ఇండియ‌న్ డిఫెన్స్ కోసం అమెరికా సాయం

వాషింగ్టన్ లో ప్రధాని మోదీ గురువారం నాడు అమెరికా అధ్యక్షుడు అయినటువంటి జో బిడెన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఇండో- అమెరికా దేశాల మధ్య రక్షణ సహకారం మరొక అడుగు ముందుకు వేయనుంది. పెంటగాన్ న్యూఢిల్లీ కు స్ట్రైకర్ ఆర్మర్డ్ ఎయిట్ వీల్ ఫైటింగ్ వెహికల్స్‌ను అందివ్వడంతో పాటు M777 లైట్ వెయిట్ హోయిట్జర్స్ ను అప్‌గ్రేడ్ కూడా చేయనుంది. ఈ స్ట్రైకర్ ఆర్మర్డ్ వెహికల్ టెస్టింగ్ ఆఫ్ఘనిస్తాన్ లోని యుద్ధభూమిలో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా […]

Share:

వాషింగ్టన్ లో ప్రధాని మోదీ గురువారం నాడు అమెరికా అధ్యక్షుడు అయినటువంటి జో బిడెన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఇండో- అమెరికా దేశాల మధ్య రక్షణ సహకారం మరొక అడుగు ముందుకు వేయనుంది. పెంటగాన్ న్యూఢిల్లీ కు స్ట్రైకర్ ఆర్మర్డ్ ఎయిట్ వీల్ ఫైటింగ్ వెహికల్స్‌ను అందివ్వడంతో పాటు M777 లైట్ వెయిట్ హోయిట్జర్స్ ను అప్‌గ్రేడ్ కూడా చేయనుంది.

ఈ స్ట్రైకర్ ఆర్మర్డ్ వెహికల్ టెస్టింగ్ ఆఫ్ఘనిస్తాన్ లోని యుద్ధభూమిలో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా 155 mm M777 హోవిట్జర్‌ ఎత్తయినటువంటి పర్వత శిఖరాల లాంటి ప్రదేశాలకు హెలికాఫ్టర్ సహాయంతో సులభంగా తరలించడం కుదురుతుంది. వీటితో పాటుగా MQ-9 రీపర్ డ్రోన్‌లు మరియు GE-F414 ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ తయారీ మొదలైనవన్నీ కలిపితే భారతదేశంలో 100% టెక్నాలజీ పెరుగుదల ఉంటుంది.

వాషింగ్టన్ మరియు న్యూఢిల్లీ అధికారుల అధ్యయనాల ప్రకారం స్ట్రైకర్ మరియు M777లైట్ వెయిట్ హోవిట్జర్ పై జరగనున్నటువంటి అప్‌గ్రేడేషన్ విషయంలో తుది నిర్ణయం యూఎస్ (US ) యొక్క షరతులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత ప్రధాన మోడీ పర్యటనలో ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ యొక్క డీల్ అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. వీటితో పాటుగా భారతదేశంలో $2.7 బిలియన్ల చిప్ ప్లాంట్ కోసం మైక్రోన్‌తో ఒప్పందం కూడా జరగనుంది.

స్ట్రైకర్ యొక్క స్పెషాలిటీ

స్ట్రైకర్ అనేది ఎంతో శక్తివంతమైనటువంటి V-హల్ అర్మొర్డ్ ఇన్ఫాంటరి వెహికల్. ఇది క్రిటికల్ వార్ టైం లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో 30 mm కానన్ మరియు 105 mm మొబైల్ గన్‌ వంటి అత్యధికమైనటువంటి ఆయుధాల వసతి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లను అదుపు చేయడానికి యూఎస్ ( US)  ఆర్మీ మరియు నాటో ( NATO) దళాలు ఈ స్త్రైకర్ను ఎంతో సమర్థవంతంగా ఉపయోగించాయి. ఇప్పుడు యూఎస్ ( US) అందిస్తున్న ఈ కంబాట్ వెహికల్ ను”ఆత్మనిర్భర్ భారత్” లో భాగంగా స్థానికంగా తయారు చేయడం పై మోదీ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది.

హోవిట్జర్‌

ప్రస్తుతం ఇండియా ఒక్క ఉత్తర సరిహద్దుల్లో ఎదుర్కొంటున్న సవాళ్లకు ధీటుగా సమాధానం చెప్పడం కోసం 155 mm M777 హోవిట్జర్‌లను ఖచ్చితమైన-గైడెడ్ లాంగ్ రేంజ్  పేలుడు పదార్థాలతో అప్ గ్రేట్ చేయడానికి యూఎస్ ( US) అంగీకరించింది.

ఇప్పటికే భారత్ దగ్గర M777 హోవిట్జర్లు 144 వరకు ఉన్నాయి. వీటిలో 120 వరకు మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా తయారు చేయబడినవి. వీటిని ఆపరేట్ చేసిన గన్ లైట్ వెయిట్ గా మారిస్తే సులభంగా వాటిని కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి కొండ ప్రాంతాలకు కూడా అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా సులభంగా తరలించే అవకాశం ఉంటుంది. ఇదే కనుక సంభవించినట్లయితే భారత డిఫెన్స్ సిస్టం మరింత పటిష్టంగా మారుతుంది.

భారత్ మరియు యూఎస్ ( US) మధ్య నెలకొని ఉన్న

మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్( MOU)  ఒప్పందం మరింత బలపడనుంది. ప్రధానమంత్రి మోదీ యూఎస్ ( US) పర్యటన ముగింపు సమయంలో విడుదల చేసే సంయుక్త ప్రకటనలో ఇది ప్రతిబింబించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న అన్ని డీల్స్ కంటే కూడా అతి గొప్పది F-414 ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ కలిగి ఉన్న రీపర్ డ్రోన్స్. 

హంటర్ కిల్లర్ గా గుర్తింపు పొందిన అత్యంత శక్తివంతమైనటువంటి ఈ డ్రోన్స్ ప్రస్తుతం చైనా నుంచి ఇండియా ఎదుర్కొంటున్న సవాళ్లకు సమాధానం అవుతుంది. చైనా సొంతగా తయారు చేసుకున్న ఆర్మ్డ్ డ్రోన్స్ ను స్వయంగా ఉపయోగించడమే కాకుండా పాకిస్తాన్ కి కూడా విక్రయించింది. ఈ నేపథ్యంలో రీపర్ డ్రోన్స్ మన డిఫెన్స్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి.