13 బొమ్మలను దత్తత తీసుకున్న లండన్ మహిళ

తల్లిదండ్రులుగా మారడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ లండన్ కి చెందిన ఎల్లీస్ 13 బొమ్మలను దత్తత తీసుకుంది. డాల్స్ ని కలెక్ట్ చేసిన లండన్ మహిళ వింత కథ: రిపోర్ట్స్ ప్రకారం జెస్ ఎల్లీస్ కోవిడ్ 19 టైంలో డాల్స్ ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. తను లోన్లీగా ఫీల్ అయి ఇలా డాల్స్ ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ డాల్ కోసం తను 300 డాలర్లు ఖర్చు […]

Share:

తల్లిదండ్రులుగా మారడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ లండన్ కి చెందిన ఎల్లీస్ 13 బొమ్మలను దత్తత తీసుకుంది.

డాల్స్ ని కలెక్ట్ చేసిన లండన్ మహిళ వింత కథ:

రిపోర్ట్స్ ప్రకారం జెస్ ఎల్లీస్ కోవిడ్ 19 టైంలో డాల్స్ ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. తను లోన్లీగా ఫీల్ అయి ఇలా డాల్స్ ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ డాల్ కోసం తను 300 డాలర్లు ఖర్చు చేసింది. ఆ డాల్ కి తను రెబెక్కా అనే పేరు పెట్టింది. తర్వాత తను సామ్ అనే బొమ్మను కొనింది. ఆ బొమ్మ కోసం తను 700 డాలర్లు ఖర్చు పెట్టింది. ఇప్పటివరకు తను అన్ని బొమ్మల కోసం దాదాపుగా 7500 డాలర్లు ఖర్చు పెట్టింది. అందులో జూన్, చార్లీ, పిప్పా అనే డాల్స్ కూడా ఉన్నాయి. తను కుకీ అనే ఒక డాల్ కోసం దాదాపుగా 2100 డాలర్లు ఖర్చు పెట్టింది.

న్యూయార్క్ పోస్ట్ చెప్పిన దాని ప్రకారం తనకి డాన్స్ చూడడం అంటే ఇష్టం. అందుకే అన్ని రకాల డాల్స్ ని కొనుక్కుంది. ఆ డాల్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. చాలామంది అవి నిజమైనవి అంటే కూడా నమ్మేలా ఉంటాయి. తను స్ట్రెస్ లో ఉన్నప్పుడు వాటితో స్పెండ్ చేస్తానని తను చెప్పింది. రిపోర్ట్స్ ప్రకారం తన ఫియాన్సీ తన డాల్స్ విషయంలో చాలా హెల్ప్ చేస్తున్నాడు.  వాళ్లు ఈ డాల్స్ తోనే హ్యాపీగా గడపాలి అనుకుంటున్నారని తెలిసింది. వాళ్లు పిల్లలు వద్దు అనుకుంటున్నారు. డాల్స్ తోనే జీవితమంతా ఉండాలి అనుకుంటున్నారు.

మారుతున్న మానవ జీవనశైలి:

ఒకప్పుడు పేరెంట్స్ అవ్వడం అదృష్టంగా భావించే వాళ్ళు. ఎంత కష్టమైనా సరే పిల్లల్ని కనేవాళ్ళు. ఇప్పుడు చాలామంది త్వరగా పిల్లలు వద్దు అనుకుంటున్నారు. చాలామంది బిజీ లైఫ్ స్టైల్ కి  అలవాటు పడ్డారు. ఎక్కువగా డబ్బు మీదే ఫోకస్ పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే డాల్స్ ని కొనుక్కొని వాటిని కిడ్స్ లా చూస్తున్నారు. చాలామంది పేరెంట్ హుడ్ కి రెడీగా ఉండట్లేదు. చాలా రకాల భయాల వల్ల వాళ్లు దీన్ని వాయిదా వేస్తున్నారు.

పెరుగుతున్న డాల్స్ లవర్స్:

ప్రపంచంలో డాల్స్ కి మంచి క్రేజ్ ఉంది. మార్కెట్లో రకరకాల డాల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి రేట్లు కూడా అందుబాటు ధరలోనే ఉంటున్నాయి. జెస్ ఎల్లీస్ మార్కెట్లో ఉన్న రకరకాల బొమ్మలను కొనుక్కుంది. తను కొనుక్కున్న డాల్స్ అన్ని రియలిస్టిక్ గా ఉంటాయి. తను బోర్ కొడుతుందనే వీటన్నిటిని కొనుక్కుంది. వీటితో తను సరదాగా గడుపుతుంది. కోవిడ్ 19 టైంలో చాలామంది బోర్ ఫీల్ అయి రకరకాల హాబీలను ఎంచుకున్నారు. జెస్ ఎల్లిస్ కూడా అలాంటి హాబీని ఎంచుకొని ఇలా రకరకాల బొమ్మలు కొనుక్కుంది. వాటితో గడిపితే తనకు టైమే తెలియట్లేదని తను అంటుంది. ఈ బొమ్మల కోసం తను దాదాపుగా 7500 డాలర్లు ఖర్చు పెట్టింది. ఈ బొమ్మలు తనకి చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. వీటితో ఉంటే తనకి స్ట్రెస్ అనేది ఉండదని తను చెప్తుంది. వీటివల్ల తను చాలా హ్యాపీగా ఉంటానని చెప్తుంది. భవిష్యత్తులో కూడా వీటిని ఇలాగే చూస్తానని తను చెప్తుంది. ప్రపంచంలో ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. తన హాబీ విచిత్రంగా అనిపించినా అది తనకు సంతోషాన్ని ఇస్తుంది. సంతోషం కోసం తను ఎంచుకున్న విధానం కొత్తగా ఉంది.  భవిష్యత్తులో తను మరిన్ని డాల్స్ కొనుక్కొని సంతోషంగా ఉండాలని కోరుకుందాం.