Love: ఆమెకు 28 ఏళ్లు..ఈయ‌న‌కు 70 ఏళ్లు..

మన సమాజంలో ప్రస్తుతం ప్రేమకు అవదులు.. పరిమితులను కొందరు ప్రేమికులు చేరిపేస్తున్నారు. సాధారణంగా ప్రేమ(Love) గుడ్డిది అంటారు.. అవును, ప్రేమలో మునిగి తేలిన వ్యక్తికి ఏమీ అర్థం కాదని ఒక నానుడి. ఎందుకంటే ఒక్కసారి ప్రేమలో పడిన వారు రంగు, కులం, దేశం, ప్రాంతీయ బేదాలను సైతం పట్టించుకోరు. పీకల్లోతు ప్రేమలో ఉన్నవారు తమకు అనిపించింది మాత్రమే చేస్తారు.  తన భాగస్వామి కోసం ఎంత వరకైనా వెళ్తారు. ఇందుకు నిదర్శనమైన ఘటనలు మనం ఎన్నో చూశాం. వయసు […]

Share:

మన సమాజంలో ప్రస్తుతం ప్రేమకు అవదులు.. పరిమితులను కొందరు ప్రేమికులు చేరిపేస్తున్నారు. సాధారణంగా ప్రేమ(Love) గుడ్డిది అంటారు.. అవును, ప్రేమలో మునిగి తేలిన వ్యక్తికి ఏమీ అర్థం కాదని ఒక నానుడి. ఎందుకంటే ఒక్కసారి ప్రేమలో పడిన వారు రంగు, కులం, దేశం, ప్రాంతీయ బేదాలను సైతం పట్టించుకోరు. పీకల్లోతు ప్రేమలో ఉన్నవారు తమకు అనిపించింది మాత్రమే చేస్తారు.  తన భాగస్వామి కోసం ఎంత వరకైనా వెళ్తారు. ఇందుకు నిదర్శనమైన ఘటనలు మనం ఎన్నో చూశాం. వయసు అంతర ప్రేమ వ్యవహారాల గురించి చాలానే విన్నాం. వయసులో చిన్న అమ్మాయి.. వృద్ధుడి(Old Man)ని ప్రేమించడం, వృద్ధురాలు యువకుడిని ప్రేమించడం.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట వింత సంబంధాలు వెలుగు చూస్తూనే ఉంటాయి.  తాము వలిచిన వారితో జీవించేందుకు ఇంట్లో వాళ్లనైనా, సమాజాన్నైనా ఎదురిస్తారు. ఎన్ని హద్దులున్నా దాటుకుని వచ్చి.. ఒక్కటవుతారు. ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 

28  ఏళ్ల అమ్మాయి జాకీ(Jackie) .. 70 ఏళ్ల డేవ్(Dave)  ఇద్దరూ ప్రేమించుకున్నారు.  వీరు చూడటానికి తాతా మనవరాలి మాదిరిగా ఉంటారు. వీరి వయస్సు  42 ఏళ్ల  తేడా(42 years difference) ఉంది ఏడేళ్ల నుంచి వీరిద్దరూ భార్య భర్తలుగా జీవిస్తున్నారు. డేవ్ ఏడు సంవత్సరాల క్రితం ఫిలిప్పీన్స్(Philippines) వెళ్లినప్పుడు  డేటింగ్ యాప్(Dating app) లో జాకీని పరిచయం చేసుకున్నాడు.  ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.  అప్పుడు జాకీ వయస్సు 21 సంవత్సరాలు కాగా.. డేవ్ వయస్సు 63 సంవత్సరాలు.  అప్పటికే అతను సీనియర్ సిటిజన్(Senior citizen) అయ్యాడు.    

వయస్సులో ఇంత తేడా ఉన్నా.. ఆయనతో ప్రేమ(Love)లో పడింది.  ఆయనతోనే జీవిస్తుంది. జాకీ తన ప్రియుడు డేవ్ తో కలిసి జీవించేందుకు అమెరికా(America) వచ్చింది.  అక్కడ వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.  ప్రస్తుతం  వీరు కలిసి జీవిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్(Viral) అయ్యాయి.  చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారని వారు తెలిపారు.  డేవ్ ను డబ్బుకోసం ప్రేమించలేదని జాకీ తెలిపింది.  నెటిజన్లు చేసే ట్రోల్స్ (Trolls) కు వారు సమాధానం ఇస్తున్నారు.  

టిక్‌టాక్‌(TikTok)లో, వారిని అనుసరించే వారు దాదాపు 50,000 మంది ఉన్నారు. తమ 42 ఏళ్ల వయసు తేడా తమను ఇబ్బంది పెట్టడం లేదని ఓ వీడియో పోస్ట్ చేశారు. జాకీ వారి “లవ్ డోంట్ జడ్జ్”(Love Don’t Judge) అనే యూట్యూబ్ ఛానెల్‌లో వారి సంబంధం గురించి కూడా మాట్లాడారు. ప్రజలు కొన్నిసార్లు డేవ్‌ను “షుగర్ డాడీ”(Sugar daddy) అని పిలిచారు, కానీ అది నిజం కానందున ఆమెకు దాని గురించి ఇబ్బంది లేదని తెలిపింది. ఆమె కుటుంబం మరియు స్నేహితులు వారి సంబంధానికి మద్దతు ఇవ్వడంతో వయస్సులో చాలా తేడా ఉన్నా.. అది తాము పట్టింపు కాదని… చాలా సంతోషంగా జీవిస్తున్నామని జాకీ తెలిపారు. 

విదేశాల నుంచి దిగుమతి అయి మన దేశంలోనూ పాతుకుపోయింది డేటింగ్‌ సంస్కృతి(Dating culture). ఈ క్రమంలోనే ప్రస్తుతం వందలు, వేల సంఖ్యలో డేటింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. యవ్వనంలో ఉన్నప్పుడు ప్రేమ, డేటింగ్‌(Dating).. వంటి వాటికి త్వరగా ఆకర్షితులవుతుంటారు పిల్లలు. ఇందుకు ఆ వయసులో హార్మోన్ల ప్రభావం కావచ్చు.. లేదంటే తోటి పిల్లలు/తెలిసిన వారిని చూసి తామూ అలా చేయాలనుకోవచ్చు. ఇలా కారణమేదైనా.. ఇలాంటి అనుబంధాల గురించి వారికి సరైన అవగాహన లేకపోవడం.. ఏది మంచో, ఏది చెడో తెలియకపోవడం వల్ల వాళ్లు తప్పుడు మార్గాన్ని ఎంచుకునే ప్రమాదం ఉంటుంది. అలా జరగకూడదంటే ఈ విషయాల గురించి పేరెంట్సే తమ పిల్లలకు సున్నితంగా వివరించాలంటున్నారు నిపుణులు