West Bank: వెస్ట్ బ్యాంక్ మరో యుద్ధభూమి కానుందా?

ఇప్పటికీ రష్యా(Russia)- యుక్రేన్(Ukraine) దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం (War) ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హమ్మస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ […]

Share:

ఇప్పటికీ రష్యా(Russia)- యుక్రేన్(Ukraine) దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం (War) ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హమ్మస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ (Israel) తనని తాను రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ చేస్తూ లెబనాన్ (Lebanon)‌లోని హిజ్బుల్లా(Hezbollah) లక్ష్యాలపై ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు చేసింది. ఇదిలా కొనసాగుతున్న వేళ, గాజా, లెబనాన్ తర్వాత ఇప్పుడు టార్గెట్ వెస్ట్ బ్యాంక్ (West Bank)‌ అంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అక్కడ హింస (Violence) మొదలైనట్లు కనిపిస్తోంది. 

వెస్ట్ బ్యాంక్ మరో యుద్ధభూమి కానుందా?: 

ఇజ్రాయెల్ (Israel) గాజా స్ట్రిప్‌పై బాంబు దాడి (Attack) చేయడం, లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లాతో ఘర్షణ పడటం ప్రారంభించినప్పటి నుండి వెస్ట్ బ్యాంక్ (West Bank)‌లో హింస (Violence) పెరిగింది, విస్తృత యుద్ధంలో పాలస్తీనా భూభాగం మరో టార్గెట్ అవుతుందనే ఆందోళనలకు ఆజ్యం పోసింది. గాజాలోని పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లో మిలిటెంట్ హమాస్ గ్రూపుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది, కానీ ఇజ్రాయెల్ (Israel) సైనికులు, అక్కడ ఎప్పటినుంచో ఉంటుందని వాసులు 2005లో గాజా నుండి వైదొలిగారు. ఇజ్రాయెల్ (Israel) వెస్ట్ బ్యాంక్ (West Bank)‌ను ఆక్రమించి, 1967 మిడిల్ ఈస్ట్ యుద్ధంలో స్వాధీనం చేసుకుంది. 

కొనసాగుతున్న యుద్ధం: 

అక్టోబర్ 7 హమాస్ దాడుల తరువాత ఇజ్రాయెల్ (Israel) ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రేపు ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఇజ్రాయెల్ (Israel) దళాలు హమాస్ ఆధీనంలో ఉన్న భూభాగానికి వ్యతిరేకంగా దాడి (Attack)కి సిద్ధమవుతున్నందున, దీనస్థితిలో ఉన్న గాజా స్ట్రిప్‌లోకి విదేశీ సహాయాన్ని తీసుకురావడంలో సహకరించడానికి, ఇజ్రాయెల్ (Israel) నుండి US హామీలను కూడా పొందిందని బ్లింకెన్ చెప్పారు. 

గాజాపై ఇజ్రాయెల్ (Israel) దాడులకు తాము అసలు భయపడట్లేదని, దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని హమాస్ ప్రతినిధి అబు ఒబీదేహ్ నిన్న చెప్పారు. అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌ (Israel)పై దాడి (Attack) చేసినప్పటి నుండి, హమాస్ ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్‌లు 200 మందిని బందీలుగా ఉంచారు. ఇజ్రాయెల్ (Israel) సైనికులు మరియు సెటిలర్లు మరియు పాలస్తీనియన్ల మధ్య ఘర్షణలు ఇప్పటికే ప్రాణాంతకంగా మారాయి. అక్టోబర్ 7 నుండి వెస్ట్ బ్యాంక్ (West Bank) హింస (Violence)లో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు మరియు ఇజ్రాయెల్ (Israel) 800 మందికి పైగా అరెస్టు చేసింది.

గురువారం వెస్ట్ బ్యాంక్ (West Bank)‌లోని పాలస్తీనా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడి (Attack) చేశాయి, కనీసం 12 మంది మరణించారని పాలస్తీనా అధికారులు తెలిపారు. దాడి (Attack)లో ఒక అధికారి మరణించినట్లు ఇజ్రాయెల్ (Israel) పోలీసులు తెలిపారు. అక్టోబరు 7న దాడి (Attack) జరిగిన అనంతరం, ఈ ఏడాది వెస్ట్ బ్యాంక్ (West Bank) పాలస్తీనియన్లపై దాడులు, అరెస్టులను హమాస్ పేర్కొంది. అయితే మరోపక్క గాజా, లేబనోన్ వంటి ప్రాంతాలలో హింస (Violence) నెలకొన్నప్పటికీ సద్దుమనుకుతుందని, మరోవైపు అత్యంత ఆర్మీ చెక్ పోస్ట్ లు ఉన్న వెస్ట్ బ్యాంక్ (West Bank)లో హింస (Violence) మొదలైనప్పటికీ, ఈ ప్రత్యేకమైన ప్రాంతం యుద్ధభూమిగా మారే అవకాసం లేదంటున్నారు మరికొందరు.