ఉత్తర కొరియా మరోసారి అండర్ వాటర్ న్యూక్లియర్ డ్రోన్ పరీక్ష..

ఉత్తర కొరియా ఏప్రిల్ 4 నుండి ఏప్రిల్ 7 వరకు Haeil -2 ని పరీక్షించింది. ఇది మనుషులు లేకుండానే నీటి అడుగున దాడి చేయగలిగిన, అణ్వాయుధ సామర్థ్యం గల ఆయుధం. Haeil -1 అనే నీటి అడుగున పనిచేసే డ్రోన్‌ను పరీక్షించిన వారం రోజుల తర్వాత ఈ విషయాన్ని మీడియా ద్వారా నివేదించింది. హేలీ అంటే సునామీ అని అర్థం. ఉత్తర కొరియా మనుషులు లేకుండానే నీటి అడుగున దాడి చేయగలిగిన, అణ్వాయుధ సామర్థ్యం గల […]

Share:

ఉత్తర కొరియా ఏప్రిల్ 4 నుండి ఏప్రిల్ 7 వరకు Haeil -2 ని పరీక్షించింది. ఇది మనుషులు లేకుండానే నీటి అడుగున దాడి చేయగలిగిన, అణ్వాయుధ సామర్థ్యం గల ఆయుధం. Haeil -1 అనే నీటి అడుగున పనిచేసే డ్రోన్‌ను పరీక్షించిన వారం రోజుల తర్వాత ఈ విషయాన్ని మీడియా ద్వారా నివేదించింది. హేలీ అంటే సునామీ అని అర్థం. ఉత్తర కొరియా మనుషులు లేకుండానే నీటి అడుగున దాడి చేయగలిగిన, అణ్వాయుధ సామర్థ్యం గల ఈ డ్రోన్ కి మరొక పరీక్షను కూడా నిర్వహించింది. యునైటెడ్ స్టేట్స్,  దక్షిణ కొరియాకు వ్యతిరేకంగా నీటి సైనిక సామర్ధ్యాలు ఉంటాయని తెలిపింది. 

ఈ డ్రోన్ 71 గంటల 60 నిమిషాల పాటు 1000 కిలోమీటర్లు ప్రయాణించి, అనుకున్న  లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిందని ఉత్తర కొరియా రాష్ట్ర వార్తా సంస్థ తెలిపింది. ఈ పరీక్ష నీటి అడుగున వ్యూహాత్మక అణ్వాయుధ వ్యవస్థ విశ్వసనీయతను, దాని ప్రాణాంతకమైన దాడి సామర్థ్యాన్ని ఖచ్చితంగా నిరూపించిందని తెలిపారు. మరి కొంతమంది విశ్లేషకులు నీటి అడుగున డ్రోన్ మోహరింపుకు సిద్ధంగా ఉందో లేదో అని అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఉత్తర కొరియా సైనిక చర్యలకు ఈ వ్యవస్థ సహాయపడుతుందని కెసిఎన్ఏ తెలిపింది.  ఆ రాష్ట్ర మీడియా విడుదల చేసిన పలు ఫోటోలు ఆధారంగా నీటిలో ఉన్న టార్ 5 ఆకారంలో ఉన్న వస్తువును అలాగే సముద్ర ఉపరితలంపై కనిపించే వస్తువు యొక్క నీటి అడుగున ఉండే పేలుడు యొక్క ట్రాకులను చూపించింది అని స్పష్టం చేశారు.  ఉత్తర కొరియా కొన్ని నెలల తరబడి క్రమం తప్పకుండా వివిధ విధాలను పరీక్షిస్తుంది.  ఈ నేపథ్యంలోనే సంయుక్త దక్షిణ కొరియా, సంయుక్త సైనిక విన్యాసాలను ప్రతిస్పందనగా ఇటీవల మరోసారి వీటిని పరీక్షించింది.

2012 నుంచి అభివృద్ధి చేస్తున్న ఈ డ్రోన్ ను గత రెండేళ్లలో 50 సార్లు పైన పరీక్షించి చూసినట్లు తెలిపింది. అయితే ఉత్తర కొరియా ప్రకటనలో విశ్వసనీయతపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హేయిల్ అంటే కొరియా భాషలో సునామి.  ఈ డ్రోన్ గురించి ఉత్తర కొరియా అధికారికంగా వెల్లడించడం ఇదే మొదటిసారి కాదు. ఉత్తరకొరియా  వేగవంతమైన  చర్యలకు మూలం తప్పదంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ పరీక్ష గురించి ప్రకటన వెలువడింది. కొరియా సముద్ర జలాల్లో విమాన వాహక నౌకలను మోహరిస్తాయని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే..

ఉత్తర కొరియా సముద్ర భాగంలో ఈ అణు డ్రోన్‌ను పరీక్షించింది. తమ దేశం రేడియో యాక్టివ్ సునామీ సృష్టించిందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. అమెరికాపై అణు దాడి చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఉత్తర కొరియా ప్రయత్నిస్తుందని ఆ దేశ కసరత్తులు సూచిస్తున్నాయి. మాకు న్యూక్లియర్ వార్ హెడ్ లతో అతికించిన క్రూజ్ క్షిపణులు కూడా ఉన్నాయని అధికారిగా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. సముద్రం నీటి అడుగున డ్రోన్ పేలడానికి ముందు తూర్పు తీరంలో సుమారు 60 గంటల పాటు ప్రయాణించిందని నార్త్ కొరియా తెలిపింది. దక్షిణ కొరియాతో సంయుక్తంగా సైనిక విన్యాసాలకు పాల్పడితే తాము పసిఫిక్ సముద్రాన్ని ఫైరింగ్ రేంజ్ గా మారుస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది.