ఉక్రెయిన్‌కి క్ల‌స్ట‌ర్ బాంబ్స్ పంపుతున్న అమెరికా

వందకు పైగా దేశాలు నిషేధించిన ఈ క్లస్టర్ బాంబ్స్ ని అమెరికా ఎందుకు ఉక్రెయిన్ కి ఉత్పత్తి చేస్తుంది. అమెరికాకు ఉక్రెయిన్ కు సంబంధాలు బలపడ్డాయా, అసలు అమెరికా ఉక్రెయిన్ కి క్లస్టర్ బాంబ్స్ ని ఉత్పత్తి చేయడం వెనక ఉన్న ప్రధాన కారణం ఏమిటి ?  ఆందోళన పడుతున్న దేశాలు:  ఉక్రెయిన్‌కు క్లస్టర్ బాంబులను సరఫరా చేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు అమెరికాకు కీలక మిత్రదేశాల్లో ఆందోళన పుట్టిస్తుందని చెప్పుకోవాలి. ఇటలీ, స్పెయిన్, జర్మనీ […]

Share:

వందకు పైగా దేశాలు నిషేధించిన ఈ క్లస్టర్ బాంబ్స్ ని అమెరికా ఎందుకు ఉక్రెయిన్ కి ఉత్పత్తి చేస్తుంది. అమెరికాకు ఉక్రెయిన్ కు సంబంధాలు బలపడ్డాయా, అసలు అమెరికా ఉక్రెయిన్ కి క్లస్టర్ బాంబ్స్ ని ఉత్పత్తి చేయడం వెనక ఉన్న ప్రధాన కారణం ఏమిటి ? 

ఆందోళన పడుతున్న దేశాలు: 

ఉక్రెయిన్‌కు క్లస్టర్ బాంబులను సరఫరా చేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు అమెరికాకు కీలక మిత్రదేశాల్లో ఆందోళన పుట్టిస్తుందని చెప్పుకోవాలి. ఇటలీ, స్పెయిన్, జర్మనీ మరియు UK ఈ ఆయుధాల వినియోగానికి వ్యతిరేకత వ్యక్తం చేసిన NATO సభ్యులలో ఉన్నాయి. 

క్లస్టర్ బాంబులు అనేది జనాభాకు పెనుముప్పుగా తయారవుతున్నాయని 100కి పైగా దేశాలు నిషేధించాయి. ఈ క్లస్టర్ బాంబ్స్ అనేవి పేలినప్పుడు అందులోనుంచి నాసిరకమైన మరిన్ని చిన్న బాంబులు విడుదలవుతాయి, అయితే ఈ బాంబులు పేలిపోయినప్పటికీ, అందులో ఉండే పదార్థాలు కొన్ని సంవత్సరాల అయినప్పటికీ అలాగే ఉండిపోతాయని అంతేకాకుండా అవి మళ్లీ ఎప్పుడు ఎలా పేలుతాయని కూడా చెప్పలేమని, BBC న్యూస్ పేర్కొంది. UK కట్టుబడి ఉండగా, ఉక్రెయిన్ ఆయుధ నిల్వలు తగ్గుతున్నందున అవి అవసరమని US పేర్కొంది. 

అమెరికా అధ్యక్షుడు నిర్ణయం: 

800 మిలియన్ డాలర్ల విలువైన సైనిక సహాయ ప్యాకేజీలో భాగంగా ఉక్రెయిన్‌కు క్లస్టర్ బాంబులను పంపే నిర్ణయాన్ని అధ్యక్షుడు జో బిడెన్ స్పష్టం చేశారు. ఇది ఎంత క్లిష్టమైన నిర్ణయం అనేది ఆయనకి కూడా తెలిసినప్పటికీ, ప్రస్తుతం ఉక్రెయిన్ ఉన్న పరిస్థితుల్లో ఆ దేశానికి క్లస్టర్ బాంబులు పంపించడం సరైన నిర్ణయం అని తేల్చారు. ఈ విషయమై మిత్రపక్షాలతో ముందే చర్చించినట్లు కూడా తెలిపారు. 

UK యొక్క మొదటి జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన పీటర్ రికెట్స్ ఆదివారం స్కై న్యూస్‌తో మాట్లాడుతూ, మిగిలిన దేశాలు, అమెరికా తీసుకున్న నిర్ణయం పట్ల ఏ విధమైన ఆందోళన చెందుతున్నాయో వారు కూడా అదే ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికా ఉక్రెన్ మధ్య ఇటువంటి ఒప్పందం ఎందుకు జరుగుతుందో కూడా అందరికీ తెలుసని ఆయన ఉద్దేశపడ్డారు.

క్లస్టర్ బాంబ్స్ అంటే ఏమిటి:

క్లస్టర్ బాంబ్ అనేది ఒక మందు గుండు పదార్థం ఇది నేల మీద పడిన వెంటనే  లోపల ఉన్న పదార్థాలు పేలి చుట్టుపక్కల ప్రాంతాన్ని ధ్వంసం చేస్తుంది ఇది చాలా ప్రమాదకరమైనది ఇది కొన్ని క్షణాల్లోనే చాలా పెద్ద విధ్వంసాన్ని సృష్టించగలదు. 

రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన క్లస్టర్ బాంబులను జెట్ ప్లైన్స్ ద్వారా పైనుంచి వెళ్తూ భూమ్మీద పడేయొచ్చు. అంతేకాకుండా వీటిని సముద్రంలో కూడా ఉపయోగించవచ్చు. పెద్ద ప్రాంతంలో డజన్ల కొద్దీ లేదా వందల కొద్దీ బాంబులను ఒకేసారి ఉపయోగించవచ్చు. ఈ పేలుళ్లు చుట్టుపక్కల ఉన్న ఎవరికైనా తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి, ఈ బాంబుకి గురైన వాళ్ళు ఎవరైనా సరే చనిపోవాల్సిందే.

అయితే ఇందులో కొన్ని పేలని క్లస్టర్ బాంబ్స్ కొన్ని కొన్ని ప్రదేశాలలో అలాగే వదిలేయడం చాలా ప్రమాదకరం. ఈ బాంబులనేవి ఎప్పుడూ ఎలా పేలుతాయో ఎవరు ఊహించలేరు. జనాలు తిరిగే ప్రదేశంలో ఒకవేళ ఇది సంవత్సరాల తరబడిగా భూమి లోపల ఉండి పోయినప్పటికీ ఎప్పుడు పేలుతుందో కూడా తెలియదు. 

ఉక్రెయిన్ వీటిని ఎందుకు తీసుకోవాలనుకుంటుంది: 

ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం గురించి తెలిసింది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, పేలుడు పదార్థాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అని సమాచారం. ఎందుకంటే, రష్యన్‌ల మాదిరిగానే, వారు అసాధారణంగా అధిక రేటుతో వాటిని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్ చుట్టుపక్కల ఉన్న దేశాలలో వీటిని సరఫరా చేసే సామర్థ్యం లేదు. అందుకే ఇప్పుడు అమెరికా నుంచి సహాయం పొందాలనుకుంటుంది ఉక్రెయిన్ దేశం.