Maisa Abdel Hadi: శత్రు దేశానికి మద్దతు.. ఇజ్రాయెల్ నటి అరెస్ట్

స్వదేశంలో ఉంటూ శత్రు దేశాలని సమర్ధించే దేశ ద్రోహులను చటం శిక్షిస్తుంది. ఇలాంటి దేశ ద్రోహులు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. తాజాగా  నటి మైసా అబ్దెల్ హదీ(Maisa Abdel Hadi) స్వదేశంపై దాడి చేసిన శత్రు దేశానికి మద్దతు ఇచ్చింది. దీనితో ఆ నటిని ఆ దేశంలోని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళ్తే.. ఇజ్రాయిల్ హమాస్(Israel – Hamas) మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అరబ్ ఇజ్రాయిల్ నటి మైసా అబ్దెల్ హదీ(Maisa […]

Share:

స్వదేశంలో ఉంటూ శత్రు దేశాలని సమర్ధించే దేశ ద్రోహులను చటం శిక్షిస్తుంది. ఇలాంటి దేశ ద్రోహులు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. తాజాగా  నటి మైసా అబ్దెల్ హదీ(Maisa Abdel Hadi) స్వదేశంపై దాడి చేసిన శత్రు దేశానికి మద్దతు ఇచ్చింది. దీనితో ఆ నటిని ఆ దేశంలోని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళ్తే..

ఇజ్రాయిల్ హమాస్(Israel – Hamas) మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అరబ్ ఇజ్రాయిల్ నటి మైసా అబ్దెల్ హదీ(Maisa Abdel Hadi) హామాస్(Hamas) కి సోషల్ మీడియా వేదికగా మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటన పైన పోలీసులు మాట్లాడుతూ.. అక్టోబరు 7వ తేదీన ఇజ్రాయెయిల్ పైన హమాస్ దాడిచేసే సమయంలో గాజా స్ట్రిప్ మరియు ఇజ్రాయెల్ మధ్య కంచెను బుల్డోజర్ తో బద్దలు కొడుతున్న ఫోటోనో సోషల్ మీడియా(Social Media) వేదికగా హదీ పోస్ట్(Post) చేశారు. అలానే దానికి 1989 వరకు జర్మనీని విభజించిన బెర్లిన్ గోడ పతనానికి సూచనగా “లెట్స్ గో బెర్లిన్-స్టైల్” (Let’s go Berlin-style)అని ఆమె ఒక క్యాప్షన్‌లో రాసింది. అలానే హమాస్ ఉగ్రవాదులు బంధించిన 85 ఏళ్ల వృద్ధురాలు యఫ్ఫా అదర్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వాటికి నవ్వుతున్న ఎమోజిని జోడించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా(Social Media) వేదికగా ఉగ్రవాదాన్ని ప్రేరేపించింది అనే అనుమానంతో నటి మైసా అబ్దెల్ హదీ(Maisa Abdel Hadi)ని అరెస్ట్ చేశామని వెల్లడించారు.

Read More: US: బరిలోకి దిగబోతున్నా యూఎస్ మిలటరీ బలగం

అక్టోబర్ 7వ తేదీన.. పాలస్తీనా సరిహద్దులోని గాజాస్ట్రిప్(Gazastrip) దాటి, ఇజ్రాయెల్ లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు భారీ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు 1,400 మంది ఇజ్రాయెలీలు మరణించారు. తర్వాత 200 మంది ఇజ్రాయెల్ ప్రజలను హమాస్ మిలిటెంట్లు బందీలుగా పట్టుకుని, తమతో గాజాకు తీసుకెళ్లారు. హమాస్ మిలిటెంట్లు, గాజాను తమ అడ్డాగా మార్చుకొని అక్కడే ఉంటున్నారు. అందువల్ల అక్టోబర్ 8 నుంచి గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

 ఈ యుద్ధం కారణంగా ప్రపంచం రెండుగా విడిపోయింది. అరబ్ దేశాలు… హమాస్, పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి. ఐరోపాతో సహా అనేక పశ్చిమ దేశాల మొగ్గు ఇజ్రాయెల్ వైపు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక భారత్‌(India) గురించి మాట్లాడితే హమాస్‌ ఉగ్రవాదుల దాడిని ప్రధాని మోదీ(PM Modi) ఖండించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని ఆయన సూచించారు.

కాగా 37 ఏళ్ల నటి వివిధ ఇజ్రాయెలీ షోలలో, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ “వరల్డ్ వార్ జెడ్”(World War Z) మరియు ఇటీవల, బ్రిటిష్ టెలివిజన్ సిరీస్ “బాగ్దాద్ సెంట్రల్”(Baghdad Central)లో నటించింది. 2011లో దుబాయ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మైసా అబ్దెల్ హదీ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఆమె నజరేత్‌లో జన్మించింది. ఈ ఘటన పైన ఆమె స్నేహితుడు అలానే ఇజ్రాయెలీ సహనటుడు అయినటువంటి ఆఫర్ షెచ్టర్ కూడా సోషల్ మీడియా వేదికగా హాది ని నిందించాడు.. ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో.. నాకు నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది.. ఇక్కడ ఉంటూ (Offer Schechter)హమాస్ కు మద్దతు ఇచ్చినదుకు సిగ్గుపడాలి మీరు.. మీరు నజరేత్‌(Nazareth)లో నివసిస్తున్నారు. ఇక్కడ మా టీవీ షోల్లో, చిత్రాల్లో నటిస్తూ మమ్మల్నే వెన్నుపోటు పొడిచారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మే 2021లో తూర్పు జెరూసలేంలోని పాలస్తీనా(Palestine) కుటుంబాల వారిని, అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆరోపిస్తూ, అందుకు నిరసనగా హైఫా నగరంలో శాంతియుత నిరసన ప్రదర్శనలో మైసా కూడా పాల్గొంది. అప్పుడు ఆ నిరసనకారులపై ఇజ్రాయెల్ భద్రతా దళాలు జరిపిన దాడిలో ఆమె కూడా గాయపడినట్లు సమాచారం. మైసాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది.