అంతర్జాతీయ నృత్య దినోత్సవం… మానవ జీవనంలో భాగం

వినసొంపైన సంగీతం శ్రావ్యంగా వినబడితే శరీరం తనకు తానే లయబద్ధంగా కదలికలు చేస్తుంది. దానినే నృత్యం అంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుంటారు. దీనిని యునెస్కో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ యొక్క ఇంటర్నేషనల్ డ్యాన్స్ కమిటీ 1982లో మొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 29 రోజున నృత్య దినోత్సవం జరుపుకోవాలనే సూచనను ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ నిర్ణయించింది. 1760లో రచయిత, ఆధునిక ప్రెంచ్ నృత్యనాటికల సృష్టి కర్త అయిన జీన్ జార్జెస్ నోవేర్రే […]

Share:

వినసొంపైన సంగీతం శ్రావ్యంగా వినబడితే శరీరం తనకు తానే లయబద్ధంగా కదలికలు చేస్తుంది. దానినే నృత్యం అంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుంటారు. దీనిని యునెస్కో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ యొక్క ఇంటర్నేషనల్ డ్యాన్స్ కమిటీ 1982లో మొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 29 రోజున నృత్య దినోత్సవం జరుపుకోవాలనే సూచనను ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ నిర్ణయించింది. 1760లో రచయిత, ఆధునిక ప్రెంచ్ నృత్యనాటికల సృష్టి కర్త అయిన జీన్ జార్జెస్ నోవేర్రే జన్మ దినాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ నృత్య దినంగా ప్రకటించారు.

అసలు డ్యాన్స్ అనేది సంగీతానికి అనుగుణంగా శరీర కదలికల మీద ఆధారపడి ఉంటుంది. మానసిక ఉల్లాసానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రపంచ ప్రసిద్ధమైన నృత్యాలు కొన్ని ఉన్నాయి. మానవజాతి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు లక్షలాది ఏళ్లుగా డాన్స్ (నృత్యం) అనేది జన జీవనంలో ఒక భాగంగా కొనసాగుతూ వస్తుంది. తమకు తెలియకుండానే ఆది యుగం నాటి మనుషులు సంతోషం, దుఃఖం కలిగినప్పుడు కూడా శరీరాలను కదిలిస్తూ లయబద్దంగా నృత్యం చేసేవారని పురాణాలు చెబుతున్నాయి. వారు ప్రకృతిని, సూర్యుడిని, చంద్రుడిని దేవుళ్ళ లాగా భావించేవారు. అవి కూడా భ్రమణం చేస్తున్నాయని నమ్మేవారు. రాతి యుగపు కాలం నాటి ప్రాన్స్, స్పెయిన్, ఇండియా వంటి అనేక దేశాల కొండగుహలలో ఆదిమానవుల నాట్య దృశ్యాలు ఇప్పటికి కనిపిస్తున్నాయి.

దీని ఆధారంగా ఆది మానవుడి కాలం నుండి నాట్యం మానవ జీవితంలో ఒక భాగం అని అర్థం అవుతుంది. ఆది మానవుడు ప్రకృతిలో ఉన్న శక్తులను వశపరుచుకోవడానికి నృత్యాన్ని ఒక సాధనంగా అలవాటు చేసుకున్నారు. కుల, మత కట్టుబాట్లు మరియు ప్రకృతి పెరిగిన కొలది నృత్య రీతి కూడా పెరిగింది. కాగా పరిణామ క్రమంలో నృత్యం నుంచి కొద్ది మేర వేరే కళాత్మకత కూడా కొనసాగడం భారతదేశంలో కనిపించింది.

తెలంగాణ రాష్ట్రాంలో నాగోబా జాతర సందర్భంగా కొత్త కోడళ్ళను కుటుంబంలో కలుపుకోవడానికి గోండుకు సంబంధించిన మత పెద్దలు పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆటపాటలతో నృత్యం చేస్తారు. ఆ ఆచారం ఆదిమానవుల తెగల నుంచి సంక్రమించినదే.

మధ్యయుగ కాలం నాటికి భారతదేశంలో దేవాలయ నిర్మాణం ఒక ఉద్యమంలా తయారైంది. పూర్వం దేవాలయాలను నిర్మించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని రాజులు ఎన్నో దేవాలయాలను కట్టి పోషణ కోసం గోవులు, ఇతర ఆస్తులను దానంగా ఇచ్చేవారని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయంలోనే దేవదాసీలు అనే స్త్రీలు ఉండే వారు. వీరు సంగీత, నృత్య కళాకారిణులు. జీవితాంతం వివాహం చేసుకోకుండా దేవాలయంలోనే నృత్యం, గానం చేస్తూ తమను తాము దేవునికి సేవకు అర్పించుకొనే వారు. ఆ కాలంలో నాట్యం దేవునికి ప్రీతిపాత్రమైనదని అనేవారు.

కాగా తెలంగాణా రాష్ట్రాంలోని కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయంలో ఆరు అంగుళాల నుంచి ఆపైన పొడవు ఉన్న శిల్పాలు అలనాటి నృత్య రీతులను ఇప్పటికీ ప్రతిబింబిస్తున్నాయి. అట్లాగే మన భారత దేశంలో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నృత్య రీతులలో భరత నాట్యం, కూచిపూడి, పేరిణి, ఒడిస్సీ, కథక్, కథకళి వంటి నృత్య రీతులను ప్రతిబించే శిల్పాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ దక్షిణ భారత దేశంలో ఆ కాలంలో ఉన్న నృత్య పద్ధతులను తెలియజేస్తున్నాయి. భారతీయ నాట్య ప్రపంచంలో సింధు భాగవతులు ఆడే ఆట, బుర్రకథ, పులి నృత్యం, ఆదివాసీలు ఆడే దండారి మెుదలయిన జానపద నృత్యాలు కూడా అతి ముఖ్యమైనవి. కాగా వీటీలో దేనికదే ప్రత్యేకమైనది. మెుత్తానికి ఈ కళలు అన్ని మన జీవితంలో భాగం. ఇవి లేకుండా మన జీవితాలను ఊహించలేము.