థాయ్‌ల్యాండ్‌లో అబ్బురపరుస్తున్న విశాలమైన వాష్ రూమ్

థాయ్‌ల్యాండ్‌ లో ఒక యువతి ఎక్స్పీరియన్స్ అయిన ఒక సంఘటనను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తాను థాయిలాండ్ లో ఉన్న ఒక ప్రముఖ గుడిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు, తనకి కనిపించిన విశాలమైన వాష్ రూమ్ గురించి పంచుకోవడం జరిగింది. నిజంగా ఆ వాష్ రూమ్ స్వర్గ లోకంలో ఉండే ఒక అరుదైన ప్యాలెస్ రూపంలో ఉన్నట్లు ఆమె ఎక్సైట్ మెంట్ తో చెప్పిన వీడియో వైరల్ గా మారింది. థాయ్‌ల్యాండ్‌ గుడి ఒక స్వర్గం: థాయ్‌ల్యాండ్‌లో […]

Share:

థాయ్‌ల్యాండ్‌ లో ఒక యువతి ఎక్స్పీరియన్స్ అయిన ఒక సంఘటనను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తాను థాయిలాండ్ లో ఉన్న ఒక ప్రముఖ గుడిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు, తనకి కనిపించిన విశాలమైన వాష్ రూమ్ గురించి పంచుకోవడం జరిగింది. నిజంగా ఆ వాష్ రూమ్ స్వర్గ లోకంలో ఉండే ఒక అరుదైన ప్యాలెస్ రూపంలో ఉన్నట్లు ఆమె ఎక్సైట్ మెంట్ తో చెప్పిన వీడియో వైరల్ గా మారింది.

థాయ్‌ల్యాండ్‌ గుడి ఒక స్వర్గం:

థాయ్‌ల్యాండ్‌లో ప్రసిద్ధిగాంచిన ఈ Wat Rong Khun,   గుడి ప్రాంగణంలో ఉన్న వాష్ రూమ్ నిజంగా అద్భుతంగా ఉందని ఆమె తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ముఖ్యంగా, ప్రాంగణంలో కనిపించిన వాష్ రూమ్ చాలా విశాలవంతంగా ఉన్నట్లు తెలిసింది. ఎవరైనా సరే, అది వాష్ రూమ్ అని భావించరని, నిజంగా విశాలవంతమైన ఒక ప్యాలెస్ గుర్తు చేసే విధంగా వాష్ రూమ్ కట్టడం ఉందని ఆమె పేర్కొంది. ఈ విషయంలో ఆర్టిస్ట్ గుడి కట్టడంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించాడు అంటూ, తాను ఆ గుడి ప్రాంగణంలో ఉన్న ముఖ్యంగా వాష్ రూమ్ విశేషాలను పంచుకుంది. 

థాయ్‌ల్యాండ్‌ సాంప్రదాయాలు:

థాయ్‌ల్యాండ్‌ లో కూడా భారతదేశం మాదిరిగానే ఎంతోమంది తాము దైవంగా కొలిచే విగ్రహాలను కొలవడం జరుగుతుంది. థాయిలాండ్ లో ముఖ్యంగా గుడిలు విషయాలకి వచ్చేసరికి, సాంప్రదాయం ప్రకారం గుడి లో ఉన్న దేవతలను ఎంతో చక్కగా అలంకరిస్తారు. అంతేకాకుండా గుడి ప్రాంగణం, గుడి కట్టడాలు కూడా ఎంతో అద్భుతంగా నిర్మిస్తారు థాయ్‌ల్యాండ్‌వాసులు. థాయ్‌ల్యాండ్‌ లో భారత దేశంలో ఉండే పద్ధతులు మాదిరిగానే దేవతలకు నైవేద్యాలు వంటివి సమర్పిస్తూ ఉంటారు. 

ముఖ్యంగా బంగారం విషయానికి వచ్చేసరికి, థాయిలాండ్ వాసులకు కూడా బంగారం అంటే మక్కువ ఎక్కువ. పండుగలు వచ్చినప్పుడు ఏదైనా సందర్భంలో, బంగారు ఆభరణాలతో దేవతలను అలంకరించడమే కాకుండా, థాయిలాండ్ వాసులు కూడా బంగారు ఆభరణాలు ధరించి, చక్కని నృత్యాలు చేస్తూ ఉంటారు. 

పండుగల సమయంలో, గుడి ప్రాంగణాలలో భారతదేశంలో ఏ విధంగా అయితే వాయిద్యాలు వాయిస్తారో, అదేవిధంగా థాయిలాండ్ వాసులు కూడా కొన్ని వాయిద్యాలు వాయిస్తూ చక్కని నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తారు. థాయిలాండ్ లో నివసిస్తున్న భారతీయులకు భారత సంప్రదాయం ప్రకారం గుడికి వెళ్లేవారికి, అడుగడుగునా గుళ్ళు దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే థాయ్‌ల్యాండ్‌ లో ప్రజలకు దేవుళ్ళ మీద అపారమైన నమ్మకం. గుడి ప్రాంగణాలు మొత్తం కూడా చాలా శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు. భారతదేశంలో మాదిరిగానే గుడిలో దేవుడికి పూలతో అభిషేకం చేస్తారు. ప్రసాదాలు కూడా అందిస్తారు. ఇంకా గుడి నిర్మాణాల విషయానికి వస్తే, ప్రత్యేకమైన నిపుణుల పర్యవేక్షణలో గుడి నిర్మాణాలు జరిగేవి. ఇండియాలో కనిపించిన వాటికి కాస్త భిన్నంగా గుడి ప్రాంగణాలు దర్శనమిస్తాయి. థాయిలాండ్ వాసులకు నచ్చే విభిన్నమైన శైలిలో, ప్రత్యేకమైన ఆకృతితో, గుడి నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విధంగా థాయిలాండ్ ప్రజలు తమ ఇష్టమైన దేవతలను కొలిచేందుకు గుడికి వెళ్తూ ఉంటారు.

అంతే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా థాయ్‌ల్యాండ్‌ లో ఉండే Wat Rong Khun గుడి ప్రత్యేకతలు తెలుసుకునేందుకు, విభిన్నమైన శైలిలో నిర్మించబడిన గుడిని చూసేందుకు ప్రజలు బారులు తీరుస్తారు. ఇప్పుడు ఈ గుడి విషయంలో కూడా ఒక నైపుణ్యవంతుడైన  చలేర్మ్చాయ్ కోసిట్పిపట్ , ఎంతో చక్కని సైదులతో గుడి నిర్మాణాన్ని పూర్తి చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల గుడి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అంతేకాకుండా  థాయిలాండ్ లో సంభవించిన భూకంపం కారణంగా గుడి ప్రాంగణం, కాస్త కూలిపోయింది.