కెన‌డా వేటు వేసిన భార‌త అధికారి ఇత‌నే..

ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది హ‌ర్దీప్‌ను చంపిన వ్య‌క్తుల్లో భార‌త అధికారి హ‌స్తం ఉంద‌ని కెన‌డా ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు వస్తాయో… ఎలా వస్తాయో చెప్పడం చాలా కష్టం. ఉన్నట్టుండి అంతా బానే ఉన్న సమయంలో దేశాల మధ్య విబేధాలు వస్తాయి. ఇలా విబేధాలు వచ్చినపుడు కొన్ని సార్లు అమాయకులు బలవుతూ ఉంటారు. అందుకోసం అసలు విషయం ఏంటి? ఎక్కడ జరిగింది ఎవరు కారణం అయి ఉంటారని తెలుసుని వ్యవహరించడం చాలా అవసరం. అలా […]

Share:

ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది హ‌ర్దీప్‌ను చంపిన వ్య‌క్తుల్లో భార‌త అధికారి హ‌స్తం ఉంద‌ని కెన‌డా ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు వస్తాయో… ఎలా వస్తాయో చెప్పడం చాలా కష్టం. ఉన్నట్టుండి అంతా బానే ఉన్న సమయంలో దేశాల మధ్య విబేధాలు వస్తాయి. ఇలా విబేధాలు వచ్చినపుడు కొన్ని సార్లు అమాయకులు బలవుతూ ఉంటారు. అందుకోసం అసలు విషయం ఏంటి? ఎక్కడ జరిగింది ఎవరు కారణం అయి ఉంటారని తెలుసుని వ్యవహరించడం చాలా అవసరం. అలా కాకుండా ఇష్టారీతిన వ్యవహరించడం వలన కొన్ని సార్లు సిన్సియర్ ఆఫీసర్ల సేవలను మనం కోల్పోవాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ఇటువంటి వేగవంతమైన డెసిషన్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం కెనడా ప్రధాని ట్రూడో తీసుకున్న నిర్ణయం వల్ల కూడా ఇలాగే ఓ అధికారి బలయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే…. 

ఖలిస్థానీ హతం..

ఖలిస్థానీ ఉగ్రవాది, ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ వ్యవస్థాపకుడు హరిదీప్ సింగ్ నిజ్జర్ ఇద్దరు దుండగుల చేత కాల్చి చంపబడ్డాడు. అతడిని ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ప్రకటించింది. అంతే కాదు అతడి తల మీద రూ. 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. అలా రివార్డు ప్రకటించిన వ్యక్తిని ఇండియా ఎందుకు చంపుతుందనే విషయం కూడా ఆలోచించకుండా కెనడా ప్రధాని ట్రూడో ఇందులో కెనడాలో భారత రాయబారిగా సేవలందిస్తున్న పవన్ కుమార్ రాయ్ హస్తం ఉందని అనుమానిస్తూ అతడిని పదవి నుంచి తొలగించాడు. ఈ చర్యలను భారత్ ఖండించింది. భారత్ ఏం తక్కుత కాదని నిరూపిస్తూ ఇండియాలో కెనడా రాయబారిగా ఉన్న వ్యక్తిని ఇండియా కూడా పదవి నుంచి తొలగించింది. 

దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కెనడా ప్రధాని ఏదో ఆవేశంలో చేశారు తప్ప ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను చంపేందుకు పవన్ కుమార్ రాయ్ ఎందుకు సహాయం చేస్తాడని ఒక్క విషయం ఆలోచించకపోవడం దారుణం. అతడిని పదవి నుంచి తొలగించినంత మాత్రాన అబద్దం అనేది నిజం గా మారదు. చనిపోయిన వ్యక్తి వెంటనే లేవడు. ఈ మాత్రం కెనడా ప్రధాని ఆలోచిస్తే బాగుండేది. కెనడా ప్రధాని నిర్దాక్షిణ్యంగా పదవి నుంచి తొలగించబడిన వ్యక్తి ఒక సీనియర్ అండ్ సిన్సియర్ ఆఫీసర్. అతడు 1997 బ్యాచ్‌ కు చెందిన పంజాబ్ కేడర్‌ ఐపీఎస్ అధికారి. పవన్ కుమార్ రాయ్ జూలై 1, 2010 నుంచి సెంట్రల్ డిప్యూటేషన్‌ పై ఉన్నారు. డిసెంబర్ 2018లో అతను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీగా నియమితుడయ్యాడు. క్యాబినెట్ సెక్రటేరియట్‌ లో డైరెక్టర్‌ గా కూడా పనిచేశాడు. సెంట్రల్ డిప్యూటేషన్‌ కు ముందు సీఐడీ అమృత్‌సర్‌ లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ గా పనిచేశారు. 

కెనడాలో పెట్రేగిపోతున్న ఖలిస్థానీ తీవ్రవాదం

ప్రస్తుత రోజుల్లో ఖలిస్థానీ తీవ్రవాదం మరీ పెట్రేగిపోతుంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో పోలిస్తే కెనడాలో ఈ సంస్కృతి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఎంత దారుణంగా తయారయిందంటే చాలా దేశాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీల మీదకు ఖలిస్థానీ వేర్పాటు వాదులు దాడులకు బయలుదేరుతున్నారు. అంతే కాకుండా పలు ప్రాచీన ఆలయాల్లో కూడా ఖలిస్థానీ జెండాలు ఏర్పాటు చేస్తూ సవాల్ విసురుతున్నారు. మరో పక్క ఖలిస్థానీ మద్దతుదారులు చనిపోతే మాత్రం ఇండియన్స్ చంపారంటూ ఇలా రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇక ఖలిస్థానీ నేత నిజ్జర్ హత్య విషయానికే వస్తే… అతడు చనిపోయిన తర్వాత కెనడా పోలీసులు ఇంతవరకు ఎవర్ని కూడా అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. మనోడు మళ్లీ సాధారణంగా కూడా చనిపోలేదు. అతడిని ఎవరో ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఇంత జరిగితే కేవలం కెనడా గవర్నమెంట్ అన్యం పుణ్యం తెలియని ఆఫీసర్ ను ఈ ఘటన మొత్తానికి బలి చేసినట్లు ఉంది. 

బహిరంగంగానే బెదిరించారు.. 

ఖలిస్థానీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ మితి మీరి పోతున్నాయి. వారు పోస్టర్ల ద్వారా మరియు బ్యానర్ల ద్వారా పలువురిని చంపుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా కానీ కొందరు అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా వారినే సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల ఖలిస్థానీ నాయకులు భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, భారత న్యాయవాది అపూర్వ శ్రీవాస్తవతో సహా అనేక మంది భారతీయ దౌత్యవేత్తలను బెదిరించారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే…. ఇదే కెనడాలో అనేక హిందూ దేవాలయాలను ఖలిస్థానీ నాయకులు నాశనం చేశారు. కానీ ఈ దేవాలయాల ధ్వంసం మీద కెనడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక నైనా కెనడా దేశం ఖలిస్థానా సానుభూతి పరులకు మద్దతు ఇవ్వకుండా న్యాయం వైపు నిలబడితే మంచి జరుగుతుంది.