వివేక్ రామస్వామి మరో రూపాన్ని బయటపెట్టిన ఉద్యోగులు

యూఎస్ ప్రెసిడెంట్ ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ బరిలోకి చాలామంది పోటీదారులు చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి, జరిగిన పోల్ విధానం ప్రకారం రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఫీల్డ్‌లో రెండవ స్థానంలో నిలిచారు. అయితే అత్యధికంగా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు అమెరికా ప్రజలు పాల్గొన్న పోలింగ్ ద్వారా అత్యధికంగా ఆధార అభిమానాలు లభించినట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు రామస్వామి మరో ముఖం గురించి అతని సన్నిహితులు […]

Share:

యూఎస్ ప్రెసిడెంట్ ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ బరిలోకి చాలామంది పోటీదారులు చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి, జరిగిన పోల్ విధానం ప్రకారం రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఫీల్డ్‌లో రెండవ స్థానంలో నిలిచారు. అయితే అత్యధికంగా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు అమెరికా ప్రజలు పాల్గొన్న పోలింగ్ ద్వారా అత్యధికంగా ఆధార అభిమానాలు లభించినట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు రామస్వామి మరో ముఖం గురించి అతని సన్నిహితులు చెప్పడం ప్రస్తుతం వేడిని రేకెత్తిస్తోంది. 

ఆయనది డిమాండ్ చేసే గుణం: 

రామస్వామి సన్నిహితుడుగా ఉన్న చాలామంది, అంతేకాకుండా ఆయనతో పనిచేసి ఉన్న కొంతమంది, అతని కంపెనీలో పని చేసే మరికొంతమంది ఎంప్లాయిస్ చెప్పిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అతని వెంచర్లలోని కొంతమంది మాజీ ఉద్యోగులు, రోవాంట్ సైన్సెస్ మరియు స్ట్రైవ్ అసెట్ మేనేజ్‌మెంట్, అతన్ని న్యూరోటిక్, మెర్క్యురియల్, మతిస్థిమితం లేని నాయకుడిగా అభివర్ణించారు. ప్రస్తుతం ఆయన గురించి వినిపిస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. 

తన ఎంప్లాయిస్ ని బానిసల్లా చూస్తాడని, అతనికి ఏది కావాలన్నా డిమాండ్ చేస్తాడని ఎదుట వారి విషయాన్ని పట్టించుకోడని, అర్థంపర్థం లేని రూల్స్ పెట్టి మనుషులను కృంగదీసే మనస్తత్వం రామస్వామిది అని ఆయన దగ్గర పని చేసిన కొంతమంది ఎంప్లాయిస్ రామస్వామి గురించి మాట్లాడటం జరిగింది. అంతే కాకుండా ఆఫీసులో పని చేస్తున్న వారి గురించి అసలు పట్టించుకోకుండా, ఆఫీసులో ఉష్ణోగ్రతలు తనకి ఇష్టం వచ్చినట్లు ఉండేలా చూసేవాడని, ఆయన ఆఫీసులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ప్రతి సీజన్లో కూడా స్వెటర్లు వేసుకునే పారిస్థితి ఉండేదని వారు రామస్వామి ప్రవర్తన గురించి చెప్పడం జరిగింది. 

ఒక ఏరియా నుంచి మరొక ఏరియా కి ప్రయాణించేందుకు, ఫ్లయిట్స్ అలాగే హోటల్ రూమ్స్ బ్యాక్అప్ గా ఉంచుకునే వాడని, డబ్బులు ఖర్చు పెట్టేందుకు వెనకాడకుండా అతని సౌకర్యానికి మాత్రమే ముందు ప్రయారిటీ ఇచ్చేవాడని చెప్పుకొచ్చారు రామస్వామి మాజీ ఎంప్లాయిస్. అతని దగ్గర పని చేసే అసిస్టెంట్, సెక్యూరిటీ గార్లు బానిసల్లా పనిచేసేవారని కూడా వారు గుర్తు చేశారు. 

పొగిడిన వారు లేకపోలేదు: 

టెక్ దిగ్గజం అయిన ఎలాన్ మస్క్ అమెరికాలో జరగబోయే ప్రెసిడెంట్ పోటీల్లో అభ్యర్థిగా పాల్గొంటున్న వివేక్ రామస్వామికి సపోర్ట్ చేస్తూ, ఆయన మాట్లాడిన కొన్ని మంచి విషయాలను ట్విట్టర్ లో కూడా షేర్ చేసుకోవడం కూడా జరిగింది ఎలాన్ మస్క్. అంతేకాకుండా, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, భారతీయ-అమెరికన్ గురించి ట్వీట్ చేయడం ద్వారా అమెరికా అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామికి సపోర్టర్స్ ఎక్కువగా ఉన్నట్లే తెలుస్తోంది. రామస్వామికి సపోర్ట్ చేస్తూ, మస్క్ తన ట్విట్టర్ ద్వారా, రామస్వామి తన ప్రామిసస్ ఎప్పుడూ కూడా కాన్ఫిడెన్స్ గా చెప్తాడని, తన వైపు నుంచి సపోర్ట్ ని అందిస్తూ రామస్వామి పోస్ట్ చేసిన కొన్ని ప్రకటనలు షేర్ చేశాడు.

మరోసారి, ఎలోన్ మస్క్ US ప్రెసిడెన్సీకి పోటీ చేస్తున్న భారతీయ-అమెరికన్ అభ్యర్థి వివేక్ రామస్వామికి తన మద్దతును చూపించాడు. వైట్ హౌస్‌లో తప్పకుండా రామస్వామి అడుగుపెడతాడని ట్విట్టర్ అధినేత తన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. దీని ద్వారా, యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న వివేక్ రామస్వామికి ప్రజలలో ఎంత ప్రాధాన్యత ఉందో మరొకసారి తెలుస్తోంది. రామస్వామి, హార్వర్డ్ మరియు యేల్ రెండింటి నుండి డిగ్రీలు పొందిన టెక్ వ్యవస్థాపకుడు. కేరళ రాష్ట్రం నుండి USకి వలస వచ్చిన భారతీయ తల్లిదండ్రులకు జన్మించాడు రామస్వామి. మాజీ US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పోటీ చేసిన పోటీదారు రాన్ డిసాంటిస్ కు కూడా మస్క్ తన మద్దతును వినిపించడం జరిగింది. ప్రెసిడెంట్ రేసులో పాల్గొంటున్నట్లు, అధికారికంగా డిసాంటిస్ ట్విట్టర్ లో ప్రకటించడం జరిగింది.

జనవరిలో జరగబోయే యుఎస్ ప్రెసిడెంట్ బరిలో పోటీపడుతున్న ముగ్గురు భారతీయ-అమెరికన్ వ్యక్తులలో, రామస్వామి, నిక్కీ హేలీ మరియు హర్ష్ వర్ధన్ సింగ్‌లతో కలిసి మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను సవాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకునేందుకు, ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాల్సిందే.