Ghazi Hamad: ఇజ్రాయెల్ పై యుద్ధం ఆపేదేలేదు..

ఇజ్రాయెల్(Israel)పై యుద్ధం ఆపేదేలేదని తేల్చి చెప్పారు హమాస్ అధికార ప్రతినిధి ఘాజి హమాద్( Ghazi Hamad). శత్రువుకు కచ్చితంగా గుణపాఠం చెప్పితీరతామన్నారు. ఇజ్రాయెల్ ను సమూలంగా నాశనం చేయడమే తమ లక్ష్యమని ఓ ఇంటర్వ్యూ లో హెచ్చరించారు. ఇజ్రాయెల్(Israel)పై మళ్లీ మళ్లీ దాడులు చేసితీరతామని హమాస్ అధికార ప్రతినిధి ఘాజి హమాద్ (Ghazi Hamad) స్పష్టం చేశారు. ఆ దేశానికి తగిన గుణపాఠం నేర్పిస్తామని, సమూలంగా నాశనం చేసే వరకూ దాడులు ఆపేదేలేదని తేల్చి చెప్పారు. పాలస్తీనా […]

Share:

ఇజ్రాయెల్(Israel)పై యుద్ధం ఆపేదేలేదని తేల్చి చెప్పారు హమాస్ అధికార ప్రతినిధి ఘాజి హమాద్( Ghazi Hamad). శత్రువుకు కచ్చితంగా గుణపాఠం చెప్పితీరతామన్నారు. ఇజ్రాయెల్ ను సమూలంగా నాశనం చేయడమే తమ లక్ష్యమని ఓ ఇంటర్వ్యూ లో హెచ్చరించారు.

ఇజ్రాయెల్(Israel)పై మళ్లీ మళ్లీ దాడులు చేసితీరతామని హమాస్ అధికార ప్రతినిధి ఘాజి హమాద్ (Ghazi Hamad) స్పష్టం చేశారు. ఆ దేశానికి తగిన గుణపాఠం నేర్పిస్తామని, సమూలంగా నాశనం చేసే వరకూ దాడులు ఆపేదేలేదని తేల్చి చెప్పారు. పాలస్తీనా (Palestine) భూభాగాన్ని కచ్చితంగా స్వాధీనం చేసుకుంటామని, అప్పటి వరకూ పోరాడుతూనే ఉంటామని చెప్పారు. అరబ్ దేశాలకు, ముస్లిం దేశాలకు ముప్పుగా తయారైన ఇజ్రాయెల్ (Israel) ను నేలమట్టం చేస్తామని హెచ్చరించారు.  ఓ ఇంటర్వ్యూలో ఘాజి హమాద్(Ghazi Hamad) మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. 

ఇజ్రాయెల్ ను ప్రపంచ పటంలో నుంచి తొలగించాల్సిందేనన్నారు హమాస్ (Hamas) అధికార ప్రతినిధి ఘాజి హమాద్. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధానికి మూల్యం చెల్లించుకోవడానికి హమాస్(Hamas) సిద్ధమేనని తెలిపారు. సామాన్య పౌరులకు హాని చేయడం హమాస్ లక్ష్యం కాదని హమాద్ స్పష్టతనిచ్చారు. అయితే, గ్రౌండ్ అటాక్(Ground attack)లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. అమరవీరుల దేశంగా పాలస్తీనా పేరొందిందని, దేశం కోసం అమరులయ్యేందుకు ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారని హమాద్ చెప్పారు. శత్రువుకు కచ్చితంగా గుణపాఠం చెప్పితీరతామన్నారు. ఇజ్రాయెల్ ను సమూలంగా నాశనం చేయడమే తమ లక్ష్యమని ఇంటర్వ్యూ లో హెచ్చరించారు.

Also Read: Shani Louk: జర్మన్ అమ్మాయిని పొట్టనబెట్టుకున్న హమాస్ ఉగ్రవాదులు..

ప్రస్తుతం ఇజ్రాయెల్ పై జరిపిన దాడి కేవలం ప్రారంభం మాత్రమేనన్నారు. ఇకపైనా కూడా దాడులు కొనసాగిస్తునే ఉంటామని వివరించారు. రెండు, మూడు, నాలుగు.. ఇలా దాడులు చేస్తునే ఉంటామన్నారు. అయితే, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లోకి చొరబడి హమాస్ మిలిటెంట్లు జరిపిన దారుణ ఊచకోతపైనా ..ఆ  ఘటనలో సామాన్యుల మరణాలపైనా స్పందించాలని టీవీ యాంకర్ పదే పదే ప్రశ్నించారు. దీంతో ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు హమాస్ అధికార ప్రతినిధి ఘాజి హమాద్.

ఇజ్రాయెల్-హమాస్(Israel-Hamas) మిలిటెంట్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. హమాస్ చేసిన మెరుపు దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజా ప్రాంతంపై దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా ఆ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ దాడులను ఆపేయాలంటూ ప్రంపంచ దేశాలు ఇజ్రాయెల్‌కు సూచిస్తున్నాయి. 

తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) కూడా ఈ ఘర్షణలకు తాత్కాలిక విరామం ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. మిన్నియాపొలిస్‌లో నిధుల సేకరణ కోసం నిర్వహించిన కార్యక్రమంలో జో బైడెన్‌ పాల్గొన్నారు. అక్కడున్న ఓ వ్యక్తి.. ‘మీరు ఇప్పుడే కాల్పుల విరమణకు పిలుపునివ్వాలంటూ బిగ్గరగా అరిచారు. దీనికి స్పందించిన బైడెన్ విరామం అవసరమని భావిస్తున్నానని.. బందీలను బయటకు తీసుకొచ్చేందుకు సమయం ఇవ్వాలని అన్నారు.

Also Read: Israel: గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్‌ స్పందన..

తమపై దాడులకు పాల్పడ్డ హమాస్ ఉగ్రవాదుల్ని అంతం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా గాజాలోని జబాలియా శరణార్థి శిబిరం ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసింది. అయితే ఈ దాడిలో 195 మంది పాలస్తీనా ప్రజలు చనిపోయినట్లు హమాస్(Hamas) తెలిపింది. 

మరోవైపు ఇజ్రాయెల్‌ రక్షణ దళాల(IDF) ప్రతినిధి రీర్‌ అడ్మిరల్ డానియల్ హగారి మాట్లాడుతూ కచ్చితమైన నిఘా సమాచారం, సంయుక్తంగా జరుపుతోన్న దాడులతో మా దళాలు హమాస్‌ ఫ్రంట్‌లైన్‌(Hamas frontline)ను ధ్వంసం చేశాయని పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఇజ్రాయెల్‌పై మళ్లీ మళ్లీ దాడులు చేస్తామని హమాస్ అధికార ప్రతినిధి ఘాజి హమాద్ (Ghazi Hamad) అన్నారు. ఆ దేశానికి గుణపాఠం నేర్పిస్తామని, దాన్ని సమూలంగా నాశనం చేసే వరకూ దాడులు ఆపేదేలేదని తేల్చి చెప్పారు. పాలస్తీనా భూభాగానికి స్వాధీనం చేసుకునేవరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.