బిల్‌గేట్స్ ఆఫీస్‌లో జాబ్.. మ‌హిళ‌కు చేదు అనుభ‌వం

నిజానికి జాబ్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు,ప్రశ్నలలో భాగంగా, ఇంతకుముందు ఎప్పుడైనా మాదకద్రవ్యాలను ఉపయోగించారా?. అంతేకాకుండా వారు ఎప్పుడైనా వివాహేతర సంబంధం పెట్టుకున్నారా?అనేవి కూడా ఉన్నట్లు నివేదికలో తేలింది. మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసులో పని చేసేందుకు జాబ్ కోసం అప్లై చేసుకున్నా ఒక మహిళకు, అధికారులు తమ తరఫునుంచి అసభ్యకరమైన ప్రశ్నలు అడిగినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తమ నివేదికలో వెల్లడించింది. ప్రశ్నలలో భాగంగానే, అభ్యర్థులకు సంబంధించి లైంగిక హిస్టరీ, అంతేకాకుండా అశ్లీలత […]

Share:

నిజానికి జాబ్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు,ప్రశ్నలలో భాగంగా, ఇంతకుముందు ఎప్పుడైనా మాదకద్రవ్యాలను ఉపయోగించారా?. అంతేకాకుండా వారు ఎప్పుడైనా వివాహేతర సంబంధం పెట్టుకున్నారా?అనేవి కూడా ఉన్నట్లు నివేదికలో తేలింది.

మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసులో పని చేసేందుకు జాబ్ కోసం అప్లై చేసుకున్నా ఒక మహిళకు, అధికారులు తమ తరఫునుంచి అసభ్యకరమైన ప్రశ్నలు అడిగినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తమ నివేదికలో వెల్లడించింది. ప్రశ్నలలో భాగంగానే, అభ్యర్థులకు సంబంధించి లైంగిక హిస్టరీ, అంతేకాకుండా అశ్లీలత గురించి ప్రశ్నలు ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. నిజానికి జాబ్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు,ప్రశ్నలలో భాగంగా, ఇంతకుముందు ఎప్పుడైనా మాదకద్రవ్యాలను ఉపయోగించారా?. అంతేకాకుండా వారు ఎప్పుడైనా వివాహేతర సంబంధం పెట్టుకున్నారా?అనేవి కూడా ఉన్నట్లు నివేదికలో తేలింది దీన్ని జర్నల్ నివేదించింది. 

అసలు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు ఉన్నాయి: 

నిజానికి బిల్ గేట్స్ ఆఫీస్ జాబ్ కోసం అప్లై చేసిన వారికి కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. అయితే ఈ ప్రశ్నలు ఒక భద్రతా సంస్థ నిర్వహించిందని తెలుస్తుంది. అయితే జాబ్ చేస్తున్నవారు ఫ్యూచర్లో బ్లాక్ మెయిల్ చేస్తే లొంగిపోతారో లేదో? ఒకవేళ లొంగిపోయి తమ డేటాని బయట వారికి అందజేస్తారేమో అని పరీక్షించడానికి ఇలాంటి ప్రశ్నలు పెట్టినట్లు తెలుస్తుంది.

” జాబ్ కోసం అప్లై చేసిన కొంతమంది మహిళా ఉద్యోగ అభ్యర్థులను, వారు ఇంతకుముందు ఎప్పుడైనా వివాహేతర సంబంధం పెట్టుకున్నారా?, వారు ఎలాంటి అశ్లీల చిత్రాలను ఇష్టపడతారు? లేదా వారి ఫోన్‌లలో తమ నగ్న ఫొటోస్ అనేవి ఏవైనా ఉన్నాయా అని అడిగారు” అని నివేదిక పేర్కొంది.

” అంతేకాకుండా కొంతమంది జాబ్ కోసం అప్లై చేసిన ఆడవాళ్లను ‘డాలర్ల కోసం డ్యాన్స్ చేశారా’ అని అడిగారు. అభ్యర్థుల్లో ఒకరిని, తాను ఎప్పుడైనా లైంగికంగా సంక్రమించే వ్యాధికి గురైందా అని కూడా అడిగారు,” అని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. 

ఇలాంటి ప్రశ్నలు మగవారికి అడిగారా?:

అయితే ఇటువంటి ప్రశ్నలను జాబ్ కోసం అప్లై చేస్తున్న మగవారికి కూడా అడిగే అవకాశం ఉన్నప్పటికీ, నివేదిక ప్రకారం ఇప్పటివరకు, జాబ్ కోసం అప్లై చేసిన మగవారికి ఇలాంటి ప్రశ్నలు అడిగినట్లు ఎక్కడా లేదు.

“నిజానికి జాబ్ కోసం అప్లై చేసిన వారికి ఇటువంటి ప్రశ్నలు ఎదురవడం గమనార్హం. ఇబ్బందికరమైన ప్రశ్నలు లాంటిది తమ ఆఫీస్ రూల్స్ కి ఉల్లంఘించే విధంగా ఉన్నాయి. నిజానికి ఇలాంటి ప్రశ్నలు అభ్యర్థులుగా అప్లై చేస్తున్న మహిళలకు ఎదురవడం నిజంగా బాధాకరం.” అంటూ బిల్ గేట్స్ ఆఫీస్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రశ్న నిర్వాహమనేది, థర్డ్-పార్టీ కాంట్రాక్టర్ కాన్‌సెంట్రిక్ అడ్వైజర్స్ నిర్వహించారు. 

ఏది ఏమైనప్పటికీ, చాలామంది మదిలో కొన్ని ప్రశ్నలు అయితే మొదలయ్యాయి. జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుకు వచ్చిన మహిళలకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవడం నిజంగా గమనార్హం. ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల మహిళలు ఉద్యోగాలు చేసేందుకు కూడా కొంతవరకు భయపడే అవకాశాలు లేకపోలేదు. ఈ ప్రశ్నలు ప్రత్యేకించి థర్డ్ పార్టీ ద్వారా నిర్వహించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అడుగుతున్నారు పబ్లిక్.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, Mr గేట్స్, $132 బిలియన్ల నికర విలువతో, ప్రపంచంలోనే నం. 4 ధనవంతుడుగా ఉన్నట్లు తెలుస్తుంది.