెరుగుతున్న సమస్య:  […]

Share:

ప్రపంచంలో నలుగురిలో ఒకరికి ఎనీమియా సమస్య వాటిలో ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఎనీమియా అనేది శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గినప్పుడు వాటిల్లుతుంది. ముఖ్యంగా ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఆక్సిజన్ సరఫరా చేసే ఆయుధాలు. అయితే ఎప్పుడైతే మన శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తగ్గిపోతాయో ఎనీమియా వాటిల్లుతుంది. ముఖ్యంగా ప్రపంచంలోనే ఎనీమియా ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారిపోయింది. 

రోజురోజుకీ పెరుగుతున్న సమస్య: 

ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా నడుము నొప్పితో బాధపడుతున్న వారు, డయాబెటిస్తో, డిప్రెషన్ తో బాధపడుతున్న వారి కంటే ఎనేమియాతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అంతే కాకుండా ఎనేమియా తగ్గించేందుకు కూడా పెద్ద సమస్యగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. 

ముఖ్యంగా శరీరంలో ఆక్సిజన్ సరఫరా చేసే రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గినప్పుడు ఎనేమియా సింటమ్స్ బయటపడుతూ ఉంటాయి. అందులో కళ్ళు తిరగడం, ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడం, రోజు వారి విషయాల మీద కాన్సెంట్రేషన్ చేయలేకపోవడం, మన పనిని మనం చేసుకోవడానికి, నీరసంగా అనిపించడం ఇలా చాలా సింటమ్స్ అనేమియాలోకి వస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా మన శరీరంలో బ్లడ్ లెవెల్స్ తగ్గినప్పుడు, ఆరోగ్యం బలహీన పడినప్పుడు సింటమ్స్ బయటపడుతూ ఉంటాయి. 

మెదడుకు దెబ్బ: 

అయితే ఇటువంటి అనేమియా సమస్య వాటిల్లినప్పుడు ముఖ్యంగా మెదడుకు ఎంతో ప్రమాదం అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా చిన్నపిల్లల్లో అనేమియా సమస్య వస్తే చాలా పెద్ద ఇబ్బంది అవుతుందని, ఎనేమియా సమస్య కారణంగా బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోవడమే కాకుండా, గుండెకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి అంటున్నారు. ఇటువంటి ఎనేమియా సమస్య ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి శరీరంలో ఉన్న బ్లడ్ లెవెల్స్ తక్కువ అవడం వల్ల, ప్రెగ్నెంట్ లేడీస్ లో కలవరం, డిప్రెషన్, పుట్టిన బిడ్డ మీద ఎఫెక్ట్ చూపించడం, పుట్టిన బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, ఇన్ఫెక్షన్స్ వాటిల్లడం వంటివి జరుగుతూ ఉంటాయి. 

సగటు మనిషిలో బ్లడ్ తక్కువైపోవడం వల్ల, లేదంటే మన శరీరం కొత్త బ్లడ్ సెల్స్ తయారు చేయడంలో విఫలమైనప్పుడు, మన శరీరంలో ఐరన్ కంటెంట్ తక్కువ అయినప్పుడు కూడా ఎక్కువగా అనేమియా సమస్య బయటపడుతుంది అంటున్నారు నిపుణులు. అయితే ప్రతి ఒక్కరికి ఎనేమియా సమస్య గురించి తెలిసే అవకాశం ఉండకపోవచ్చు కానీ, సరైన పోషక విలువలతో ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అనే అంశం తెలిసే ఉంటుంది.. పోషకవిలువలతో ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల, ఐరన్ ఎక్కువ మోతాదులో ఉండే ఆహారం తీసుకోవడం వల్ల..అనీమియా భారీ నుంచి తప్పించుకోవచ్చు.

దానిమ్మ పండు:

నిపుణులు సూచిస్తున్న ఆహార పదార్థాలలో దానిమ్మ పండు ఒకటి. ముఖ్యంగా దానిమ్మ పండులోని పాలిఫినాల్ ఆంటీ ఆక్సిడెంట్ మరియు నైట్రేట్స్ ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ పండు గింజలను తీసుకోవడం, దానిమ్మ పండు జ్యూస్ తాగడం, లేదంటే దానిమ్మ పండు కి సంబంధించిన సప్లిమెంట్ పదార్థాలు తీసుకోవడం కారణంగా మన body లో బ్లడ్ లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి.

బీట్రూట్:

ఎన్నో కాయగూరలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాంటి కూరగాయలలో ఒకటి బీట్రూట్. మన శరీరంలో రక్తప్రసరణ అనేది క్రమ పద్ధతిలో జరగాలి అంటే తప్పకుండా బీట్రూట్ తినాలి. వారంలో కనీసం బీట్రూట్ రెండు సార్లు తింటే, శరీరంలో బ్లడ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇందులో ఉన్న ఐరన్ నైట్ రేట్స్, ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి సహాయపడతాయి. ఫలితంగా రక్త ప్రసరణ అనేది చాలా ఫ్రీగా జరుగుతుంది. నీరసం ఎలాంటివి ఉన్నా సరే, వెంటనే నీరసం పోయి, ఉత్తేజంగా మారిపోతాము.