రాపర్ శుభ్ కు నెట్టింట తీవ్ర వ్యతిరేకత..

భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఓ పంజాబీ సింగర్‌ నెట్టింట తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. సామాజిక మాధ్యమాల్లో అతడు చేసిన పోస్టులు ఈ విమర్శలకు కారణమయ్యాయి. ఎవరా సింగర్‌..? అసలేం జరిగిందంటే..?  ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్యతో భారత్‌ కు సంబంధం ఉందంటూ కెనడా  ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. కెనడాలో […]

Share:

భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఓ పంజాబీ సింగర్‌ నెట్టింట తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. సామాజిక మాధ్యమాల్లో అతడు చేసిన పోస్టులు ఈ విమర్శలకు కారణమయ్యాయి. ఎవరా సింగర్‌..? అసలేం జరిగిందంటే..? 

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్యతో భారత్‌ కు సంబంధం ఉందంటూ కెనడా  ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. కెనడాలో ఉంటున్న ప్రముఖ భారత గాయకుడు శుభ్‌నీత్ సింగ్‌ విమర్శల్లో చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ  వంటి ప్రముఖ క్రికెటర్లు అతడిని సామాజిక మాధ్యమాల్లో అన్‌ఫాలో చేశారు. అతడి భారత్‌ టూర్‌ కూడా రద్దయ్యింది.

ఎవరీ శుభ్‌..?

పంజాబ్‌కు చెందిన గాయకుడు, నటుడు రన్‌వీత్‌ సింగ్‌ సోదరుడైన 26 ఏళ్ల శుభ్‌నీత్‌  కొన్నేళ్ల క్రితం కెనడా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అక్కడి నుంచే తన ర్యాప్‌ సింగింగ్‌ జర్నీని ప్రారంభించాడు. 2021లో అతడు ‘వి రోల్‌ ఇన్‌’ పేరుతో ఓ ఆల్బమ్‌ సాంగ్‌ విడుదల చేశాడు. అది ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ పొందింది. కోట్ల మంది ఆ పాటను వీక్షించారు. ఆ తర్వాత ‘డోంట్‌ లుక్‌’ సాంగ్‌తో ర్యాప్‌ అభిమానులకు మరింత చేరువయ్యాడు. దీంతో ‘స్టిల్‌ రోల్‌ ఇన్‌’ పేరుతో ర్యాప్‌ సింగర్‌గా తన తొలి భారత్‌ టూర్‌ను ఇటీవల ప్రకటించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 10 నగరాల్లో ప్రదర్శనలిచ్చేందుకు సిద్ధమయ్యారు. సెప్టెంబరు 23-25 తేదీల్లో ముంబయిలో అతడు ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.

‘ఖలిస్థానీ’ పోస్టులతో వివాదంలోకి..

అయితే శుభ్‌ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఖలిస్థానీ ఉద్యమానికి అనుకూలంగా కొన్ని పోస్టులు చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని అభ్యంతకర ఫొటోలు పెట్టాడు. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అతడి ప్రదర్శనను రద్దు చేయాలని ఇటీవల ముంబయిలో భాజపా యువజన విభాగం ఆందోళన చేపట్టింది.

అన్‌ఫాలో చేసిన క్రికెటర్లు..

టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్స్‌కు శుభ్‌ ఆల్బమ్స్‌ అంటే చాలా ఇష్టం. అతడు తన ఫేవరెట్‌ ఆర్టిస్ట్‌ అని గతంలో ఓసారి కోహ్లీ చెప్పాడు. కేఎల్ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, సురేశ్ రైనా తదితర క్రికెటర్లు కూడా శుభ్‌ను ఇన్‌స్టాలో ఫాలో అయ్యారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వీరంతా అతడిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసినట్లు తెలిసింది.

భారత పర్యటన రద్దు..

మరోవైపు, సెప్టెంబరు 19న, శుభ్‌ భారత్‌ టూర్‌ కోసం తాము ప్రకటించిన స్పాన్సర్‌షిప్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రముఖ కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ బోట్‌ ప్రకటించింది.  అటు, శుభ్‌ భారత టూర్‌ కూడా రద్దయ్యింది. ఈ విషయాన్ని అతడికి స్పాన్సర్‌గా ఉన్న బుక్‌మైషో ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. గాయకుడు ఇంతకుముందు వివాదాస్పదంగా చేసి పోస్ట్ పై వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో భారతదేశ మ్యాప్‌ను పోస్ట్ చేశాడు, అయితే అది జమ్మూ కాశ్మీర్, పంజాబ్ మరియు కొన్ని ఈశాన్య రాష్ట్రాల వంటి ముఖ్యమైన భాగాలను వదిలిపెట్టినట్టుగా కనిపిస్తుంది. భారతదేశ పటాన్ని పంచుకున్నప్పుడు, దానిపై “ప్రే ఫర్ పంజాబ్” అని కూడా రాశాడు. అయితే దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది బోట్‌కు కలత కలిగించింది, కాబట్టి వారు అతని పర్యటనను స్పాన్సర్ చేయకూడదనుకున్నారు.

ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత వాతావరణం మరింత ముదిరింది. కెనడాలోని భారత దౌత్యవేత్తపై ఆ దేశం బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే కెనడా ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే ఆ దేశానికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. తాజాగా మన దేశంలోని కెనడా రాయబారిని భారత్ బహిష్కరించింది.