భారత్-కెనడా వాణిజ్య ఒప్పందానికి బ్రేకులు..

భారత్, కెనడా మధ్య సంబంధాలు చూస్తుంటే ఏమంత ఆశాజనకంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇటీవల భారత్‌లో జరిగిన జీ20 సదస్సులోనూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇతర దేశాధినేతలతో పాటు ప్రధాని మోదీతోనూ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారు. ఇప్పుడేమో భారత్, కెనడా మధ్య వాణిజ్య ఒప్పందాలు వాయిదా పడ్డాయి. అక్టోబర్ నెలలో ఈ రెండు దేశాల మధ్య జరగాల్సిన ట్రేడ్ మిషన్‌ను వాయిదా వేస్తున్నట్టు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్‌జీ ప్రతినిధి శాంతి కోసెంటినో […]

Share:

భారత్, కెనడా మధ్య సంబంధాలు చూస్తుంటే ఏమంత ఆశాజనకంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇటీవల భారత్‌లో జరిగిన జీ20 సదస్సులోనూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇతర దేశాధినేతలతో పాటు ప్రధాని మోదీతోనూ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారు. ఇప్పుడేమో భారత్, కెనడా మధ్య వాణిజ్య ఒప్పందాలు వాయిదా పడ్డాయి. అక్టోబర్ నెలలో ఈ రెండు దేశాల మధ్య జరగాల్సిన ట్రేడ్ మిషన్‌ను వాయిదా వేస్తున్నట్టు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్‌జీ ప్రతినిధి శాంతి కోసెంటినో స్పష్టం చేశారు. సరైన కారణం అయితే వాళ్లు వెల్లడించలేదు కానీ.. ఖలిస్తాన్ వేర్పాటువాద అంశమే ఈ రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది.

నిజానికి.. ఈ సంవత్సరంలోనే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్టు భారత్, కెనడా దేశాలు ఈ ఏడాది ప్రారంభంలో తెలిపాయి. ఈ ఒప్పందం కెనడా ఇండో-పసిఫిక్ వ్యూహంతో మునిపడి ఉందని, ఇది ఓ ఆదర్శ గమ్యస్థానంగా ఉంటుందని భారత్ వెల్లడించింది కూడా. తమ ఇరు దేశాలు వాణిజ్య సంబంధాలను విస్తరించడంలో, ప్రజల మధ్య సంబంధాలను పెంచుకోవడంలో పరస్పర ఆసక్తి కలిగి ఉన్నాయని కెనడా సైతం అప్పట్లో తెలిపింది. కానీ.. ఇప్పుడు అదే కెనడా దేశం ట్రేడ్ మిషన్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. భారతదేశం తర్వాత ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన కెనడాలో.. ఖలిస్తానీ కార్యకలాపాలు విస్తృతంగా పెరగడం వల్లే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. జీ20 సదస్సు తర్వాత ఖలిస్తానీ సానుభూతిపరుల ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో.. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలకు బ్రేక్ పడింది.

ఈ నేపథ్యంలో భారత్ స్పందిస్తూ.. ఇరు దేశాల మధ్య రాజకీయ విభేదాలు పరిష్కారం అయ్యాక, వాణిజ్య ఒప్పందంపై చర్చలను పునఃప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ఇది కేవలం తాత్కాలికమేనని పేర్కొంది. మరోవైపు.. కెనడాలో జీ20 సదస్సులో ఖలిస్తానీ సానుభూతిపరుల ఆందోళనలపై ప్రధాని మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కెనడాలో తీవ్రవాద శక్తులు చేస్తున్న భారత వ్యతిరేక కార్యకలాపాలపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం మరియు భారతీయ దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపించడం, దౌత్యపరమైన ఆస్తులను ధ్వంసం చేయడం మరియు వారి ప్రార్థనా స్థలాలతో సహా కెనడాలోని భారతీయ సమాజానికి బెదిరింపులకు గురిచేస్తున్న ఈ తీవ్రవాద అంశాలు, తీవ్రవాద సమూహాల మధ్య సంబంధాలు, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు మానవ అక్రమ రవాణా గురించి ,కెనడా ప్రధాని ట్రూడో ముందే మోదీ బలమైన సందేశాన్ని వ్యక్తపరిచారు. 

భారత్‌-కెనడా దౌత్య సంబంధాల పురోగతిలో పరస్పర గౌరవం, విశ్వాసం ముఖ్యమని అన్నారు. కెనడా ప్రధాని ట్రూడో కూడా ఖలిస్తానీ వేర్పాటువాదంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తమ దేశం హింసను అడ్డుకుంటుందని, కొద్దిమంది చర్యలు కెనడాకు ప్రాతినిథ్యం వహించవని తెలిపారు. 

ఇదిలావుండగా.. తమ మధ్య వాణిజ్య ఒప్పందం కోసం భారత్, కెనడా దేశాలు మొదటిసారిగా 2010లో చర్చలు ప్రారంభించాయి. చూస్తుండగానే.. సంవత్సరాలు గడిచిపోయాయే తప్ప ఒప్పందం మాత్రం కొలిక్కి రాలేదు. అనంతరం.. ఐదేళ్లు ఈ విషయంపై విరామం వచ్చింది. ఎట్టకేలకు 2022లో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు పునఃప్రారంభమయ్యాయి. ఇప్పటివరకూ ఇరు దేశాల మధ్య అరడజనుకుపైగా చర్చలు జరిగాయి. 2022 మార్చిలో ఇరు దేశాలు ‘ఎర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్’ (EPTA) కోసం తిరిగి చర్చల్ని ప్రారంభించాయి. ఈ ఒప్పందంలో.. రెండు దేశాలు తమ మధ్య వర్తకం చేసే గరిష్ట సంఖ్యలో వస్తువులపై సుంకాన్ని గణనీయంగా తగ్గించాలి.