Gaza: గాజాలో నీళ్లు లేక అవస్థలు

గాజా(Gaza) లోని పరిస్థితి రోజురోజుకు దయనీయమంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, దక్షిణ గాజా(Gaza) స్ట్రిప్ లోని ప్రజలు స్నానం చేయక కొన్ని రోజులు అవుతోంది. అంతేకాకుండా బాత్రూంలకు వెళ్లాలంటే గంటల తరబడి లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి. ఇప్పటికే అక్కడ నీళ్లు (Water), కరెంటు, ఆహార సదుపాయాలను నిలిపివేయడం జరిగింది.  కష్టాలను తీర్చే వారు ఎవరు అంటూ ఆర్తనాదాలు:  గాజా(Gaza)లోని ఒక కుటుంబం ఇజ్రాయిల్ ఆర్మీ ఇచ్చిన సూచన ప్రకారం దక్షిణం వైపు ప్రయాణం చేశారని, అయితే […]

Share:

గాజా(Gaza) లోని పరిస్థితి రోజురోజుకు దయనీయమంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, దక్షిణ గాజా(Gaza) స్ట్రిప్ లోని ప్రజలు స్నానం చేయక కొన్ని రోజులు అవుతోంది. అంతేకాకుండా బాత్రూంలకు వెళ్లాలంటే గంటల తరబడి లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి. ఇప్పటికే అక్కడ నీళ్లు (Water), కరెంటు, ఆహార సదుపాయాలను నిలిపివేయడం జరిగింది. 

కష్టాలను తీర్చే వారు ఎవరు అంటూ ఆర్తనాదాలు: 

గాజా(Gaza)లోని ఒక కుటుంబం ఇజ్రాయిల్ ఆర్మీ ఇచ్చిన సూచన ప్రకారం దక్షిణం వైపు ప్రయాణం చేశారని, అయితే తమకు నీళ్లు (Water) లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యంగా బాత్రూంలకి వెళ్లేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. అంతేకాకుండా తమకి తినడానికి ఆహార సదుపాయాలు కూడా లేవని, తమ చాలా కష్టపడుతున్నామని, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని అంటున్నారు. 

అంతేకాకుండా మోనా అనే మహిళ, యుద్ధం కారణంగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరో తెలియని ఇంట్లో నివసిస్తున్నానని వెల్లడించింది. వేసుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నామని, ఇక్కడ అక్కడ కరెంటు, నీళ్లు (Water) అంతేకాకుండా, మానవత్వం కోల్పోయిన మనుషుల మధ్య తిరుగుతున్న భావనలో తాము ఉన్నామని వెల్లడించింది. అంతేకాకుండా గాజా(Gaza) లో నివసిస్తున్న చాలామంది స్నానానికి నీళ్లు (Water) దొరికితే, తాగడానికి నీళ్లు (Water) ఉండవని, ఒక్కోసారి తినడానికి కూడా తిండి దొరకలేని పరిస్థితి ఉంటోందని ఆర్తనాదాలు చేస్తున్నారు. 

ఇక్కడ ఎందుకు పుట్టామా అంటూ వేదన: 

సుజాన్ బర్జాక్, 37 మరియు గాజా(Gaza)లోని ది అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మ్యాథమెటిక్స్ చెప్పే ఉపాధ్యాయురాలు. ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ గాజా(Gaza) పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ భవనంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఒక్కసారిగా దాడు(attack)లు మొదలైన క్రమంలో తమ కుటుంబ సభ్యులు అదేవిధంగా తమ చుట్టుపక్కల అపార్ట్మెంట్లలో ఉండే అందరూ కలిసి, ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోతే సురక్షితంగా ఉండొచ్చని అందరూ ఒకచోటే ఉండడం జరిగింది. నిజంగా ఆ రోజు ఒక పీడకలలా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా మొదట దాడు(attack)లు జరిగిన రెండు రోజులు తమకి తినడానికి, తాగడానికి ఉన్నప్పటికీ, తమ పిల్లలు(Children) వేసే ప్రశ్నలతో తమకు ఎంతో బాధ కలిగిందని చెప్పుకొచ్చింది ఉపాధ్యాయురాలు. 

అసలు మనం ఇక్కడ ఎందుకు పుట్టాము? మనం వేరే దేశం వెళ్లిపోవచ్చు కదా? అసలు మనల్ని ఎందుకు చంపాలని చూస్తున్నారు? ఈరోజు మనం చచ్చిపోతామా? నీకు నాన్నకు ఏదైనా జరిగితే మేము ఎక్కడ ఉండాలి? అంటూ పిల్లలు(Children) ఏడుస్తూ అడిగిన ప్రశ్నలు గుర్తుచేసుకొని మరొకసారి బాధపడింది ఉపాధ్యాయురాలు. 

తన భర్త తన కొడుకు తమ చుట్టుపక్కల కొంతమందితో కలిసి గాజా(Gaza) సిటీ సెంటర్లో ఉండే తన అంకుల్ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పుకొచ్చింది. అయితే అక్కడికి వెళ్లినప్పటికీ కూడా బాంబు(Bomb)దాడులు ఆగలేదని, మా కుటుంబ సభ్యులు మా ఆత్మీయలతో కలిసి ఒక రూములో బిక్కుబిక్కుమంటూ బాంబు(Bomb)ల సౌండ్ వింటూ భయభ్రాంతులకు గురయ్యామని తనకి జరిగిన పీడకలను గుర్తు చేసిందే బర్జాక్. అయితే తమని మరింత భయపెట్టకూడదని తమ కుటుంబ సభ్యులలో కొంతమంది గాజా(Gaza)లోని కొన్ని ప్రదేశాలలో భూకంపం సంభవించిందని తమని ఓదార్చడానికి చెప్పుకొచ్చినట్లు వెల్లడించింది. 

అయితే ఇప్పటివరకు తమకి సహాయం చేయడానికి ఒక ఎన్జీవో లేదంటే యునైటెడ్ నేషన్స్ తరఫునుంచి ఎవరు రాలేదని, అసలు లోకల్ సర్వీస్ నెంబర్లు కూడా తమకే తెలియదని, నిజంగా చుట్టుపక్కలంతా కూడా స్మశానంలా మారిందని ఆమె మాట్లాడింది. పిల్లల(Children) ఆర్తనాదాలు వినైనా ఇప్పటికైనా తమ ప్రాణాలను కాపాడి, తమకు సహాయం చేయాలని వేడుకుంటుంది బర్జాక్.