ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ ఎక్కాలనుకుంటున్నారా?

తూర్పు మరియు పశ్చిమ కరేబియన్ మహాసముద్రాల మధ్య షిప్ ఫెసిలిటీ మళ్లీ అందుబాటులోకి రానుందని నివేదిక చెబుతోంది. ఇది మియామి నుంచి జనవరి 27, 2024న సర్వీసును ప్రారంభించనుంది. ఐకాన్ ఆఫ్ ది సీస్ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ఎట్టకేలకు జనవరి 2024లో మొదటిసారిగా సముద్రంలో అందరికీ ఆహ్లాదాన్ని పంచడానికి రెడీ అవుతుంది. ఇది టర్కే మరియు ఫిన్‌లాండ్‌లో తన మొదటి ఓషన్ ట్రయల్‌ అద్భుతంగా ముగించుకున్నట్లు నివేదికలు తెలిపాయి. వచ్చే ఏడాది తన […]

Share:

తూర్పు మరియు పశ్చిమ కరేబియన్ మహాసముద్రాల మధ్య షిప్ ఫెసిలిటీ మళ్లీ అందుబాటులోకి రానుందని నివేదిక చెబుతోంది. ఇది మియామి నుంచి జనవరి 27, 2024న సర్వీసును ప్రారంభించనుంది.

ఐకాన్ ఆఫ్ ది సీస్ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ఎట్టకేలకు జనవరి 2024లో మొదటిసారిగా సముద్రంలో అందరికీ ఆహ్లాదాన్ని పంచడానికి రెడీ అవుతుంది. ఇది టర్కే మరియు ఫిన్‌లాండ్‌లో తన మొదటి ఓషన్ ట్రయల్‌ అద్భుతంగా ముగించుకున్నట్లు నివేదికలు తెలిపాయి. వచ్చే ఏడాది తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించనున్న ఈ భారీ నౌక మేయర్ తుర్కు షిప్‌యార్డ్ అండర్లో ఉన్నట్టు సమాచారం.

ఆహ్లాదకరమైన సముద్ర ప్రయాణం: 

తూర్పు మరియు పశ్చిమ కరేబియన్ మహాసముద్రాల మధ్య షిప్ ఫెసిలిటీ మళ్లీ అందుబాటులోకి రానుందని నివేదిక చెబుతోంది. ఇది మియామి నుంచి జనవరి 27, 2024న సర్వీసును ప్రారంభించనుంది.

నివేదికల ప్రకారం, ఐకాన్ ఆఫ్ ది సీస్ ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద క్రూయిజ్ షిప్‌లలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ముందుగా ఈ అతిపెద్ద షిప్ యొక్క పరిమాణం గురించి మాట్లాడుకుంటే, ఇది 1,200 అడుగుల అంటే సుమారు(365 మీటర్లు) పొడవు మరియు 250,800 టన్నుల బరువు తప్పకుండా ఉంటుంది.

మీడియా నివేదికల ప్రకారం, ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ గా పేరుగాంచిన ఈ నౌక, వచ్చే ఏడాది బయలుదేరాల్సి ఉంది. అంతేకాకుండా ఇందులో సుమారు దాదాపు 2,350 మంది సిబ్బంది, 5,610 మంది ప్రయాణికులతో సముద్రంలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. కానీ నిజానికి ఈ అతి పెద్ద నౌక ఇంకా ఎక్కువ సామర్థ్యంతో సముద్రంలో ఈజీగా ప్రయాణించగలదు. అంటే సుమారు ఈ నౌకలో ఒకేసారి 7,960 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

ప్రయాణికులకు సౌకర్యాలు: 

ఈ ప్రపంచంలోనే అతి పెద్ద నౌక చూడ్డానికి అందంగానే కాదు, ఈ అతి పెద్ద నౌకలో 20 డెక్‌లతో ఇంకా అనేక విలాసవంతమైన సౌకర్యాలకు నిలయంగా ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో వాటర్ పార్క్, కుటుంబ ప్రాంతాలు, ఆధునిక పాండ్, లగేజ్ స్పాట్, ఆక్వా థియేటర్, స్విమ్-అప్ బార్ ఉన్నాయి. పూల్ ఏరియా, జెయింట్ ఫ్లోర్-ఫ్లోర్-సీలింగ్ విండోస్ ప్రయాణీకులకు 220-డిగ్రీలో చుట్టూ ఏం జరుగుతుందో స్పష్టంగా చూడొచ్చు. హాయిగా కాలాన్ని గడపొచ్చు. అంతేకాకుండా మనకి ఎక్కడ చూసినా విలాసవంతమైన సౌకర్యవంతమైన వాతావరణం మనకి కనిపిస్తుంది. ప్రయాణం చేసినంత సేపు మనకి చాలా మంచి లగ్జరీ ఫీలింగ్ కలుగుతుంది. మొత్తం ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం అయితే జరిగింది అని నివేదికలు చెప్తున్నాయి.

ప్రపంచ అతిపెద్ద నౌకలో రికార్డు స్థాయిలో ఆరు కేటగిరీల 6 వాటర్ స్లైడ్‌లు ఉండడమే కాకుండా, ఇందులో మొత్తం 16 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి.

సముద్రపు వసతి: 

షిప్‌లో ఆన్‌బోర్డ్ ప్రయాణీకుల కోసం విలాసవంతమైన గదులు ఉన్నాయి, అంతేకాకుండా సుమారు గదులలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉండేలా సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే చాలా గదులు గొప్ప బాల్కనీ వీక్షణను అందిస్తాయి. సముద్ర ప్రయాణం చేస్తూనే ప్రయానికులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందించొచ్చు.

టికెట్ కాస్ట్ ఎంత: 

ధర విషయానికి వస్తే, ఒక్కొక్కరికి దాదాపు $1,703 (సుమారు రూ.1,39,707) మొదలవుతుంది.

రాయల్ కరేబియన్ ఓడ లగ్జరీ అనుభవాన్ని అందరికీ అందించేలా చూస్తుంది. మరి ఇంత పెద్ద నౌక ఎక్కాలంటే కనీసం లక్ష రూపాయలైనా పెట్టాలి కదా!