US: 18 మందిని హతమార్చిన నరహంతకుడు మృతి..హ‌త్యా.. ఆత్మ‌హ‌త్యా?

అమెరికా(US)లో రెండు రోజుల క్రితం జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడు రాబర్ట్‌(Robert) మృతి చెందాడు. అతడు ఆత్మహత్య(suicide) చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  లెవిస్‌టన్‌(Lewiston) అమెరికా (US)లోని మైన్‌ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న భీకర కాల్పుల ఘటన (Mass Shooting) నిందితుడు రెండు రోజుల తర్వాత శవమై కన్పించాడు. శుక్రవారం రాత్రి అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి ధ్రువీకరించారు. దీంతో రెండు రోజుల గాలింపు ఆపరేషన్‌ను పోలీసులు ముగించగా.. నిందితుడి మృతితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా […]

Share:

అమెరికా(US)లో రెండు రోజుల క్రితం జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడు రాబర్ట్‌(Robert) మృతి చెందాడు. అతడు ఆత్మహత్య(suicide) చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

లెవిస్‌టన్‌(Lewiston) అమెరికా (US)లోని మైన్‌ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న భీకర కాల్పుల ఘటన (Mass Shooting) నిందితుడు రెండు రోజుల తర్వాత శవమై కన్పించాడు. శుక్రవారం రాత్రి అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి ధ్రువీకరించారు. దీంతో రెండు రోజుల గాలింపు ఆపరేషన్‌ను పోలీసులు ముగించగా.. నిందితుడి మృతితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

అమెరికా కాలమానం ప్రకారం.. గత బుధవారం రాత్రి మైన్‌ రాష్ట్రంలోని లెవిస్‌టన్‌(Lewiston)లో కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. స్థానికంగా ఓ రెస్టారెంట్లో, ‘టెన్‌ పిన్‌ బౌలింగ్‌(Ten pin bowling)’ వేదిక వద్ద ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది గాయపడ్డారు. నిందితుడిని 40 ఏళ్ల రాబర్ట్‌ కార్డ్‌(Robert Card)గా గుర్తించారు.

ఘటన తర్వాత రాబర్ట్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడి వద్ద ఆయుధం ఉండటంతో.. మళ్లీ కాల్పులకు తెగబడే అవకాశముందని పోలీసులు అనుమానించారు. లెవిస్‌టన్‌(Lewiston) నుంచి లిస్బన్‌(Lisbon) వరకు ప్రజలు, వ్యాపారులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాల్పుల సమయంలో నిందితుడి ఫొటోను కూడా విడుదల చేశారు. అందులో అతడు చేతిలో తుపాకీతో కన్పించాడు. దీంతో లెవిస్‌టన్‌, లిస్బన్‌ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపారు.

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి లిస్బన్‌లో ఓ రీసైక్లింగ్‌ సెంటర్‌ సమీపంలోని చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృత దేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని రాబర్ట్‌ కార్డ్‌గా గుర్తించారు. బుల్లెట్ గాయంతో అతడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, రాబర్ట్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? అనేదానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. రాబర్ట్‌ కార్డ్‌ గతంలో ఆర్మీ రిజర్వు(Army Reserve)లో ఒక శిక్షణ కేంద్రంలో ఆయుధ వినియోగ శిక్షకునిగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 

రిటైర్డ్‌ మిలిటరీ ఆఫీసర్‌ అయిన కార్డ్‌ ఇంతకు ముందు పనిచేసిన చోట ఉద్యోగం కోల్పోయినట్టు  తెలుస్తోందన్నారు. ఇంతకుముందు గృహహింస కేసులో అరెస్టయి విడుదలయ్యాడని, మానసిక సమస్యలతో వేసవిలో రెండువారాల పాటు చికిత్స పొందాడని తెలిపారు.  గతంలో కార్డ్‌ ఇదే రీసైక్లింగ్‌ సెంటర్‌(Recycling Centre)లో కొంత కాలం పని చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. తాజా పరిణామాలపై మైన్‌ గవర్నర్‌ జానెత్‌ మిల్స్‌(Governor Janet Mills) స్పందిస్తూ.. ‘‘రాబర్ట్‌ కార్డ్‌తో మరణంతో చాలా ఇకపై ఎవరికి ముప్పు లేదని తెలిసి చాలా ఊరటగా ఉంది…కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నానని మిల్లిస్ ఒక వార్తా సమావేశంలో ప్రకటించారు. 

మైనేలోని లెవిస్టన్‌లో జరిగిన సామూహిక కాల్పుల ఘటన ఆ నగరంలోని ప్రజలకే కాకుండా మొత్తం యునైటెడ్ స్టేట్స్‌కు చాలా బాధాకరమని అధ్యక్షుడు బైడెన్ (Biden) అన్నారు.

కాగా  బుధవారం (అ‍క్టోబరు 25) రాత్రి మైనేలోని లెవిస్టన్‌లోని బౌలింగ్ అల్లే, రెస్టారెంట్‌లో రాబర్ట్‌ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 16 మంది  చనిపోయారు.  వీరిలో  70 ఏళ్ల భార్యాభర్తలు, తండ్రితో పాటు హత్యకు గురైన 14 ఏళ్ల బాలుడి వరకు బాధితులను అధికారులు శుక్రవారం గుర్తించారు. ఈ ఘటనలో మరో 50-60 మంది దాకా గాయ పడిన సంగతి తెలిసిందే.

2017లో లాస్ వెగాస్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో 60 మంది మరణించిన  ఘటన, అలాగే 2022లో టెక్సాస్‌లోని ఉవాల్డేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ముష్కరుడు కాల్పులు జరిపి, 19 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులను చంపిన ఘటన తరువాత ఇదే అత్యంత ఘోరమైన కాల్పులు కావడంతో  ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.