వైట్ హౌస్ లో కొకైన్ కలకలం

అసలు ఏం జరిగింది: వైట్ హౌస్ లో వీకెండ్ దొరికిన వైట్ పౌడర్ కొకైన్ గా గుర్తించారు. ఈ పౌడర్ ని సీక్రెట్ ఏజెంట్ ఆదివారం 8:45 గంటలకు కనిపెట్టాడు. ఆ టైంలో ప్రెసిడెంట్ జో బైడెన్ అక్కడ లేడు. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ వాళ్ళు వచ్చి దీన్ని పరిశీలించారు. ఇది కొకైన్ అని వాళ్ళు కన్ఫామ్ చేశారు. తర్వాత దాన్ని సీక్రెట్ టెస్టింగ్ ఏజెన్సీకి పంపారు అది ఏ ఐటమ్ అనేది మాత్రం ఇంకా […]

Share:

అసలు ఏం జరిగింది:

వైట్ హౌస్ లో వీకెండ్ దొరికిన వైట్ పౌడర్ కొకైన్ గా గుర్తించారు. ఈ పౌడర్ ని సీక్రెట్ ఏజెంట్ ఆదివారం 8:45 గంటలకు కనిపెట్టాడు. ఆ టైంలో ప్రెసిడెంట్ జో బైడెన్ అక్కడ లేడు. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ వాళ్ళు వచ్చి దీన్ని పరిశీలించారు. ఇది కొకైన్ అని వాళ్ళు కన్ఫామ్ చేశారు. తర్వాత దాన్ని సీక్రెట్ టెస్టింగ్ ఏజెన్సీకి పంపారు అది ఏ ఐటమ్ అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇది వైట్ హౌస్ లోకి ఎలా వచ్చింది అనేది మాత్రం ఇంకా తెలియట్లేదు. ఈ విషయంలో క్లారిటీ అయితే అస్సలు లేదు. బైడెన్ ఎక్కువగా వెస్ట్ వింగ్ లోనే ఉంటాడు. ఇక్కడికి తనని కలవడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిది దొరకడం అందర్నీ షాక్ కి గురిచేస్తుంది. 

జో బైడెన్:

 జో బైడెన్ ట్రంప్ ని ఓడించి అధ్యక్షుడిగా గెలిచాడు. జో బైడెన్ గెలవడానికి భారతీయ సంతతికి చెందిన కమలా హారీస్ బాగా ఉపయోగపడింది. తన సపోర్ట్ తోనే బైడెన్ ట్రంప్ మీద గెలిచాడు. బైడెన్ ట్రంప్ మీద గెలవడానికి చాలా కష్టపడ్డాడు. ట్రంప్ ఇంతకుముందు అమెరికా ప్రెసిడెంట్ గా పని చేశాడు. అసలు ట్రంప్ ఏమేం చేశాడో ఒకసారి తెలుసుకుందాం. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ట్రంప్  భారతీయ వ్యతిరేక నిర్ణయాలు కూడా చాలానే తీసుకున్నాడు. కరోనా టైంలో హైడ్రాక్సి క్లోరోక్విన్ కోసం ట్రంప్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా కరోనా టైంలో కరోనాని చైనా నే ల్యాబ్ లో చేసిందని ట్రంప్ చాలా గట్టిగా చెప్పాడు. ట్రంప్ అధ్యక్షుడిగా ఓడిపోవడానికి కరోనా కూడా ఒక కారణమే. కరోనాకాలంలో ట్రంప్ నివారణ చర్యలు ఏం తీసుకోలేకపోయాడు. ట్రంప్ చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యాడు. ఒకానొక సమయంలో ట్రంప్ చాలా అసహనానికి గురయ్యాడు. ఇలా జరిగిన కొన్ని నెలలకే ఎలక్షన్స్ రావడంతో ట్రంప్ ఎలక్షన్స్ కి సరిగా సిద్ధం కాలేకపోయాడు. ఆ టైంలో జో బైడెన్ చాలా వేగంగా ప్రచారం చేసుకుని. ఎలక్షన్స్ లో గెలిచాడు. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. 

కానీ వైట్ హౌస్ లో కొకైన్ దొరకడం వైట్ హౌస్ ని వార్తల్లో నిలిచేలా చేసింది. బైడెన్ హయాంలో అమెరికా చాలా విషయాల్లో దూసుకుపోతుంది. ఈ మధ్యకాలంలో ఆర్థిక మాంద్యం వచ్చి కొంతమందికి ఉద్యోగాలు పోయాయి. అదొక్కటి మాత్రమే బైడెన్ హయాంలో జరిగిన నెగిటివ్. ఇప్పుడు వైట్ హౌస్ లోకి కొకైన్ వచ్చిందని తెలిసి ప్రపంచ దేశాలన్నీ షాక్ అవుతున్నాయి. ఎక్కువ భద్రత ఉండే ఈ ప్లేస్ లో ఇలా ఎలా జరిగిందని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ కొకైన్  విషయం

త్వరగా తేలాలని అందరూ అనుకుంటున్నారు. 

అమెరికా ప్రభుత్వానికి ఈ విషయం ఒక పెద్ద తలనొప్పి క్రియేట్ చేసింది. ఇక్కడ భద్రత భారీగా ఉంటుందని చెప్పినా అందులో కూడా డొల్లతనం ఉందని బట్టబయలైంది. అందుకే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని త్వరగా పరిష్కరించాలి అనుకుంటున్నారు.