Vatican City: వాటికన్‌ సిటీలో పిల్లలు ఎందుకు పుట్టరో తెలుసా?

ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం చైనా(China) కంటే భారత్‌(India)లో ఎక్కువ మంది జనాభా(Population) ఉన్నారని ఐక్యరాజ్యసమితి(United Nations) పేర్కొంది. కానీ పిల్లలు పుట్టని ప్రదేశం ఒకటి ఉంది, అదే వాటికన్‌ సిటీ(Vatican City). ఇక్కడ పిల్లలు పుట్టరు. కారణం ఏమిటన్నదాని గురించి తెలుసుకుందాం రండి.  పెళ్లైన దంపతులు తమకు పిల్లలు పుట్టాలనే కోరుకుంటారు. మాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు. పుట్టే పిల్లలు వారి కుటుంబానికే కాదు.. వారు పుట్టిన గడ్డకు కూడా మేలే జరుగుతుంది. ఒక […]

Share:

ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం చైనా(China) కంటే భారత్‌(India)లో ఎక్కువ మంది జనాభా(Population) ఉన్నారని ఐక్యరాజ్యసమితి(United Nations) పేర్కొంది. కానీ పిల్లలు పుట్టని ప్రదేశం ఒకటి ఉంది, అదే వాటికన్‌ సిటీ(Vatican City). ఇక్కడ పిల్లలు పుట్టరు. కారణం ఏమిటన్నదాని గురించి తెలుసుకుందాం రండి. 

పెళ్లైన దంపతులు తమకు పిల్లలు పుట్టాలనే కోరుకుంటారు. మాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు. పుట్టే పిల్లలు వారి కుటుంబానికే కాదు.. వారు పుట్టిన గడ్డకు కూడా మేలే జరుగుతుంది. ఒక దేశ వృద్ధి చెందాలంటే మానవ వనరులు చాలా ముఖ్యం. అందులోనూ యువకులు(Youth) చాలా ముఖ్యం. యువతే లేకుండా.. ఆ దేశాభివృద్ధి అనేది ఎంతమాత్రం సాధ్యం కాదు. మరి యువత కావాలంటే.. పిల్లలు పుట్టాలి. ఆ పిల్లలు(children) పెరిగి పెద్దవారు అవ్వాలి. అందుకే చాలా దేశాలు ప్రజలను పిల్లలను కనండి బాబోయ్ అని అభ్యర్థిస్తుంటాయి.

అయితే, ప్రపంచ దేశాలన్నీ ఒక రూట్‌లో వెళ్తే.. ఈ దేశం మాత్రం రివర్స్‌ రూట్‌లో వెళ్తుంది. అవును, ఇక్కడ పిల్లలకు జన్మనివ్వడం నేరమట. పిల్లలకు జన్మనివ్వడానికి ఆస్పత్రులు కూడా లేవు. స్త్రీ, పురుషులకు ఎలాంటి హక్కులు(Rights) లేవు. ఈ విచిత్ర రూల్‌ ఉన్న దేశం మరేదో కాదు.. వాటికన్ సిటీ(Vatican City). వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. క్రైస్తవ మతానికి(Christianity) చెందిన అగ్ర నాయకులు ఇక్కడ నివస్తున్నారు. 

ఇక్కడ బ్రహ్మచారులు(Brahmacharis) ఎక్కువ. ఇక్కడి పూజారులు(Priests), పిల్లలు పుట్టకూడదనే నియమాన్ని పాటిస్తారు. ఈ నియమం వారి బలమైన మత విశ్వాసాల నుండి వచ్చింది.  వాటికన్ సిటీ(Vatican City) అత్యంత సురందమైన ప్రదేశాలలో ఒకటి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వాటికన్ నగరాన్ని తన జన్మస్థలంగా ఎవరూ పిలవలేరు. ఎందుకంటే ఇక్కడ ప్రసవం కోసం ఎలాంటి ఆస్పత్రి సౌకర్యాలు లేవు.

మతం(religion) కారణంగా వాటికన్ సిటీ(Vatican City) మత పెద్దలు ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి అనుమతించరు. ఇక్కడ మొత్తం 800 మంది మాత్రమే నివసిస్తున్నారు. వారిలో 30 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. వీరు కూడా ఎక్కువగా ఇక్కడ ఉండరు. పురుషులు, మహిళలకు డ్రెస్ కోడ్(Dress Code) కూడా ఉంటుంది. మినీ స్కర్ట్‌లు, షార్ట్‌లు, స్లీవ్‌లెస్ వంటి దుస్తులు ఇక్కడ నిషిద్ధం. అక్కడ పనిచేసే వారికే పౌరసత్వం ఇస్తారు. చాలా మంది మహిళలు టీచర్లుగా, జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు.  

మీడియా నివేదికల ప్రకారం, వాటికన్ పోప్ ప్యాలెస్‌లో భద్రత కోసం కేవలం 130 మంది మాత్రమే ఉంటారు. వీరంతా స్విస్ ఆర్మీ నుంచి ఎంపికై 30 ఏళ్ల లోపు వారే. ఇక్కడ ప్రజా రవాణా వ్యవస్థ(Transport) కూడా ఉండదు. 300 మీటర్ల పొడవైన రైల్వే ట్రాక్(Railway Track) ఉంది. అందులో సరుకులు మాత్రమే తీసుకెళ్తారు. నగరం మొత్తం కేవలం 49 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడి పౌరులు పాస్‌పోర్ట్, లైసెన్స్ కలిగి ఉంటారు. కానీ సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఇక వాటికన్ సిటీ విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతి చిన్న దేశం అయినప్పటికీ క్రైం(Crime) రేటు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలలో మాత్రం మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఈ దేశంలో రోజూ ఎక్కువమంది దుండగలు టూరిస్టు(Tourist)ల నుంచి డబ్బు, బంగారం మరియు ఇతర ఖరీదైన వస్తువులను దొంగలిస్తూ ఉంటారు. ఈ క్రమంలో దుండగులు అప్పుడప్పుడు తుపాకులతో కూడా రోడ్లపై దర్శనమిస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా తమ వస్తువులు పోగొట్టుకుని పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. 

కాబట్టి ఈసారి మీరు వాటికన్ సిటీ(Vatican City)  దేశానికి చూడటానికి వెళ్ళినప్పుడు మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక ఈ దేశంలో భద్రతా దళం(Security Forceలో పని చేసే సైనికులకు చాలా కఠినమైన శిక్షణ ఇస్తారు. అలాగే ఈ దేశపు ఆర్మీ విభాగంలో పని చెయ్యాలంటే తన పదివీకాలం ముగిసేంతవరకూ బ్రహ్మచారిగానే ఉండాలి. అలాకాకుండా తన పదవీకాలంలో ఎవరైనా మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా లేక రహస్యంగా పెళ్లి చేసుకున్నా సైనికుడి కి కఠిన శిక్షలు తప్పవు. అంతేకాకుండా ఒక్కోసారి దేశ బహిష్కరణ కూడా విధిస్తారు.