వలసదారుల పౌర‌స‌త్వం రద్దు చేయాలంటూ వివేక్ రామస్వామి

యూఎస్ ప్రెసిడెంట్ 2024 ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ బరిలోకి చాలామంది పోటీదారులు చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి, గత నెలలో జరిగిన పోల్ విధానం ప్రకారం రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఫీల్డ్‌లో రెండవ స్థానంలో నిలిచారు. అయితే అత్యధికంగా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు అమెరికా ప్రజలు పాల్గొన్న పోలింగ్ ద్వారా అత్యధికంగా ఆధర అభిమానాలు లభించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరొకసారి డిబేట్ లో […]

Share:

యూఎస్ ప్రెసిడెంట్ 2024 ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ బరిలోకి చాలామంది పోటీదారులు చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి, గత నెలలో జరిగిన పోల్ విధానం ప్రకారం రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఫీల్డ్‌లో రెండవ స్థానంలో నిలిచారు. అయితే అత్యధికంగా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు అమెరికా ప్రజలు పాల్గొన్న పోలింగ్ ద్వారా అత్యధికంగా ఆధర అభిమానాలు లభించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరొకసారి డిబేట్ లో పాల్గొన్న వివేక్ రామస్వామి చేసిన ప్రతిపాదన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

వివేక్ రామస్వామి ప్రతిపాదన: 

అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి, తన రెండవ రిపబ్లికన్ అధ్యక్ష డిబేట్ లో, యుఎస్‌లోని అక్రమ వలసదారుల పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు తనవైపు నుంచి కూడా సపోర్ట్ అందిస్తున్నట్లు ప్రకటించాడు. కాలిఫోర్నియాలోని సిమి వ్యాలీలోని రోనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ కం. మ్యూజియంలో, బుధవారం జరిగిన 2024 ఎన్నికల సందర్భంగా జరిగిన రెండవ రిపబ్లికన్ డిబేట్ ఇది. ఇందులో ముఖ్యంగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి నిక్కీ హేలీతో సహా మరో ఆరుగురు అభ్యర్థులలు డిబేట్ లో పాల్గొనడం జరిగింది.

ఎటువంటి అధికార ఆధారాలులేని వలసదారులను, అంతేకాకుండా అమెరికాలో జన్మించిన వారి పిల్లలను దేశం నుండి బహిష్కరించడానికి ఎటువంటి చట్టాన్ని తీసుకువస్తారని, అంతేకాకుండా ఎటువంటి హక్కుల సవరణ చేసే ఉద్దేశం ఉంది అని.. యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ బరిలో ఉన్న వివేక్ రామస్వామిని అడగడం జరిగింది.. అయితే దీనికి బదులుగా సమాధానమిచ్చిన వివేక్ రామస్వామి..ప్రతిపాదించిన జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేసే, అప్పటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 2015 ప్రతిపాదనను పునరుజ్జీవింపజేసినట్లు, బుధవారం వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 

కొంతమంది సపోర్ట్: 

US రాజ్యాంగంలో ఉన్న 14వ సవరణ పౌరసత్వ నిబంధనలోని దాని ప్రకారం, యూఎస్ కి వలసదారులుగా వచ్చినప్పటికీ.. అంతేకాకుండా ఇక్కడే తమ బిడ్డలకు జన్మనిచ్చిన పౌరులు, తమ వారసత్వ పిల్లలు.. యూఎస్ పౌరులు అవుతారు.  యుఎస్ గడ్డపై జన్మించిన వారికి పౌరసత్వాన్ని మంజూరు చేస్తూ, ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయాన్ని చాలా మంది అంగీకరిస్తున్నప్పటికీ, కొంతమంది న్యాయమూర్తులు మాత్రం.. పౌరుసత్వ హక్కును పరిమితం చేయడానికి ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఉంటుంది అని వాదించారు. రాజ్యాంగ సూత్రాలను పరిమితం చేయవచ్చని కూడా నివేదిక పేర్కొంది. 

తన ప్రత్యర్థులకు కొన్ని విషయాలలో, వివేక్ రామస్వామి కూడా మద్దతు ఇచ్చినట్లు కనిపిస్తుంది. దక్షిణ సరిహద్దులో సైనికీకరణ, సెంచురీ సిటీస్ మరియు మెక్సికో, మధ్య అమెరికాలకు విదేశీ సహాయాన్ని ఆపివేయడం వంటి ఇతర ప్రతిపాదనలను కూడా అంగీకరించాడు. 

H-1B వీసా: 

దేశంలో అక్రమ వలసదారుల పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని నిలిపి వేయడానికి సపోర్ట్ చేయడం ద్వారా తాను ఒక అడుగు ముందుకు వెళతానని చెప్పాడు వివేక్ రామస్వామి. రామస్వామి, H-1B వీసా ప్రోగ్రామ్‌ను గతంలో విమర్శించాడు, ప్రస్తుత లాటరీ వ్యవస్థను పక్కన పెట్టి.. అవసరాలకు సరిపోయేలా మెరిటోక్రాటిక్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. అయితే నిజానికి వివేక్ రామస్వామి స్వయంగా H-1B వీసా ప్రోగ్రామ్‌ను 29 సార్లు ఉపయోగించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. 

H-1B వీసాలపై ఇప్పుడు రామస్వామి చూపిస్తున్న వైఖరి, 2016 ట్రంప్ ప్రచారాన్ని గుర్తు చేస్తుంది. నిజానికి అప్పటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, తన వ్యాపారాల కోసం H-1B వీసాలను ఉపయోగించుకుని అనేక మంది విదేశీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విదేశీ ఉద్యోగులపై ఇంతకు ముందు చాలా పెద్ద చర్చ జరిగింది.