Israel: లెబనాన్ లో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి

ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా(Russia)- యుక్రేన్(Ukraine) దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం (War) ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయెల్ (Israel) హమ్మస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడిని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, […]

Share:

ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా(Russia)- యుక్రేన్(Ukraine) దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం (War) ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయెల్ (Israel) హమ్మస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడిని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ తనని తాను రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ చేస్తూ లెబనాన్ (Lebanon)‌లోని హిజ్బుల్లా(Hezbollah) లక్ష్యాలపై ఇజ్రాయెల్ రాత్రిపూట వైమానిక దాడులు చేసింది. 

ఇజ్రాయిల్ – లెబనాన్ బార్డర్ మధ్యలో హింసకు కారణం: 

ఇరాన్ అనుకూల లెబనీస్ గ్రూప్ హిజ్బుల్లా(Hezbollah), హమాస్ మిత్రపక్షం మరియు ఇజ్రాయెల్ మధ్య తీవ్ర భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ (Israel) అధికారులు ఘర్షణల తర్వాత ఇజ్రాయెల్ (Israel)-లెబనాన్ (Lebanon) సరిహద్దులో కనీసం 28 ప్రాంతాల నుండి వేలాది మంది నివాసితులను ఖాళీ చేయించడం ప్రారంభించారు. 

అక్టోబర్ 7 హమాస్ దాడుల తరువాత ఇజ్రాయెల్ (Israel) ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రేపు ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఇజ్రాయెల్ (Israel) దళాలు హమాస్ ఆధీనంలో ఉన్న భూభాగానికి వ్యతిరేకంగా దాడికి సిద్ధమవుతున్నందున, దీనస్థితిలో ఉన్న గాజా స్ట్రిప్‌లోకి విదేశీ సహాయాన్ని తీసుకురావడంలో సహకరించడానికి, ఇజ్రాయెల్ (Israel) నుండి US హామీలను కూడా పొందిందని బ్లింకెన్ చెప్పారు. గాజాపై ఇజ్రాయెల్ (Israel) దాడులకు తాము అసలు భయపడట్లేదని, దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని హమాస్ ప్రతినిధి అబు ఒబీదేహ్ నిన్న చెప్పారు. అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌ (Israel)పై దాడి చేసినప్పటి నుండి, హమాస్ ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్‌లు 200 మందిని బందీలుగా ఉంచారు. 

ఇజ్రాయిల్ పద్ధతి హద్దు మీరుతుంది అంటున్న చైనా: 

గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) చర్యలు ఆత్మ రక్షణ పరిధికి మించి ఉన్నాయని, అంతే కాకుండా ఇజ్రాయెల్ (Israel) ప్రభుత్వం గాజా (Gaza) ప్రజలపై సామూహిక శిక్షను నిలిపివేయాలి అని చైనా (China) విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆదివారం తెలిపారు.

గాజా (Gaza)లో హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ (Israel) దాడులకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించినందున, వాంగ్ శనివారం తన సౌదీ అరేబియా కౌంటర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌కు పిలుపు మేరకు, వాళ్ళ తరఫునుంచి మాట్లాడటం జరిగింది. 

ఇజ్రాయెల్ (Israel)-హమాస్ వివాదంలో కాల్పుల విరమణ కోసం, శాంతి చర్చలను ప్రోత్సహించడానికి చైనా (China) ప్రత్యేక రాయబారి జాయ్ జున్(Zhai Jun) వచ్చే వారం మిడిల్ ఈస్ట్ వల్లనున్నారని ఆ దేశ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ CCTV ఆదివారం తెలిపింది. శాంతి నెలకొల్పడమే ప్రధాన లక్ష్యంగా నివేదికలు పేర్కొన్నాయి. 

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ (Israel) చర్యలు స్వీయ రక్షణ పరిధిని మించిపోయాయి అని వాంగ్(Wang) అన్నారు.  అంతేకాకుండా గాజా (Gaza)లోని ఎక్కువ గుంపులుగా ఉండే ప్రదేశాలను ఖాళీ చేయాలని, సురక్షిత ప్రాంతాలకు ముందుగానే తరలి వెళ్లాలి అని అభిప్రాయపడ్డారు. 2.3 మిలియన్ల మంది ప్రజలు ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొన్నారు. హమాస్ దాడుల అనంతరం, ఇజ్రాయెల్ (Israel) గాజా (Gaza)లో 2,200 మందిని చంపిన ఇస్లామిస్ట్ గ్రూపును లక్ష్యంగా చేసుకుని భారీ ప్రతీకార బాంబు దాడిని ప్రారంభించింది. ప్రధానంగా చైనా (China) ప్రచురించిన కొన్ని నివేదికల ప్రకారం, ప్రత్యేకించి హమ్మస్ సంబంధించి దాడుల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.