స్టేపుల్డ్ వీసాలను మంజూరు చేసిన చైనా

అయితే ఈ స్టేపుల్డ్ వీసాలు అంటే ఏమిటి మీకు తెలుసా?. స్టేపుల్డ్ వీసాలు అంటే, పాస్ పోర్ట్ మీద స్టాంప్ అనేది వేయరు. అయితే ఒక పేపర్ మీద స్టాంప్ వేసి దాని వీసాకు అటాచ్/ పిన్ చేసి ఇస్తారు. అంటే దీని ఉద్దేశం అరుణాచల్ ప్రదేశ్ చైనాలో ఒక భాగం అని, అరుణాచల్ ప్రదేశ్ లో ఉండేవారు తమ దేశంలో అప్పుడప్పుడు పర్యటించడానికి వీసా అవసరం లేదని చెప్పడమే. అయితే ఇలా చేయడం పై, మన […]

Share:

అయితే ఈ స్టేపుల్డ్ వీసాలు అంటే ఏమిటి మీకు తెలుసా?. స్టేపుల్డ్ వీసాలు అంటే, పాస్ పోర్ట్ మీద స్టాంప్ అనేది వేయరు. అయితే ఒక పేపర్ మీద స్టాంప్ వేసి దాని వీసాకు అటాచ్/ పిన్ చేసి ఇస్తారు. అంటే దీని ఉద్దేశం అరుణాచల్ ప్రదేశ్ చైనాలో ఒక భాగం అని, అరుణాచల్ ప్రదేశ్ లో ఉండేవారు తమ దేశంలో అప్పుడప్పుడు పర్యటించడానికి వీసా అవసరం లేదని చెప్పడమే. అయితే ఇలా చేయడం పై, మన భారతదేశం తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా దీనికి తగిన విధంగా సమాధానం చెప్పమని, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారి ప్రతినిధి అరిందం బాగ్సి దీని మీతో మాట్లాడటం జరిగింది.

చైనా చేస్తున్న ప్రయత్నాలు: 

చెంగ్డూలో శుక్రవారం ప్రారంభం కానున్న సమ్మర్ వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్ నుంచి తమ వుషు (మార్షల్ ఆర్ట్స్) బృందాన్ని ఉపసంహరించుకోవడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కొంతమంది ఆటగాళ్లకు చైనా స్టేపుల్ వీసాలు జారీ చేయడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. జాతీయ మార్షల్ ఆర్ట్స్ జట్టులో భాగమైన నైమాన్ వాంగ్సు, ఒనిలు తేగా మరియు మెపుంగ్ లాంగు అనే ముగ్గురు మహిళా క్రీడాకారులు ఈ స్టేపుల్ వీసాలను, చైనా ద్వారా అందుకోవడం కూడా జరిగింది.

ప్రస్తుతం చైనా కొంతమంది క్రీడాకారులకు స్టాపర్ వీసాలు మంజూరు చేయడంపై తన అసమ్మతిని వ్యక్తం చేసింది. వాటిని ఇలాంటి పనులు ఎలా చేస్తారు అని పేర్కొంది. అంతేకాకుండా తమ వైపు నుంచి “నిరసన తెలియజేయడానికి” భారతదేశంలోని చైనా రాయబారిని పిలిపించింది. ఈ స్టేపుల్డ్ వీసాల సమస్య చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల భాగస్వామ్యంపై ప్రభావం చూపదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

అరుణాచల్ ప్రదేశ్ నుండి భారతీయ పౌరులకు ఇటువంటి ‘స్టెపుల్డ్ వీసాలు’ జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, 2011 ఆసియా కరాటే ఛాంపియన్‌షిప్‌లు, 2011 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌తో సహా అంతర్జాతీయ ఈవెంట్‌లకు ఈ ప్రాంతానికి చెందిన అథ్లెట్లకు ఈ విధంగానే జరిగినట్టు తెలిసింది.

స్టేపుల్డ్ వీసాలు అంటే ఏమిటి? 

ఒక దేశం విదేశీ పౌరులకు ఇచ్చే సాధారణ వీసా కంటే ‘స్టెపుల్డ్ వీసా’ కాస్త భిన్నంగా ఉంటుంది. పాస్‌పోర్ట్‌లో నేరుగా స్టాంప్ అనేది వేయకుండా,ఒక పేపర్ మీద స్టాంప్ వేసి దాని వీసాకు అటాచ్/ పిన్ చేసి ఇస్తారు. అయితే ప్రస్తుతం చైనా అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులకు ఇటువంటి స్టెపుల్డ్ వీసా అందించింది.

అరుణాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్‌లోని భారతీయ పౌరుల కోసం ప్రత్యేకంగా చైనా ఈ ‘స్టెపుల్ వీసా’ విధానాన్ని ఉపయోగిస్తోంది. అయితే చైనా, భారతదేశంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ నివాసితులకు, అదేవిధంగా 2009 నుండి జమ్మూ మరియు కాశ్మీర్ నుండి వచ్చిన వారికి స్టేపుల్ వీసాలను జారీ చేయడం ప్రారంభించింది.

ఇది ఆందోళన కలిగించే విషయమా? 

స్టేపుల్డ్ వీసా ఉన్న వ్యక్తి వారి స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, వారు చైనాలో పర్యటించిన ప్రదేశాలకు సంబంధించి, మరి ఏ ఇతర విషయాలుకు సంబంధించిన వివరాలేవీ నమోదు కావు. అయితే ఎప్పటినుంచో భారతదేశంలో కొన్ని ప్రాంతాల మీద కన్నేసిన చైనా, ఇలాంటి వీసాల ద్వారా కొంతమందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా, అరుణాచల్ ప్రదేశ్ మరియు J&Kలను చైనాలో విలీనం చేసుకోవడానికి ఇదొక కొత్త పథకం చేస్తుందని, భారత్ వాపోయింది.