అమెరికా తగ్గనంది – బెలూన్ కూల్చివేసినందుకు క్షమాపణ చెప్పనన్న జో బైడెన్

చైనా గూఢచారి బెలూన్‌ను కూల్చివేసినందుకు క్షమాపణలు చెప్పబోనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. పౌర వాణిజ్య విమానాల రాకపోకలకు బెదిరింపులు ఉన్నందున గూఢచారితో సహా మరో మూడు బెలూన్‌లను కూల్చివేయాలని ఆదేశించినట్లు బైడెన్ చెప్పారు. చైనా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూనే ఉన్నాయి. అయితే, అమెరికా గగనతలంలో ఉన్న ఒక భారీ బెలూన్‌‌ని అమెరికా కూల్చివేసిన నేపథ్యంలో ఈ చిచ్చు ఇంకా రాజుకుంది. ఇన్ని […]

Share:

చైనా గూఢచారి బెలూన్‌ను కూల్చివేసినందుకు క్షమాపణలు చెప్పబోనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. పౌర వాణిజ్య విమానాల రాకపోకలకు బెదిరింపులు ఉన్నందున గూఢచారితో సహా మరో మూడు బెలూన్‌లను కూల్చివేయాలని ఆదేశించినట్లు బైడెన్ చెప్పారు.

చైనా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూనే ఉన్నాయి. అయితే, అమెరికా గగనతలంలో ఉన్న ఒక భారీ బెలూన్‌‌ని అమెరికా కూల్చివేసిన నేపథ్యంలో ఈ చిచ్చు ఇంకా రాజుకుంది. ఇన్ని రోజులు ఒకరంటే ఒకరికి కోపం ఉన్నా కానీ పైనికి మాత్రం ఏదో అలా నవ్వుతూ కనిపించే వారు. కానీ ప్రస్తుత పరిణామాల మధ్య బహిరంగంగానే ఒకరి మీదికి ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. మీది తప్పు అంటే మీదే తప్పు అని ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మూడో ప్రపంచయుద్దానికి వీరు కారణం అవుతారా అని చాలా మంది విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ రచ్చకు కారణమేంటనే విషయాల మీద ఓ సారి లుక్కేస్తే.. 

ఈ మధ్య అమెరికా గగనతలంలో చైనాకు చెందిన ఒక భారీ బెలూన్‌‌ కనిపించింది. ఇది నిఘా బెలూన్​ అని భావించిన అగ్రరాజ్యం అమెరికా ఆ బెలూన్​ను నేల మట్టం చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ చర్యను సమర్ధించుకున్నారు. చైనా ఆ బెలూన్‌‌ను నిఘా కోసమే ఉపయోగించిందని తెలిపారు. దాన్ని కూల్చివేసినందుకు సారీ చెప్పేదే లేదన్నారు. దేశ పౌరుల ప్రయోజనాలు భద్రతకు తాము తొలి ప్రాధాన్యత ఇస్తామని జో బైడెన్ పేర్కొన్నారు. ఈ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య మరింత చిచ్చు రాజుకుంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తాము ప్రచ్చన్న యుద్ధాన్ని కోరుకోవడం లేదని జో బైడెన్ స్పష్టం చేశారు. ఆ బెలూన్ కూల్చివేసిన తర్వాత కూల్చివేసిన మూడు వస్తువులకు సంబంధించిన వివరాలు తెలియ రాలేదని తెలిపారు. బదులుగా, చైనీస్ బెలూన్‌ను గుర్తించిన తర్వాత ఏర్పాటు చేసిన రాడార్ మార్పుల తర్వాత US అధికారులు వాటిని గుర్తించడంలో మరింత శ్రద్ధ వహించారు.  బైడెన్ తన పరిపాలన కొత్త పారామెట్‌ను అభివృద్ధి చేస్తోందని కూడా చెప్పాడు. అవి చైనా నిఘాలో భాగం కాదని మాత్రం తెలిపారు. ‘చైనాలోని మీ కుటుంబ వ్యాపారాలే ఆ దేశంతో వ్యవహరించే తీరులో రాజీకి కారణమా?’ అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నతో బైడెన్ అసహనానికి గురయ్యారు. తనకు విరామం కావాలంటూ సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు. ఇలా మధ్యలోనే సమావేశం వదిలేసి వెళ్లడం సరైన పద్ధతి కాదంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు.  

మీరే రెచ్చగొడుతూ… మాట్లాడతాను అంటారా- చైనా 

జిన్ పింగ్‌తో మాట్లాడతానని బైడెన్ అనడంపై చైనా తాజాగా స్పందించింది. ఓవైపు బెలూన్ కూల్చివేత చర్యలతో ఉద్రిక్తతలు పెంచుతూ మరోవైపు మాట్లాడుతామని అనడం ఏమిటని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ ప్రశ్నించారు

అయితే, వాతావరణ పరిశోధనల కోసం చైనా ప్రయోగించిన ఓ బెలూన్ తమ భూభాగంలో ల్యాండ్ అయిందని తాజాగా తైవాన్ వెల్లడించింది. దాన్ని తైవాన్‌‌లోని తుంగిన్ అనే దీవిలో గుర్తించినట్లు తెలిపింది. 

కాగా.. ఈ వివాదం ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి! అసలే ఉక్రెయిన్ – రష్యా యుద్ధంతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న వేళ.. ఇలా ఆధిపత్యం కోసమని మరిన్ని ఇతర విషయాల కోసమని బెలూన్లను వేరే దేశం మీదకి పంపడం వాటిని ఆ దేశాలు కూల్చేయడం వాటితో గొడవలు జరగడం మాత్రం బాధాకరం.