Corona: కోవిడ్ సమయంలో కాళ్లు చేతులు పోగొట్టుకున్న యూఎస్ మహిళ

అసలు ఏం జరిగింది..

Courtesy: Pexels

Share:

Corona: కరోనా (Corona) సమయంలోనే కాకుండా కరోనా (Corona) అనంతరం కూడా చాలామంది అనారోగ్యంతో ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. కరోనా (Corona) సోకిన ప్రతి ఒక్కరు కూడా ఎన్ని అప్రమత్తలు తీసుకుంటున్నప్పటికీ అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్న క్రమం కనిపిస్తోంది. చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా, ఇప్పుడు కరోనా (Corona) సమయంలో ఎఫెక్ట్ అయిన చాలామంది హఠాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా (Corona) సమయంలో ఒక యుఎస్ మహిళ (Woman) అనారోగ్యం పాలై కాళ్లు చేతులు పోగొట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

అసలు ఏం జరిగింది:

ఒక సాధారణ ఫ్లూ (Flu) ప్రాణాంతకంగా మారుతుందని మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. తాజాగా, ఓహియోకి చెందిన ఒక మహిళ (Woman) 2020లో కోవిడ్ (Corona) మహమ్మారి సమయంలో నాలుగు అవయవాలను ఎలా కోల్పోయేలా చేసిందనే దాని గురించి ప్రజలను హెచ్చరిస్తోంది. ఫాక్స్ న్యూస్ నివేదించినట్లుగా, క్రిస్టిన్ ఫాక్స్ అనే ఒక మహిళ (Woman) తన జీవితాన్ని శాశ్వతంగా మార్చిన ఫ్లూ (Flu)కి సంబంధించిన కొన్ని అంశాలను పంచుకోవడం జరిగింది. ఫాక్స్, ఒక హైస్కూల్ అడ్మినిస్ట్రేటర్, మార్చి 2020లో ఆమెకు గొంతునొప్పి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, నాలుగు రోజుల తర్వాత ఆమె రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా తక్కువ స్థాయికి పడిపోయిన తర్వాత ఆమెకు లైఫ్ సపోర్ట్లో ఉంచారు.

ఫాక్స్ తనకు జరిగిన సంఘటన గురించి వివరిస్తూ, తను క్షణంలో చనిపోయినట్లు భావించానని.. 30 నిమిషాల్లో, వెంటిలేటర్పై ఉన్నానని, బహుశా తాను బ్రతుకుతుందో లేదో వైద్యులు చెప్పలేమని వెల్లడించినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆమె అవయవ వైఫల్యానికి కారణమయ్యే బ్యాక్టీరియా న్యుమోనియాతో బాధపడుతున్నట్లు ఆసుపత్రి (hospital)లో తనకు తెలిసిందని, 42 ఏళ్ల ఫాక్స్ చెప్పడం జరిగింది. ఆమె మూత్రపిండాలు దెబ్బతిన్నాయని, ఆమె ఊపిరితిత్తులలో ఒకటి పూర్తిగా పాడైపోయినట్లు ఆమెకు రోజునే తెలిసింది.

క్రిస్టిన్ తన పరిస్థితిని గమనించిన తర్వాత, హాస్పిటల్ (hospital) వారిని పిలిపించింది, మరియు అక్కడ ఉన్న సిబ్బంది ఆమె ప్రాణాలతో బయటపడుతుందని ఊహించలేదు, అయినప్పటికీ ఆమె ప్రాణాలతో బయటపడింది. కొన్ని రోజుల తర్వాత, వైద్యులు ఆమెకు సెప్టిక్ (septic) అయిందని వెల్లడించారు. ఆమెకు అవసరమైన అవయవాలను కాపాడేందుకు, వైద్యులు ఆమెను వైద్యపరంగా ప్రేరేపిత కోమాలో ఉంచారు. ఆమెకు వాసోప్రెసర్ మందులను ఇచ్చారు. కోవిడ్ (Corona) మహమ్మారి కారణంగా కొన్ని రోజుల తరువాత ప్రపంచం స్తంభించిపోయిందని, అయితే క్రిస్టిన్ ఆసుపత్రి (hospital)లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ కాబట్టి, ఆమె తల్లిదండ్రులు మరియు భర్త తనతో ఉండటానికి హాస్పిటల్ (hospital) యాజమాన్యం అనుమతించారని ఆమె గుర్తుచేసుకుంది.

అయితే అప్పట్లో సెప్టిక్ (septic) విషయం తెలుసుకున్న తమ కుటుంబ సభ్యులు చాలా కుమిలిపోయారని, తమ పిల్లలకు విషయం చెప్పడానికి ఆమె భయపడినట్లు చెప్పుకొచ్చింది ఫాక్స్. అయితే సెప్టిక్ (septic) విషయం తెలుసుకున్న ఆమెకు, ఆమె సంతోషంగా జీవితాన్ని గడిపేందుకు చేతి వేళ్ళు గాని, కాళ్ళ వేళ్ళు గాని తొలగించాల్సి ఉంటుందని వైద్యులు తమ కుటుంబానికి చెప్పినట్లు వెల్లడించింది. అయితే చివరికి ఆమె తన చేతిలు కాళ్లు ప్రాసెస్ లో భాగంగా పోగొట్టుకున్నట్లు, డాక్టర్లు వాటిని తొలగించారని, చివరికి ఆమె ప్రాణాలను కాపాడారని చెప్పుకొచ్చింది. తమ పిల్లలకు విషయం చెప్పడానికి చాలా భయపడినట్లు ఫాక్స్ గుర్తుచేస్తుంది. తనని చేతులు కాళ్లు లేకుండా తన పిల్లలు చూడకూడదని తను భావించినట్లు వెల్లడించింది. అయితే ఆమె 72 గంటలు వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకుంటుంది అని నిర్ధారించుకున్న తర్వాత, డాక్టర్లు ఆమెను డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆమె కరెక్టుగా మే, 17 2020లో హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయింది.