Israel-Hamas war: గాజా ఆసుపత్రి దాడికి కారణం ఎవరు?

ఇస్లామిక్ జిహాద్(Islamic Jihad) అనేది పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్, ఇది హమాస్(Hamas) నుండి వేరుగా ఉంటుంది కానీ ఇజ్రాయెల్‌(Israel)తో పోరాడడంలో ఉమ్మడి లక్ష్యాలను పంచుకుంటుంది. వీరిద్దరికీ ఇరాన్(Iran) నుంచి మద్దతు లభిస్తుంది. ఇటీవలి సంఘటనలో, కొనసాగుతున్న సంఘర్షణ సమయంలో గాజా ఆసుపత్రిలో ఇస్లామిక్ జిహాద్ పెద్ద పేలుడుకు కారణమైందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇస్లామిక్ జిహాద్ చేసిన రాకెట్ ప్రయోగం(Rocket launch) విఫలమవడం వల్లే ఇది జరిగిందని వారు చెప్పారు. అయితే ఇస్లామిక్ జిహాద్ ఈ ఆరోపణను తిరస్కరించింది. […]

Share:

ఇస్లామిక్ జిహాద్(Islamic Jihad) అనేది పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్, ఇది హమాస్(Hamas) నుండి వేరుగా ఉంటుంది కానీ ఇజ్రాయెల్‌(Israel)తో పోరాడడంలో ఉమ్మడి లక్ష్యాలను పంచుకుంటుంది. వీరిద్దరికీ ఇరాన్(Iran) నుంచి మద్దతు లభిస్తుంది. ఇటీవలి సంఘటనలో, కొనసాగుతున్న సంఘర్షణ సమయంలో గాజా ఆసుపత్రిలో ఇస్లామిక్ జిహాద్ పెద్ద పేలుడుకు కారణమైందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇస్లామిక్ జిహాద్ చేసిన రాకెట్ ప్రయోగం(Rocket launch) విఫలమవడం వల్లే ఇది జరిగిందని వారు చెప్పారు. అయితే ఇస్లామిక్ జిహాద్ ఈ ఆరోపణను తిరస్కరించింది. మరియు ఇజ్రాయెల్ తప్పుడు వాదనలు చేస్తుందని ఆరోపించింది. ఈ ఘటనతో తీవ్ర ప్రాణనష్టం జరగడంతో పాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ జిహాద్ అంటే ఏమిటి?

ఇస్లామిక్ జిహాద్ అనేది గాజా స్ట్రిప్‌(Gaza Strip)లో ఉన్న ఒక మిలిటెంట్ గ్రూప్ మరియు ఇది అక్కడ రెండవ అతిపెద్ద సాయుధ సమూహం. ఇది పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడే లక్ష్యంతో 1980లలో స్థాపించబడింది. ఇది కొన్నిసార్లు హమాస్(Hamas) నుండి స్వతంత్రంగా పనిచేస్తుండగా, రెండు గ్రూపులు ఇరాన్ నుండి నిధులు మరియు ఆయుధాలతో సహా మద్దతును పొందుతాయి.

ఎన్టివై నివేదిక ప్రకారం, గాజాలో అత్యధిక సైనిక కార్యకలాపాలను సమన్వయం చేసే జాయింట్ ఆపరేషన్స్ రూమ్‌లో హమాస్ మరియు ఇస్లామిక్ జిహాద్ అత్యంత ముఖ్యమైన సభ్యులు. ఇజ్రాయెల్(Israel) మరియు యునైటెడ్ స్టేట్స్(United States) ఇస్లామిక్ జిహాద్ మరియు హమాస్ రెండింటినీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాయి. వారు తరచుగా గాజాలో సైనిక కార్యకలాపాలను సమన్వయం చేయడంలో సహకరిస్తారు. ప్రత్యేకించి ఇజ్రాయెల్‌పై దాడులు లేదా ప్రతీకార చర్యలకు దూరంగా ఉండమని హమాస్ ఇస్లామిక్ జిహాద్‌పై ఒత్తిడి చేసినప్పుడు వారి సంబంధం కొన్ని సమయాల్లో ఉద్రిక్తంగా ఉంటుంది. 

హమాస్ మరియు ఇస్లామిక్ జిహాద్(Islamic Jihad) మధ్య సంబంధానికి సంబంధించి, హమాస్ జోక్యం చేసుకోకూడదని ఎంచుకున్న సందర్భాలు ఉన్నాయి మరియు ఇస్లామిక్ జిహాద్ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తన స్వంత చర్యలను నిర్వహించింది. అయితే, ఈ రెండు గ్రూపులు గతంలో సైనిక కార్యకలాపాలలో కలిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Read More: Gaza: ఆసుపత్రిలో పేలుడు.. 500 మంది మృతి

గాజా ఆసుపత్రిపై దాడి

హమాస్, ఇజ్రాయెల్‌ యుద్ధం.. భీకర రూపం సంతరించుకుంది. సెంట్రల్‌ గాజాలోని అల్‌ అహ్లీ సిటీ(Al Ahli City) ఆస్పత్రిపై జరిగిన దాడిలో 500 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గాజాలో యుద్ధం కారణంగా అమాయకులు బలవుతుండడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అల్ అహ్లీ అరబి బాప్టిస్ట్ ఆస్పత్రిపై జరిగిన దాడిలో 500మందికిపైగా మరణించారని.. దీని వెనక ఇజ్రాయెల్ ఉందని హమాస్ నేతృత్వంలో నడుస్తున్న గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ ఆరోపణలను ఇజ్రాయెల్‌ సైన్యం ఖండించింది. తాము ఆసుపత్రి సమీపంలో ఎటువంటి వైమానిక కార్యకలాపాలు నిర్వహించలేదని స్పష్టం చేసింది. హమాస్‌ ఉగ్రవాదులు తమపై ప్రయోగించే రాకెట్లలో.. 25 శాతం వరకు వాళ్ల భూభాగంలోనే పడతాయని పేర్కొంది. ఈ హమాస్‌(Hamas) రాకెట్‌ కూడా గురితప్పి ఆస్పత్రిపై పడిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. అయినా ఆస్పత్రిపై దాడి చేసింది తమ బలగాలేనా కాదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఉపయోగించిన రాకెట్లు తమ పరికరాలతో సరిపోలడం లేదని ఇజ్రాయెల్‌ ప్రతినిధి డేనియల్ హగారి స్పష్టం చేశారు.

గాజాలోని ఆస్పత్రిపై బాంబు దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్‌(Israel) క్రూరమైన మారణ కాండకు దిగిందని హమాస్ మిత్రపక్షమైన ఇస్లామిక్ జిహాద్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రూరమైన మారణకాండకు కారణమైన ఇజ్రాయెల్ తప్పు నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తోందని.. అందుకే పాలస్తీనాలో జిహాద్ ఉద్యమం(Jihad movement)పై నిందలు మోపుతోందని వెల్లడించింది. ఈ దాడిని హిజ్బుల్లా కూడా తీవ్రంగా ఖండించింది. గాజాలోని ఆస్పత్రిపై దాడి తర్వాత పాలస్తీనాలో ఆందోళనలు ఎగిసిపడ్డాయి. రమల్లాలో ఆందోళనకారులు భారీగా రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌(Mahmood Abbas)కు వ్యతిరేకంగా రాళ్లు విసిరి నినాదాలు.. చేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి.

సెంట్రల్‌ గాజాలోని అల్‌ అహ్లీ సిటీ ఆస్పత్రిపై జరిగిన దాడిలో 500 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌(Biden) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిపై వైమానిక దాడిని తీవ్రంగా ఖండించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్.. దీనిని భయంకరమైన దాడిగా అభివర్ణించారు. ఆసుపత్రులు, వైద్య సిబ్బంది అంతర్జాతీయ మానవతా చట్టం కింద రక్షించాలని.. కానీ ఇక్కడ అది అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్‌లోని బ్రిటన్‌, ఫ్రాన్స్ రాయబార కార్యాలయాల వెలుపల వందలాది మంది నిరసన తెలిపారు. ఆస్పత్రిపై దాడి ఘటనను ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ibrahim Raisi) తీవ్రంగా ఖండించారు. ఒక రోజు ప్రజా సంతాప దినాలు ప్రకటిస్తున్నట్లు ఇరాన్‌ అధ్యక్షుడు వెల్లడించారు. ఆస్పత్రిపై దాడిని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా ఖండించింది.