అమెరికా యువతి అరుదైన రికార్డ్

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చూసే ఉంటాం. కొంతమంది క్షణాల్లోనే ఎక్కువ ఆహారం తిన్నారని, క్షణాల్లో కొన్ని లీటర్ల డ్రింక్ తాగేసారని, 20, 30 పిజ్జాలు కేవలం నిమిషాల్లో తినేసారని చాలా రికార్డ్స్ చూసే ఉంటారు. అయితే ప్రస్తుతం అమెరికాకి చెందిన ఒక అమ్మాయి, తిన్న తర్వాత వచ్చే తేన్పు కారణంగా,గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.  మరిన్ని వివరాలు:  మరో విచిత్రమైన ప్రపంచ రికార్డులో, […]

Share:

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చూసే ఉంటాం. కొంతమంది క్షణాల్లోనే ఎక్కువ ఆహారం తిన్నారని, క్షణాల్లో కొన్ని లీటర్ల డ్రింక్ తాగేసారని, 20, 30 పిజ్జాలు కేవలం నిమిషాల్లో తినేసారని చాలా రికార్డ్స్ చూసే ఉంటారు. అయితే ప్రస్తుతం అమెరికాకి చెందిన ఒక అమ్మాయి, తిన్న తర్వాత వచ్చే తేన్పు కారణంగా,గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. 

మరిన్ని వివరాలు: 

మరో విచిత్రమైన ప్రపంచ రికార్డులో, అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఒక అమ్మాయి తన బర్పింగ్ (తేన్పు) అలవాటును కారణంగా రికార్డ్స్ లో స్థానం పొందింది. అమ్మాయిల విభాగంలో, కిమ్బెర్లీ “కిమికోలా” వింటర్, బిగ్గరగా బర్ప్స్ (తేన్పు తీసి) గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (GWR) సెట్ చేసింది. GWR ప్రకారం, 2009 సంవత్సరంలో ఇటలీకి చెందిన ఎలిసా కాగ్నోని సాధించిన 107 dB యొక్క మునుపటి రికార్డును అధిగమించిన, ప్రస్తుతం 33 సంవత్సరాల అమ్మాయి 107.3 డెసిబెల్స్ బిగ్గరగా తేన్పు తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.

మగవారి క్యాటగిరి లోని ప్రపంచంలోనే అత్యంత బిగ్గరగా బర్ప్ (తేన్పు తీసిన) రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన నెవిల్లే షార్ప్ పేరిట ఉంది, 2021 సంవత్సరంలో, నెవిల్లే షార్ప్ (తేన్పు తీసిన) రికార్డు 112.7 dB ఉన్నట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పేర్కొంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, వింటర్ తీసిన తేన్పు, బ్లెండర్ (70-80 dB), ఎలక్ట్రిక్ హ్యాండ్‌హెల్డ్ డ్రిల్ (90-95 dB), ఫుల్ థ్రోటిల్‌లో వచ్చే శబ్దం (100-110 dB) కంటే ఎక్కువ బిగ్గరగా ఉంటుంది అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పేర్కొంది. అయితే ఒక రికార్డింగ్స్ స్టూడియోలోకి వెళ్లి ఆమె తేన్పు తీసి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఎందుకంటే స్టూడియోలో ఎటువంటి నైస్ లేకుండా స్పష్టంగా వినేందుకు ఆ ప్లేస్ ఎంచుకున్నారు.

వింటర్ iHeartRadio స్టేషన్ స్టూడియోస్ కి వెళ్ళింది, అక్కడ ఆమె DJ ఇలియట్ సెగల్ యొక్క రేడియో టాక్ షో ‘ఎలియట్ ఇన్ ది మార్నింగ్’ సమయంలో తన రికార్డ్‌ను ప్రసారం చేయడానికి ప్రయత్నించింది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో, వింటర్ మాట్లాడిన సందర్భంలో, 14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టడానికి, ఆమె ప్రత్యేకించి అల్పాహారంతో పాటు బీర్ మరియు కాఫీ తాగినట్లు ఆమె వెల్లడించింది. వారాల తరబడి చేసిన ఎక్స్పరిమెంట్స్ తర్వాత ఆమె ఇష్టపూర్వకంగా ఇటువంటి రికార్డ్స్ సృష్టించాలని ఎంచుకుంది. అప్పటినుంచి ప్రయత్నాలు చేసి చేసి చరిత్ర సృష్టించింది. మరొక విషయం ఏమిటంటే, ఆమె చిన్నప్పటి నుండి, ఆమె బర్ప్స్ ఆశ్చర్యకరంగా బిగ్గరగా ఉండేవి.

ఇటీవల భారతదేశంలో నమోదైన రికార్డ్స్: 

ఢిల్లీలో ఉన్న ఒక యువకుడు ఒక ప్రత్యేకమైన వరల్డ్ రికార్డ్ని సృష్టించాడు. 15 గంటల 22 నిమిషాల 49 సెకండ్స్ లోనే ఢిల్లీ మెట్రో స్టేషన్ అన్నిట్లోని ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అన్ని మెట్రో స్టేషన్స్ ను కవర్ చేసి శశాంక్ మను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో తన పేరుని నమోదు చేసుకున్నాడు. మిస్టర్ మను ఒక ఫ్రీలాన్స్ రీసర్చ్ర్గా పని చేస్తున్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించేందుకు ఆయన ఎంపిక చేసుకున్నది ఏప్రిల్ 2021. మొత్తం మెట్రో స్టేషన్ ప్రయాణం ఉదయం 5 గంటలకి మొదలైయితే, ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్ కి వెళ్లేందుకు ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ట్రాఫిక్ మెయిన్ గా ఢిల్లీలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఛాలెంజెస్ అనేవి పేస్ చేసి ఆయన వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.