India-US-Canada: అమెరికా అభ్యర్థనకు ఓకే.. కెనడాకు మాత్రం నో

కీలక కేసుల దర్యాప్తుపై భారత దౌత్యవేత్త వ్యాఖ్యలు..

Courtesy: Twitter

Share:

India-US-Canada: ఖలిస్థానీ ఉగ్రవాదులు నిజ్జర్‌(Nijjar), పన్నూలకు సంబంధించిన కేసుల్లో అమెరికా(America), కెనడా(Canada) కోరిన దర్యాప్తులకు భారత్‌(India) వేర్వేరుగా స్పందించింది. ఇందుకు స్పష్టమైన కారణం ఉందని కెనడాలోని భారత హై కమిషనర్‌(Indian High Commissioner) వెల్లడించారు. అదేంటంటే..?

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannu) హత్యకు  కుట్ర కేసులో అమెరికా (USA) దర్యాప్తునకు భారత (India) ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడా (Canada)లోని భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ (Sanjay Kumar Verma) వెల్లడించారు. కానీ, నిజ్జర్ హత్య కేసులో(Nijjar murder case) మాత్రం కెనడా దర్యాప్తునకు దిల్లీ సహకరించబోదని తేల్చిచెప్పారు. సమాచారం పంచుకునే విషయంలో రెండు దేశాల మధ్య ఉన్న తేడా కారణంగానే భారత ప్రభుత్వం స్పందన కూడా వీరి విషయంలో భిన్నంగా ఉందని ఆయన వివరించారు.

కెనడాలో(Canada) ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్‌ కుమార్‌ వర్మ(Sanjay Kumar Verma) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు తెలిసినంత వరకు.. (పన్నూ హత్య కుట్ర కేసు) దర్యాప్తునకు సంబంధించి అమెరికా (America) అధికారులు నిర్దిష్టమైన సమాచారాన్ని భారత్‌తో పంచుకున్నారు. అమెరికాలో గ్యాంగ్‌స్టర్లు, మాదక ద్రవ్యాల రవాణదారులు, ఉగ్రవాదుల(Terrorists) గురించి ఆ దేశం కీలక సమాచారం అందించింది. ఈ కుట్రలో భారత్‌లోని వారికి సంబంధం ఉండొచ్చని అమెరికా(America) భావించింది. ఇక్కడ భారత్‌కు సంబంధం అంటే.. ప్రభుత్వానికి అని కాదు.. 140 కోట్ల మందిలో ఎవరో ఒకరికి అని. న్యాయపరంగా ఆ సమాచారం సమర్థించదగినది కావడంతో అమెరికా దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది’’ అని సంజయ్‌ వర్మ (Sanjay Kumar Verma) వ్యాఖ్యానించారు.

‘ఇక, నిజ్జర్‌(Nijjar) కేసు విషయానికొస్తే.. దీని దర్యాప్తునకు సంబంధించి కెనడా నుంచి ఎలాంటి నిర్దిష్టమైన సమాచారం లేదా ఆధారాలు అందలేదు. కేసు గురించి ఎలాంటి వివరాలు లేనప్పుడు.. మేం దానిపై ఎలా స్పందించగలం? అందుకే, ఆధారాలివ్వండని మేం అడుగుతున్నాం. ఆ సమాచారం ఇవ్వనంతవరకు కెనడా దర్యాప్తుపై మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. ఈ రెండు కేసుల్లో భారత స్పందన భిన్నంగా ఉండటానికి కారణమిదే’’ అని సంజయ్‌ వర్మ(Sanjay Kumar Verma) వెల్లడించారు.

ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూను (Khalistani terrorist Pannu) అమెరికా గడ్డపై హత్య చేసేందుకు జరిగిన కుట్రను అగ్రరాజ్యం భగ్నం చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి భారత్‌తో అమెరికా(America) చర్చించినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. దీనిపై ఇటీవల భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అమెరికా పంచుకున్న సమాచారాన్ని సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయని తెలిపింది.

ఈ ఏడాది జూన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్(Hardeep Singh Nijjar) కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అవన్నీ నిరాధారమైన, కుట్రపూరిత ఆరోపణలేనని కొట్టిపారేసింది. భారత్‌లోని 41 మంది కెనడా దౌత్యవేత్తలకు, వారి కుటుంబాలకు ఉండే అంతర్జాతీయ దౌత్యపరమైన రక్షణలను ఉపసంహరిస్తామని భారత్‌ అల్టిమేటం(India's ultimatum) జారీ చేసిన నేపథ్యంలో ఆ దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుంటున్నట్టు కెనడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై అమెరికా(America), బ్రిటన్‌(Britan) దేశాలు స్పందించాయి. ఈ విషయంలో కెనడాకు మద్దతుగా నిలిచాయి.

ఈ మేరకు దౌత్యవేత్తల సంఖ్య తగ్గించాలంటూ కెనడాను ఒత్తిడి చేయొద్దని భారత ప్రభుత్వాన్ని(Government of India) కోరాయి. ‘దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలన్న భారత్ డిమాండ్ మేరకు కెనడా దౌత్యవేత్తల తరలింపు మాకు ఆందోళన కలిగిస్తోంది’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్(Matthew Miller) పేర్కొన్నారు. ‘క్షేత్రస్థాయిలో విభేదాలను పరిష్కరించేందుకు దౌత్యవేత్తలు అవసరం. దౌత్య సిబ్బందిని తగ్గించాలని పట్టుబడవద్దని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే నిజ్జర్‌ హత్య(Nijjar murder) విషయంలో కెనడా దర్యాప్తునకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందం ప్రకారం భారత్‌ తన బాధ్యతలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ‘కెనడా దౌత్యవేత్తలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలంటూ భారత ప్రభుత్వం (India Govt.) తీసుకున్న నిర్ణయాలతో మేం ఏకీభవించడం లేదు. కెనడా దౌత్యవేత్తల ఏకపక్ష తొలగింపు వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణం కాదు’ అని బ్రిటన్‌ వెల్లడించింది.