ఉక్రెయిన్ పై వివేక్‌ రామస్వామి కీలక వ్యాఖ్యలు..

అమెరికన్ అధ్యక్ష ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. 2024లో జరిగే ఈ ఎన్నికల కోసం డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ మొదలైంది. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలో పోటీ రసవత్తరంగా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు భారతీయ సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి, నిక్కీ హేలి వంటి వారు అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీలో నిలబడ్డారు. అయితే ట్రంప్ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉన్నారు. ఇటీవల కాలంలో సంచలన […]

Share:

అమెరికన్ అధ్యక్ష ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. 2024లో జరిగే ఈ ఎన్నికల కోసం డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ మొదలైంది. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలో పోటీ రసవత్తరంగా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు భారతీయ సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి, నిక్కీ హేలి వంటి వారు అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీలో నిలబడ్డారు. అయితే ట్రంప్ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉన్నారు.

ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలతో వివేక్ రామస్వామి వార్తల్లో నిలుస్తున్నారు. ట్రంపుకు మద్దతు ప్రకటిస్తూ ఈ దశాబ్ధంలో అత్యుత్తమ ప్రెసిడెంట్ ట్రంప్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇదే కాకుండా తాను అధ్యక్షుడినైతే యూఎస్ క్యాపిటల్ ఆందోళనకారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తా అని చెప్పడంతో పాటు హెచ్1బీ వీసా పాలసీని సమీక్షిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ కి మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు. గతంలో ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నియంత అయినందు వల్ల ఉక్రెయిన్ మంచి అర్థం కాదని రామస్వామి అన్నారు. ఉక్రెయిన్ 11 ప్రతిపక్ష పార్టీలను నిషేధించిన దేశమని ఆయన అన్నారు. కాలిఫోర్నియా సిమి వ్యాలీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం అతను కొన్ని నెలల క్రితం పెద్దగా తెలియకపోయినా, ఇప్పుడు అతను అగ్రశ్రేణి అభ్యర్థులలో ఒకడని వివేక్ రామస్వామి పేర్కొన్నాడు.

రామస్వామి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్‌ను ఉపయోగించడాన్ని సమర్థించారు. డెమొక్రాట్లు కూడా దీనిని ఉపయోగిస్తున్నారని మరియు ఎన్నికల్లో గెలవడానికి యువకులతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారని అన్నారు. అమెరికా కల గురించి తనకు ప్రత్యక్షంగా తెలుసునని, తాను ఎన్నికైతే ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, అమెరికన్ ఇంధన వనరులను ఉపయోగించడం మరియు నిబంధనలను తగ్గించడం ద్వారా పెరుగుతున్న ధరలు మరియు వేతనాలు వంటి ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి తన ప్రణాళికల గురించి కూడా అతను మాట్లాడాడు.

రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే రష్యా చైనాతో సైనిక సంబంధాలను నిలిపివేయాలని.. అలాగే క్యివ్, డాన్ బాస్ నాటోలో చేరకుండా ఉండాలన్నారు. రష్యాను ఓడించడం నా ఉదేశ్యం కాదు కానీ అమెరికాను గెలిపించడమే నా ఉద్దేశ్యమని అన్నారు. రష్యా-చైనా కలగలసిన సైన్యం ప్రపంచంలోనే పెద్దదని అది అమెరికాకు ఎప్పటికైనా ప్రమాదమేనని అన్నారు. అమెరికా ప్రమేయం పెరిగే కొద్దీ రష్యా చైనాకు మరింత దగ్గరవుతూ ఉంటుందని.. ఏ రాజకీయ పార్టీ ఈ ప్రస్తావనే తీసుకురావడం లేదని.. ఈ సమస్యనుకి పరిష్కరించడానికి వీలయితే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాస్కో వెళతానని అన్నారు.

గతంలో ఇదే రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంపు కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్త పరిచారు. తాను అధ్యక్షుడినైతే వెంటనే రష్యా-ఉక్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలి వంటి వారు రామస్వామి వ్యాఖ్యలను తప్పుపట్టారు.

భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, రామస్వామి వ్యాఖ్యల్ని ఖండించారు. రష్యా విజయం చైనా విజయమని ఆమె అన్నారు. అయితే రామస్వామి మాత్రం ఈ వ్యాఖ్యల్ని ఒప్పుకోలేదు. చైనా మనకు నిజమైన శత్రువని, మనమే రష్యాను చైనా చేతుల్లో పెడుతున్నామని, దీన్ని అంతం చేయాలంటే సహేతుకమైన శాంతి ప్రణాళిక అవసరమని ఆయన అన్నారు. రామస్వామి వ్యాఖ్యల్ని మైక్ పెన్స్ కూడా తప్పపట్టారు. ‘‘వివేక్ మీరు పుతిన్ కి ఉక్రెయిన్ లో మద్దతిస్తే, చైనా తైవాన్ ని ఆక్రమించుకునేందుకు పచ్చజెండా ఊపినట్లే అని, బలం ద్వారా మాత్రమే శాంతి వస్తుందని ఆయన అన్నారు.