`పుతిన్ ను విమర్శించిన పార్టీ నేతకు అదే శిక్ష

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే అవుతుంది. అతడు అతని అరాచక పాలన అని చాలా మంది విమర్శిస్తుంటారు. పిచ్చుక లాంటి ఉక్రెయిన్ మీదకి బ్రహ్మాస్త్రం వేసినట్లు అతడు చేస్తున్న యుద్ధం  అనేక మందికి నచ్చడం లేదు. కానీ నీవు చేస్తుంది తప్పు పుతిన్ అని చెప్పే ధైర్యం చేయలేక చాలా మంది భయపడుతూ ఉంటారు. అందుకోసమే అతడిని ఎవరూ విమర్శించిరు. ఒక వేళ ధైర్యం చేసి ఎవరైనా విమర్శించినా కానీ […]

Share:

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే అవుతుంది. అతడు అతని అరాచక పాలన అని చాలా మంది విమర్శిస్తుంటారు. పిచ్చుక లాంటి ఉక్రెయిన్ మీదకి బ్రహ్మాస్త్రం వేసినట్లు అతడు చేస్తున్న యుద్ధం  అనేక మందికి నచ్చడం లేదు. కానీ నీవు చేస్తుంది తప్పు పుతిన్ అని చెప్పే ధైర్యం చేయలేక చాలా మంది భయపడుతూ ఉంటారు. అందుకోసమే అతడిని ఎవరూ విమర్శించిరు. ఒక వేళ ధైర్యం చేసి ఎవరైనా విమర్శించినా కానీ వారు ఘోరంగా శిక్షించబడతారు. ఇప్పటికే  ఆ దేశంలో ఎంతో మంది అధికారులు, నాయకులు పుతిన్ కు వ్యతిరేఖంగా మాట్లాడి శిక్షకు గురయ్యారు. అందుకోసమే పుతిన్ విషయంలో అందరూ తమకు నచ్చక పోయినా కానీ సైలెంట్ గా ఉంటున్నారు. పుతిన్ ఏది చేసినా కరెక్టే అంటూ సరిపెట్టుకుంటున్నారు. 

పోటీ చేయకుండా నిషేధం

ఇటీవల రష్యా పాలక పక్షానికి చెందిన యునైటెడ్ పార్టీకి చెందిన ఓ మహిళ దేశాధ్యక్షుడు వారి పార్టీ అధినేత వ్లాదిమిర్ పుతిన్ మీద వైరల్ వ్యాఖ్యలు చేసింది. ఆమె పుతిన్ ను స్వాంప్ ష్మక్ అని సంభోదించింది. దీంతో పుతిన్ పార్టీ తీవ్రంగా మండిపడింది. పుతిన్ లాంటి గొప్ప వ్యక్తినే అలా అంటావా అంటూ ఫైర్ అయింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అంతే కాకుండా వచ్చే నెలలో జరిగే అక్కడి స్థానిక పదవికి ఆమె పోటీ చేయకుండా అనర్హురాలిగా ప్రకటించింది. ఆమె దేశ నాయకత్వం గురించి అస్పష్టమైన, మూర్ఖపు ప్రకటనలు చేయడం వల్ల బహిష్కరించబడ్డారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె దక్షిణ సరాటోవ్ ప్రాంతానికి చెందిన మహిళ. మార్క్స్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు. అధిష్టానం సస్పెండ్ చేసిన ఆ నాయకురాలి పేరు ట్రుఖ్మునోవా.  

ఎవరికైనా అదే గతి… 

రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ గురించి తప్పుగా మాట్లాడిన ఎవరికైనా ఇదే గతి పడుతుందంటూ అనేక సందర్భాలు ఇప్పటికే ప్రూవ్ చేశాయి. తాజాగా ఈ నాయకురాలి ఉదంతం కూడా ఇదే చెబుతోంది. పుతిన్ నిర్ణయాలను చాలా మంది రష్యన్స్ విమర్శించారు. వారందరిని అధికార పార్టీ ఏదో విధంగా టార్గెట్ చేసింది. ఉక్రెయిన్ తో యుద్ధం స్టార్ట్ చేసి ఏడాది కంటే ఎక్కువే అవుతున్నా కానీ అందులో ఎటువంటి ఫలితం రాలేదు. యుద్ధ ఫలితంగా ఎంతో నష్టం వాటిల్లింది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాలను పుతిన్ ను మరియు  రష్యాను బాయ్ కాట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రపంచ దేశాల ఈ నిర్ణయం వల్ల ఆర్థికంగా అనేక విధాలుగా నష్టం కలిగింది. అయినా కానీ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇకనైనా యుద్ధానికి స్వస్తి పలకాలనే ఆలోచన పుతిన్ కు రావడం లేదు. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక మంది పుతిన్ మీద కోపం పెంచుకుంటున్నారు. 

అందుకోసమే బహిష్కరించాం..

పుతిన్ మీద వ్యాఖ్యలు చేసిందని పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అధికార పార్టీకి చెందిన నాయకురాలు ట్రుఖ్మునోవా కొత్త కాన్వొకేషన్ యొక్క ప్రతినిధి సంఘం యొక్క డిప్యూటీ అభ్యర్థుల జాబితా నుంచి కూడా తొలగించబడుతుందని అధికార పార్టీ ప్రకటనను విడుదల చేసింది. ఆమెను పార్టీ నుంచి వర్గం నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  ఆమె ఒక సభలో జరిగిన మీటింగ్ లో పుతిన్ ను ఇలా అందని పలు నివేదికలు చెబుతున్నాయి. అందుకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ లు బయటకి రావడంతో అధికార పార్టీ ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. 

ఎన్నికలు అప్పుడే… 

రష్యాలో వచ్చే ఏడాది మార్చి 17వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరుగతాయని పలు సర్వేలు చెబుతున్నాయి. వచ్చే నెలలో అక్కడ కొన్ని చోట్ల ప్రాంతీయ ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. వ్లాదిమిర్ పుతిన్ త్వరలో ఆరవ మొత్తం అధ్యక్ష పదవికి తన బిడ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి కూడా పుతిన్ యే అధికారం కైవసం చేసుకుంటే అతడు 2036 వరకు అధికారం లో ఉండే చాన్స్ ఉంది. అతడు కనుక గెలిస్తే ఉక్రెయిన్ తో యుద్ధం ఇప్పట్లో క్లోజ్ కాదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.