India-Canada: దౌత్య సిబ్బంది వివాదంపై కెనడాకు అమెరికా, బ్రిటన్ మద్దతు

దౌత్య సిబ్బంది(Diplomatic staff) విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరముందన్న భారత్‌(India) పలు సందర్భాల్లో కెనడా(Canada)కు స్పష్టం చేసింది. అప్పట్లో ఇరు దేశాలు ఈ అంశంగా పెద్దగా పట్టించుకోలేదు. కానీ, నిజ్జర్(Nijjar) హత్య విషయంలో కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలు భారత్, కెనడాల మధ్య అగ్గి రాజేశాయి. దీంతో అధికంగా ఉన్న 41 మంది ఉప సంహరించుకోవాలని భారత్ అల్టిమేటం(India Ultimatum) జారీచేసింది. లేకుంటే దౌత్యపరంగా కల్పించే భద్రతను కల్పించమని, ఏదైనా జరిగితే తమకు సంబంధం లేదని స్పష్టం […]

Share:

దౌత్య సిబ్బంది(Diplomatic staff) విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరముందన్న భారత్‌(India) పలు సందర్భాల్లో కెనడా(Canada)కు స్పష్టం చేసింది. అప్పట్లో ఇరు దేశాలు ఈ అంశంగా పెద్దగా పట్టించుకోలేదు. కానీ, నిజ్జర్(Nijjar) హత్య విషయంలో కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలు భారత్, కెనడాల మధ్య అగ్గి రాజేశాయి. దీంతో అధికంగా ఉన్న 41 మంది ఉప సంహరించుకోవాలని భారత్ అల్టిమేటం(India Ultimatum) జారీచేసింది. లేకుంటే దౌత్యపరంగా కల్పించే భద్రతను కల్పించమని, ఏదైనా జరిగితే తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. తాజాగా, తమ దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్నట్లు కెనడా(Canada) గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.

దౌత్య సిబ్బంది ఉపసంహరణకు సంబంధించి భారత్‌తో నెలకున్న వివాదంలో కెనడాకు అమెరికా(America), బ్రిటన్ (Britain)మద్దతు ప్రకటించాయి. దౌత్యవేత్తల సమానత్వంపై వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని ఆరోపించాయి. భారత్‌లో కెనడా తన దౌత్యపరమైన ఉనికిని తగ్గించుకోవాలని పట్టుబట్టవద్దని ఇరు దేశాలూ భారత్‌కు సూచించాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యపై కెనడా ప్రధాని వ్యాఖ్యలతో మొదలైన దౌత్య యుద్ధం తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలన్న భారత్ ఆదేశాలపై అమెరికా, యూకే ఆందోళన వ్యక్తం చేశాయి.

Also Read: Canada: దౌత్యవేత్తల ఉపసంహరణ.. భార‌త్‌పై ప్ర‌భావం ప‌డ‌నుందా?

‘విభేదాలను పరిష్కరించడానికి సంబంధిత రాజధానులలో కమ్యూనికేషన్, దౌత్యవేత్తలు(Diplomats) అవసరం. అనేక మంది కెనడా దౌత్యవేత్తలు భారత్‌ను విడిచిపెట్టడానికి కారణమైన న్యూఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మేము ఏకీభవించడం లేదు’ యూకే ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దౌత్య సంబంధాల విషయంలో 1961 వియన్నా ఒప్పందం ప్రకారం అన్ని దేశాలూ నడుచుకోవాలని తాము భావిస్తున్నట్లు బ్రిటన్(Britain) తెలిపింది. ‘దౌత్యవేత్తల భద్రత, అందుకోసం అందించే అధికారాలు, రక్షణను ఏకపక్షంగా తొలగించడం వియన్నా ఒప్పంద సూత్రాలకు విరుద్ధం’ అని పేర్కొంది.

కెనడా దౌత్యవేత్తలను భారత్‌ను వెనక్కి రావడంతో చాలా ఆందోళన కలిగిస్తోందని బ్రిటన్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ‘వివాదాల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో దౌత్యవేత్తలు అవసరం.. కెనడా దౌత్యపరమైన ఉనికిని తగ్గించాలని, నిజ్జర్ హత్య విషయంలో కెనడా దర్యాప్తునకు సహకరించాలని మేం భారత ప్రభుత్వాన్ని కోరాం… దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందం ప్రకారం కెనడా దౌత్య మిషన్ గుర్తింపు పొందిన సభ్యులకు లభించే అధికారాలు, రక్షణకు సంబంధించి భారత్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తుందని మేము ఆశిస్తున్నాం.. ’ అని తెలిపింది.

Also Read: Canada: కెనడా – ఇండియా మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్

నిజ్జర్ హత్య కేసు(Nijjar murder case)లో కెనడా స్వతంత్ర దర్యాప్తులో భారత్‌ను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉన్నామని బ్రిటన్ వ్యాఖ్యానించింది. కాగా, దౌత్యవేత్తలపై అణిచివేతతో ఇరు దేశాల్లోని లక్షలాది మంది ప్రజల సాధారణ జీవనాన్ని భారత ప్రభుత్వం కష్టతరం చేస్తోందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు.

ఖలీస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ గత జూన్ 18న బ్రిటిష్ కొలంబియా నగరం(Columbia City) సర్రెలోని సిక్కు కల్చరల్ సెంటర్ వద్ద హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తుల అతడిపై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ  విషయంపై భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం నడుస్తోంది. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. కెనడా(Canada)లోని భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. అయితే, కెనడా ఆరోపణలను భారత్ పూర్తిగా ఖండించింది. ఆరోపణలకు ఆధారాలు ఉంటే సమర్పించాలని స్పష్టం చేసింది. భారత దౌత్యవేత్తను వెనక్కి పంపడానికి ప్రతిగా.. కెనడాకు చెందిన సీనియర్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలని దిల్లీ ఆదేశించింది.

ఇటీవల, కెనడాకు భారత్ మరో అల్టిమేటం జారీ చేసింది. దేశంలో పరిమితికి మించి ఉన్న దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకున్నట్లు కెనడా ప్రకటించుకుంది. నిజ్జర్ వ్యవహారంపై తొలుత తటస్థంగా మాట్లాడుతూ వచ్చిన అమెరికా.. ఆ తర్వాతి నుంచి కెనడాకు మద్దతు పలుకుతూ వస్తోంది. దౌత్యవేత్తల తగ్గింపు వ్యవహారంపైనా కెనడాకు మద్దతుగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.