Tumbler: కార్ కాలిపోయినా కానీ టంబ్లర్ మాత్రం

వైరల్ అవుతున్న వీడియో..

Courtesy: Unsplash

Share:

Tumbler: సోషల్ మీడియా (Social Media) అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎటువంటి విషయాలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించేందుకు కూడా సమయం ఉండడం లేదు. అదేంటి చిన్న విషయమే అనుకునే లోపే అందుకు సంబంధించిన విషయం వైరల్ (Viral) అయి కూర్చుంటుంది. అందుకోసమే సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం వైరల్ అవుతుందో గుర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుని (Accept) తీరాలి. అందుకే వైరల్ వీడియోలను కొంత మంది మాత్రమే కాకుండా అందరూ చూస్తూ ఉంటారు. సోషల్ మీడియా వాడకం.. పెరిగిపోయిన తర్వాత పెయిడ్ ప్రమోషన్ (Paid Promotions) లు కూడా అదే రీతిలో ఉంటున్నాయి. కంపెనీలు (Companies) తమ ఉత్పత్తుల గురించి ప్రచారం చేసుకునేందుకు ఎన్ని రకాల వస్తువులైనా తక్కువ చేసి చూపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక టంబ్లర్ (Tumbler) కు సంబంధించిన వీడియో వైరల్ (Viral) అవుతోంది. ఈ టంబ్లర్ (Tumbler) నాణ్యతను గురించి తెలిపే వీడియో అది. ఈ వీడియో చూసిన చాలా మంది టంబ్లర్ (Tumbler) కంపెనీని మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

కారు కాలిపోయినా కానీ.. 

ప్రస్తుత రోజుల్లో కార్లు (Cars) కాలిపోవడం (Fire) అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఎంత పెద్ద రేట్ ఉన్న కారు అయినా సరే ఒక్కోసారి కాలిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రయాణం (Travel) మధ్యలో ఉండగానే కారు ప్రమాదాలు జరుగుతాయి. కేవలం ఎలక్ట్రిక్ కార్లు (Electric Cars) మాత్రమే ఇలా ఎక్కువగా కాలిపోతాయని అంతా అనుకుంటారు. కానీ ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా ఫ్యూయల్ కార్లు కూడా కాలిపోతూ ఉంటాయి. ప్రస్తుతం ఇలా కారు కాలిపోయిన వీడియో (Video) ఒకటి వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోలో కారు మొత్తం కాలిపోయినా కానీ అందులో ఉన్న టంబ్లర్ (Tumbler) మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. కారు కాలిపోయింది అంటే టెంపరేచర్ (Temperature) ఎంత హైలో ఉండి ఉంటుందో మనం ఇట్టే ఊహించుకోవచ్చు. కానీ అంత టెంపరేచర్ లో కూడా కారులో ఉన్న టంబ్లర్ (Tumbler) మాత్రం చెక్కుచెదరకుండా ఉండడం గమనార్హం. ఇది చూసిన నెటిజన్లు ఆ టంబ్లర్ (Tumbler) కంపెనీ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో, డేనియల్ అనే మహిళ టిక్‌ టాక్‌ (TikTok) లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో అలా పోస్ట్ చేయడంతోనే అది వైరల్ గా మారింది. ఆ మహిళ (Lady) వీడియోలో కాలిపోయిన కారును చూపించింది. అందులో భాగంగానే కారులో ఉన్న టంబ్లర్ (Tumbler) ను కూడా చూపించింది. కారు మంటల్లో కాలిపోయినపుడు టంబ్లర్ కూడా మంటల్లో (Fire)నే ఉండింది. కానీ టంబ్లర్ (Tumbler) మాత్రం చెక్కు చెదరలేదు. అందుకోసమే టంబ్లర్ (Tumbler) కంపెనీని అందరూ మెచ్చుకుంటున్నారు. వావ్ నైస్ కంపెనీ.. నైస్ ప్రొడక్ట్ అంటూ కీర్తిస్తున్నారు. కారులో అంత వేడిలో ఉన్నా కానీ టంబ్లర్ (Tumbler) కాలిపోవడం జరగలేదు. అంతే కాదు అందులో ఉన్న మంచు (Ice) (ఐస్ క్యూబ్స్) కూడా అలాగే ఉన్నట్లు మనకు సౌండ్ వినిపించింది. 

మిగతా ప్లాట్ ఫామ్ లలో కూడా.. 

దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను (Original Video) ఆ మహిళ టిక్ టాక్ లో షేర్ చేసింది. అయినా కానీ వీడియో మాత్రం అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వైరల్ అయింది. ఈ వీడియో గురించి అనేక మంది నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు (Comments) చేస్తున్నారు. కొంత మంది ఇది జెన్యూన్ అని అంటుంటే పెయిడ్ ప్రమోషన్లు అని మరికొంత మంది కొట్టిపారేస్తున్నారు. ఎవరు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినా కానీ వీడియో వైరల్ అయిందనేది మాత్రం వాస్తవం. ఒక్క ప్లాట్ ఫామ్ అని కాకుండా అన్ని రకాల ప్లాట్ ఫామ్ లలో వీడియో వైరల్ అయింది. పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ (Views) వచ్చాయి. అలాగే కామెంట్లు కూడా భారీగానే వచ్చాయి. 

కంపెనీ ప్రెసిడెంట్ ను చేరిన వీడియో.. 

టంబ్లర్ (Tumbler) కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అది ఆ టంబ్లర్ (Tumbler) కంపెనీ ప్రెసిడెంట్ కు చేరిపోయింది. అతడు కూడా ఈ వీడియోకు సంబంధించిన క్లిప్ (Clip) ను పంచుకున్నారు. స్టాన్లీ ప్రెసిడెంట్ టెరెన్స్ రీల్లీ మాట్లాడుతూ.. తాము డేనియల్‌ కి (ఆ టంబ్లర్ వీడియో పోస్ట్ చేసిన మహిళకి) కొన్ని కొత్త స్టాన్లీ టంబ్లర్‌ (Tumbler) లను పంపాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. అంతే కాకుండా ఆమెకు కొత్త కారు (Car) ను కూడా కొనుగోలు చేసి ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఒక నిమిషం నిడివి గల వీడియోలో, రిలే ఇలా పేర్కొన్నాడు. మేమంతా మీ వీడియోను చూశామని, మీరు సురక్షితంగా ఉన్నందుకు మేము ఆనందిస్తున్నామని తెలిపాడు. 

ఒక రేంజ్ లో పెరుగుదల.. 

ఈ టంబ్లర్ (Tumbler) బ్రాండ్ (Brand) ఒక రేంజ్ లో పెరుగుదలను చూస్తోంది. ఏడాదిలోనే ఈ బ్రాండ్ ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఇది దాని విక్రయాలలో సంవత్సరానికి 275% పెరుగుదలను నమోదు చేస్తోంది. ఇది అనేక కలర్స్ లో లభ్యం అవుతోంది. దీని ధర కూడా కొంచెం భారీగానే ఉంది. ఈ టంబ్లర్ ధరను (Rate) కంపెనీ 45 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించింది. అంటే , సుమారు రూ. 3,700కి ఇది లభ్యం అవుతోంది అన్న మాట.

Tags :