ప్రపంచంలోనే అతిపెద్ద జెయింట్‌ వీల్‌ ఆగిపోయింది

దుబాయ్‌ అంటేనే పెద్దపెద్ద బిల్డింగ్‌లు, షాపింగ్‌ మాల్స్, టూరిస్ట్ ప్లేస్‌లు, లగ్జరీ హోటల్స్ తో పాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం బుర్జ్‌ ఖలీఫా గుర్తుకు వస్తాయి. వీటన్నింటికీ మించి దుబాయ్‌లో అట్టహాసంగా ప్రారంభమై, కొద్దిరోజుల్లోనే టూరిస్టుల మనసు దోచుకున్నది నిర్మాణం ఒకటి ఉంది. అదే ‘ఫెర్రిస్‌ వీల్‌’. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన జెయింట్‌ వీల్‌గా దీనికి పేరు ఉంది. 2021లో ప్రారంభమైన ఈ జెయింట్‌ వీల్‌.. అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి […]

Share:

దుబాయ్‌ అంటేనే పెద్దపెద్ద బిల్డింగ్‌లు, షాపింగ్‌ మాల్స్, టూరిస్ట్ ప్లేస్‌లు, లగ్జరీ హోటల్స్ తో పాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం బుర్జ్‌ ఖలీఫా గుర్తుకు వస్తాయి. వీటన్నింటికీ మించి దుబాయ్‌లో అట్టహాసంగా ప్రారంభమై, కొద్దిరోజుల్లోనే టూరిస్టుల మనసు దోచుకున్నది నిర్మాణం ఒకటి ఉంది. అదే ‘ఫెర్రిస్‌ వీల్‌’. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన జెయింట్‌ వీల్‌గా దీనికి పేరు ఉంది. 2021లో ప్రారంభమైన ఈ జెయింట్‌ వీల్‌.. అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి పర్యాటకులను ఎంతగానో ఆకర్షించింది. కొద్ది నెలల్లోనే దీనిని చూడటానికి యునైటెడ్‌ అరబ్ ఎమిరేట్స్‌ కు టూరిస్టులు పోటెత్తారు. ఐన్‌ దుబాయ్‌ (దుబాయ్‌ ఐ)గా ప్రాచుర్యం పొందిన ఈ జెయింట్‌ వీల్‌ కొన్ని కారణాల వల్ల తిరగడం ఆగిపోయింది. ప్రస్తుతం అందులో ఉన్న ఎల్‌ఈడీ లైట్‌ ఫిక్చర్‌‌లు మాత్రమే  పనిచేస్తున్నాయి. 

శరవేగంగా పునరుద్ధరణ పనులు..

గత కొన్ని నెలలుగా దుబాయ్‌ ఐ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే మళ్లీ దీనిని తిరిగి ప్రారంభిస్తామని అధికారిక వెబ్‌సైట్‌లో నిర్వహకులు వెల్లడించారు. అయితే, ఎప్పుడూ అనేది కరెక్ట్ డేట్‌ చెప్పలేదు. పునరుద్ధరణ పనుల కోసం ఒక నెల మాత్రమే దీనిని మూసివేయాల్సి ఉండగా, ప్రస్తుతం జెయింట్‌ వీల్‌లో వచ్చిన సమస్యలు తీరకపోవడంతో పున:ప్రారంభం వాయిదా పడింది. అయితే, ఇది ఎప్పుడు ప్రారంభం  అవుతుందనేది నిర్వహకులు చెప్పలేకపోతున్నారు. దుబాబ్‌ ఐ పర్యాటకంగా చాలా వేగంగా అభివృద్ధి చెందడంతో దాని చుట్టూ హోటల్స్, రెస్టారెంట్లు, షాప్స్‌, కేఫ్‌లు వచ్చాయి. అయితే, ఫెర్రీస్‌ వీల్‌ మూతపడటంతో వీటి బిజినెస్‌ కూడా తగ్గిపోయింది. ఈ నిర్మాణం మూసి ఉండటం తెలిసి,చాలా మంది టూరిస్టులు ఇక్కడకు రావడానికి ఇష్టపడటం లేదు. 

ఈ జెయింట్‌ వీల్‌ మళ్లీ తెరుచుకుంటుందా.. లేదా.. అని దాని చుట్టు పక్కల వెలిసిన హోటళ్లలోని ఉద్యోగులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘గత సంవత్సరం ఫెర్రీస్‌ వీల్‌ నిర్వాహకులు శీతాకాలంలో తెరుచుకుంటుందని మాకు చెప్పారు. ఇప్పుడు కూడా వచ్చే శీతాకాలంలో తెరుచుకుంటుందని. కానీ మాక్కూడా కచ్చితంగా తెలియదు” అని సమీపంలోని ఓ షాప్‌లో పనిచేసే ఉద్యోగి వెల్లడించారు.

అంతర్జాతీయ కంపెనీల కన్సార్షియం నిర్మించిన ఈ దుబాయ్‌ ఐ బ్లూవాటర్స్‌ లో ఉంది. రిటైల్‌, రెసిడెన్షియల్‌, ఎంటర్‌‌టైన్‌మెంట్‌ హబ్‌గా రూపొందించి మానవ నిర్మిత ఐస్‌ల్యాండ్‌ ఇది. సంవత్సరానికిపైగా ఈ నిర్మాణం మూసి ఉంది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఈ జెయింట్‌ వీల్‌ను ఫొటో తీసుకొని వెళుతున్నారు. దాని లోపల అమర్చిన ఎల్‌ఈడీ లైట్లు మాత్రమే ఇప్పుడు వెలుగుతున్నాయి.

‘‘నేను ఫెర్రీస్‌ వీల్‌ గురిచి ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డును అడిగితే, అయితే,అతను అది పనిచేయదని చెప్పాడు. నేను ఎందుకు అని కారణం అడిగాను. నాకు తెలియదు అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు” అని ఓ ఈజిప్టు టూరిస్ట్‌ తెలిపాడు.

ఈఫిల్‌ టవర్‌‌ కంటే ఎక్కువ ఉక్కును వాడారు.

ఈ దుబాయ్‌ ఐ 250 మీటర్లు (825 అడుగులు) ఎత్తు ఉంది. దుబాయ్‌ పర్యాటక శాఖ ప్రకారం..లండన్‌ ఐ కంటే దాదాపు రెండు రెట్లు ఎత్తు ఎక్కువగా ఉంది. ఇది ప్రపంచంలోనే అది పెద్ద నిర్మాణం. దానిలో 48 ప్యాసింజర్‌‌ క్యాబిన్లు ఉన్నాయి. అన్నీఎయిర్‌‌ కండిషన్డ్‌. ఒకే రైడ్‌లో దాదాపు 1,750  మంది ప్రయాణికులు ఇందులో తీసుకెళ్లొచ్చు. టిక్కెట్‌ 100 దిర్హామ్‌ల(రూ.2,255)  నుంచి  4,700 దిర్హామ్‌లు (దాదాపు రూ.1,06,000)గా ఉంది. అయితే, అధికారిక ప్రకటించకుండా ఫెర్రీస్‌ వీల్‌లో సాంకేతిక లోపం ఉందంటూ పుకార్లు వ్యాపించాయి. ఈఫిల్‌ టవర్‌‌ కంటే ఎక్కువ ఉక్కుతో ఈ జెయింట్‌ వీల్‌ను తయారు చేశారు. 

 ‘‘ఈ బ్లూవాటర్స్‌ మానవ నిర్మిత ఐల్యాండ్‌. ఫెర్రీస్‌ వీల్‌ ఐల్యాండ్‌ కంటే బరువైనదని నేను విన్నాను.అందుకే ఇదిచాలా ప్రమాదకరం”అని సమీపంలోని రెస్టారెంట్‌లో వెయిటర్‌‌గా పనిచేసే ఓ వ్యక్తి చెప్పాడు. అది రన్‌ అవుతున్నప్పుడు అందులోంచి కొద్దినెలలుగా శబ్దం వస్తుందని పేర్కొన్నాడు.