చైనాలో తాండవిస్తున్న నిరుద్యోగం..

చైనా, తయారీ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న దేశం. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటి. అలాగే, సరిహద్దు దేశాలతో అత్యధిక గొడవలు ఉన్న దేశం కూడా చైనానే. ప్రపంచంలోనే రెండో ఆర్థిక శక్తిగా ఉన్న చైనా.. కరోనా తర్వాత ఆ దేశ పరిస్థితి కొంత దిగజారింది. ప్రజలపై బలవంతపు నిర్భందాలతో రెండేళ్లు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతినింది. అలాగే, ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం చైనాను నిరుద్యోగ సమస్య వేధిస్తున్నది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన చాలా మంది యువకులు […]

Share:

చైనా, తయారీ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న దేశం. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటి. అలాగే, సరిహద్దు దేశాలతో అత్యధిక గొడవలు ఉన్న దేశం కూడా చైనానే. ప్రపంచంలోనే రెండో ఆర్థిక శక్తిగా ఉన్న చైనా.. కరోనా తర్వాత ఆ దేశ పరిస్థితి కొంత దిగజారింది. ప్రజలపై బలవంతపు నిర్భందాలతో రెండేళ్లు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతినింది. అలాగే, ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం చైనాను నిరుద్యోగ సమస్య వేధిస్తున్నది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన చాలా మంది యువకులు ఉద్యోగాల్లేక రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. ఉద్యోగాలు రాక యువత తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. 

వేల రెజ్యూమ్‌లు పంపినా జాబ్ రాలేదు

తాజాగా సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన జాంగ్‌ అనే 23 ఏళ్ల యువతి.. పలు కంపెనీలకు వేల సంఖ్యలో రెజ్యూమ్‌లు పంపింది. కానీ, తాను ఎంచుకున్న పరిశోధన రంగంలో ఉద్యోగం రాలేదు. నెలల తరబడి ఉద్యోగ ప్రయత్నం చేసినా రాకపోవడంతో ఆ యువతి బాధపడుతుంది. ‘‘గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక నిజంగా తీవ్ర ఒత్తిడి ఉంటుందని నేను తెలుసుకున్నాను” అని ఆ యువతి బీజింగ్‌లో ఈ వీకెండ్‌లో జరిగిన రిక్రూట్‌మెంట్‌ ఫెయిర్‌‌లో మాట్లాడింది. తాను పంపే ప్రతి రెజ్యూమ్‌కు కంపెనీ నుంచి స్పందన వస్తుంది… కానీ ఉద్యోగం రావడం లేదని చెప్పింది. ఈ మాటలను బట్టి చూస్తేనే చైనాలో నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జాంగ్‌ లాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. 

ఒక్క జూన్‌ నెలలోనే 16 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వారు 21.3 శాతం మంది నిరుద్యోగులుగా మారారు. ఇది ఒక నెలలో పరిస్థితి అని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, వయసు సంబంధిత ఉపాధి డేటాను ప్రచురించడం ఇకపై నిలిపివేస్తామని ప్రకటించారు. 

జాబ్‌ ఫెయిర్‌‌లకు వేలల్లో నిరుద్యోగులు…

ఈ వారం బీజింగ్‌లో నిర్వహించిన కెరీర్‌‌ ఫెయిర్‌‌లో వేల సంఖ్యలో నిరుద్యోగులు హాజరు అయ్యారు. ఇందులో లైఫ్‌లో ఫస్ట్ జాబ్‌ చేయడానికి వచ్చిన వారు కొందరైతే, మొదటి జాబ్‌ వదిలేసి, మళ్లీ జాబ్‌ కోసం వచ్చిన వాళ్లూ ఉన్నారు. అయితే, అక్కడికి వచ్చిన వారిని చూస్తే ఉద్యోగం రావడం ఒక సవాల్‌గా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. యాంగ్‌ యావో అనే మీడియాలో అనుభవం ఉన్న 21 ఏళ్ల నిరుద్యోగి.. సెంట్రల్ బీజింగ్‌లో గురువారం జరిగిన జాబ్‌ ఫెయిర్‌‌కు హాజరయ్యాడు. అయితే, ఇక్కడ రిక్రూటర్లు పెట్టిన పేస్కెల్‌ చాలా తక్కువగా ఉందని తెలిపాడు. అడ్మినిస్ట్రేటివ్‌ పోజిషన్‌ కోసం వారు రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటున్నాని వెల్లడించాడు.

అతను బీజింగ్‌లోని తన ఫ్యామిలీకి దగ్గరగా ఉండటానికి తూర్పు చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌ లో ఉద్యోగం వదులుకొని ఇక్కడకు వచ్చాడు. అయితే, ఇక్కడ ఉద్యోగం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. ‘‘జాబ్‌ లేకపోవడంతో రోజూ రాత్రి నాకు నిద్రపట్టడం లేదు. చాలా ఆందోళనగా ఉంది. నాకు ఉద్యోగం దొరక్కపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఎంటి? నేను కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి” అని అతను పేర్కొన్నాడు. 

కరోనా తర్వాత కష్టాలు

కరోనా ఒక్క చైనానే కాదు.. ప్రపంచ దేశాలను వణికించింది. ఆర్థికంగా అన్ని దేశాల రూపురేఖలు మారిపోయాయి. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు చైనాలో పలు కంపెనీలు ఉద్యోగులను తీసేశాయి. కరోనా మహమ్మారి తర్వాత మూడేళ్లు పలు కంపెనీలు రిక్రూట్‌మెంట్లను ఆపేశాయి. కానీ, పరిస్థితి ఇప్పుడు సర్దుమనగడంతో కొత్త ఉద్యోగులను తీసుకోవడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయని టెలీ కమ్యూనికేషన్‌ సేవల సంస్థ హైరింగ్‌ మేనేజర్ వెల్లడించారు. కరోనా తర్వాత బీమా రంగంలో ఉద్యోగులు చాలా ఉన్నాయని, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇన్సూరెస్‌ కంపెనీలు కోరుతున్నాయి. ఇన్‌కం కూడా బాగానే సంపాదించుకోవచ్చని సూచిస్తున్నాయి. అయితే, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.