4,800 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి.. వేరొక‌రి పెళ్లికి వెళ్లిపోయింది!

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పలు వార్తలు నవ్వులు పూయిస్తున్నాయి. చాలా మంది తమ జీవితంలో జరిగిన వింతైన సంఘటనల గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా పరుచుకుంటూ ఉంటారు. ఈ విధంగానే ఒక మహిళ తాను ఓ పెళ్లికి వెళ్ళబోయి మరో పెళ్లికి వెళ్లి తన వింతైన ఎక్స్పీరియన్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంది.  అసలు ఏం జరిగింది:  వాషింగ్టన్ కు చెందిన ఆర్తి అని మహిళ, కోట్లాండ్లో వివాహం చేసుకోబోతున్న  తన స్నేహితురాలి వివాహానికి హాజరు […]

Share:

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పలు వార్తలు నవ్వులు పూయిస్తున్నాయి. చాలా మంది తమ జీవితంలో జరిగిన వింతైన సంఘటనల గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా పరుచుకుంటూ ఉంటారు. ఈ విధంగానే ఒక మహిళ తాను ఓ పెళ్లికి వెళ్ళబోయి మరో పెళ్లికి వెళ్లి తన వింతైన ఎక్స్పీరియన్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంది. 

అసలు ఏం జరిగింది: 

వాషింగ్టన్ కు చెందిన ఆర్తి అని మహిళ, కోట్లాండ్లో వివాహం చేసుకోబోతున్న  తన స్నేహితురాలి వివాహానికి హాజరు కావాల్సి ఉంది. సుమారు 48 కి.మీ వాషింగ్టన్ నుంచి స్కాట్లాండ్ కి తన ప్రత్యేకమైన స్నేహితురాలు పెళ్లి వివాహానికి వేడుకకు హాజరు అయ్యేందుకు బయలుదేరింది. స్కాట్లాండ్ లో ఉన్న గ్లాస్ గవ్ ప్రాంతంలో తన స్నేహితురాలి వివాహ వేడుకకు చేరుకున్నప్పటికీ, మ్యారేజ్ కోసం వెళ్ళిన మహిళ పెళ్లిలో ఒకరిని కూడా గుర్తుపట్టలేకపోయింది. చివరికి పెళ్లికూతురు పెళ్లి కొడుకు తో సహా. తన స్నేహితురాలు పెళ్లి వేడుక లో కనిపించిన అన్ని విషయాలు తనకి అయోమయానికి గురి చేశాయి. కానీ నిజానికి ఏంటంటే, తను టైంకి చేరుకున్న వివాహం తన ఫ్రెండ్ ది కాదని అర్థం అయిపోయింది. అంతేకాకుండా తను పెళ్లి వేడుకలో క్యాథలిన్ మరియు స్టీఫెన్ ఆహ్వాన బ్యానర్ కూడా చదివి ఇంక తాను చేసిన పొరపాటును గమనించుకుంది ఆర్తి. 

తను వేరే వివాహానికి వెళ్ళిన సంఘటనను గుర్తుచేసుకొని తన సోషల్ మీడియాలో తన వింతైన ఎక్స్పీరియన్స్ ని పంచుకుంది. తను వివాహ వేడుక సందర్భంగా చాలా సమయం పాటు ప్రయాణం చేసి 25 నిమిషాలకు ముందే వెన్యూ కి చేరుకుంది. అప్పటికే హడావిడిగా ఉన్న ఆర్తి, మొత్తం చుట్టూ చూస్తున్నప్పటికీ ఎవరు కూడా తనకి తెలిసిన వాళ్ళలా కనిపించలేదు. తాను రాంగ్ అడ్రస్ కి వచ్చానని గమనించింది. కానీ పెళ్లికూతురు పెళ్లి కొడుకు మాత్రం ఆమె తమ వివాహ వేడుకకు అనుకోకుండా వచ్చినప్పటికీ, సంతోషంగా భావించారు. తమతో పాటు డ్రింక్ చేయమని కూడా కోరినట్లు ఆమె సోషల్ మీడియాలో పేర్కొంది. 

ఇంక తాను ఆలస్యం చేయకుండా, తాను ఏ వివాహ వేడుకకి వెళ్ళాలో అక్కడికి మరొక క్యాబ్ బుక్ చేసుకుంది. అయితే అప్పటికే రిసెప్షన్ లో భాగంగా పెళ్లిలో కొంత భాగం కూడా మిస్ అయింది. కానీ ఆఖరికి పెళ్లిని ఎంజాయ్ చేసినట్లు, తాను వేరే వివాహ వేడుకలకు వెళ్లానని తెలిసి, స్కాట్లాండ్ లో జరుగుతున్న ఇండియన్ వివాహ వేడుకలో ఉన్న పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తో సహా వాళ్ల కజిన్స్ కూడా తనని ఆటపట్టించారని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది ఆర్తి. కానీ నిజానికి తాను ఎక్స్పీరియన్స్ చేసిన అరుదైన సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ, తనకి ఇటువంటి ఎక్స్పీరియన్స్ మొదటిసారి జరిగినప్పటికీ, అపూర్వమైన మోమెంట్స్ ఎప్పటికీ పదిలం అని చెప్పుకొచ్చింది వాషింగ్టన్కు చెందిన ఆర్తి. 

సరదా సన్నివేశాలు: 

ఇలా చాలా సంఘటనలు చాలామందికి ఎదురవుతూనే ఉంటాయి కదా.. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో వేరే ఊరి నుంచి వచ్చిన అతిధులు అప్పుడప్పుడు ఆ చుట్టుపక్కల జరుగుతున్న మరో వివాహానికి వెళ్లిపోవడం, ఇలాంటి సంఘటనలు గుర్తుచేసుకొని నవ్వటానికి ఎంతో బాగుంటాయి కదండీ. . కానీ కావాలని చాలామంది ముఖ్యంగా కాలేజీ చదువుతున్న రోజుల్లో తమకి తెలియని వివాహాలకు వెళ్లి ఎంజాయ్ చేయడానికి చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి విషయాలు కూడా మనం చాలా సోషల్ మీడియాలో చూసే ఉంటాము.