యూకే ప్రధానిపై పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు

బ్రిటన్ ప్రధానమంత్రి అయిన రిషి సునక్ పార్లమెంటరీలో విచారణను ఎదుర్కొననున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ భార్య అయిన అక్షతాా మూర్తికి అనుకూలంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు రిషి సునక్‌పై ఆరోపణలు ఉన్నాయి. రిషి సునక్ భార్య అక్షతాా మూర్తి గత కొద్ది కాలంగా చిన్న పిల్లల సంరక్షణ సంస్థలో పెట్టుబడిదారుగా ఉన్నారు. మాతా శిశు సంరక్షణ కొత్త పథకాన్ని పేర్కొంటూ ఇచ్చిన ఇంటరెస్ట్స్ డిక్లరేషన్‌లో యూకే ప్రధాని రిషి సునక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు పలు సందేహాలు […]

Share:

బ్రిటన్ ప్రధానమంత్రి అయిన రిషి సునక్ పార్లమెంటరీలో విచారణను ఎదుర్కొననున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ భార్య అయిన అక్షతాా మూర్తికి అనుకూలంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు రిషి సునక్‌పై ఆరోపణలు ఉన్నాయి. రిషి సునక్ భార్య అక్షతాా మూర్తి గత కొద్ది కాలంగా చిన్న పిల్లల సంరక్షణ సంస్థలో పెట్టుబడిదారుగా ఉన్నారు. మాతా శిశు సంరక్షణ కొత్త పథకాన్ని పేర్కొంటూ ఇచ్చిన ఇంటరెస్ట్స్ డిక్లరేషన్‌లో యూకే ప్రధాని రిషి సునక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు పలు సందేహాలు లేవనెత్తారు. అలాగే బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ తన పార్లమెంటరీ డిక్లరేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆబ్లిగేషన్ కింద తన భార్య అక్షతాా మూర్తికి చైల్డ్ కేర్ సంస్థలో ప్రయోజనం చేకూర్చగలిగేలా బడ్జెట్‌ను రూపొదించినట్లు ఆరోపణలు వచ్చాయి. 

కమిషనర్ వెబ్‌సైట్‌లోని అప్‌డేట్‌లో దర్యాప్తు ఎంపీల ప్రవర్తనా నియమావళిలోని 6వ పేరాకు సంబంధించినది. ఈ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ప్రధాని సునక్ హౌస్ లేదా దాని కమిటీల ఏదైనా కార్యకలాపాలపై ఏదైనా సంబంధిత విషయాలను ప్రకటించడంలో ఎల్లప్పుడూ బహిరంగంగా, స్పష్టంగా ఉండాలని పేర్కొనడం జరిగింది. అలాగే సభ లేదా దాని కమిటీల యొక్క ఏదైనా ప్రక్రియలో మంత్రులు, సభ్యులు, ప్రభుత్వ అధికారులు లేదా పబ్లిక్ ఆఫీస్ హోల్డర్‌లతో ఏదైనా కమ్యూనికేషన్‌లో ఏదైనా సంబంధిత విషయాన్ని ప్రకటించడంలో సభ్యులు ఎల్లప్పుడూ బహిరంగంగా మరియు స్పష్టంగా ఉండాలి” అని పేరా 6 పేర్కొంది.

BBC ప్రకారం, ది కోరు కిడ్స్ లిమిటెడ్‌పై బ్రిటిష్ ఇండియన్ నాయకుడి భార్యకు సంబంధించిన విచారణ, గత నెల బడ్జెట్‌లో ప్రజలను చైల్డ్‌మైండర్‌లు (చైల్డ్‌మైండర్‌ అంటే అతని లేదా ఆమె స్వంత ఇంటిలో ఇతరుల పిల్లలను చూసుకునే ఉద్యోగం) గా మార్చడానికి ప్రోత్సహించే కొత్త పైలట్ పథకం నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతాా మూర్తి, UK యొక్క కంపెనీస్ హౌస్ రిజిస్టర్‌లో కోరు కిడ్స్‌లో వాటాదారుగా జాబితా చేయబడింది. సంప్రదింపు వివరాలతో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో జాబితా చేయబడిన ఇంగ్లాండ్‌లోని ఆరు చైల్డ్‌మైండర్ ఏజెన్సీలలో ఇది ఒకటి. ప్రతిపక్షం గత నెలలో ఈ వాస్తవాన్ని తెర పైకి తెచ్చింది మరియు అన్ని హౌస్ ఆఫ్ కామన్స్ కమిటీ అధ్యక్షులతో కూడిన అనుసంధాన కమిటీ విచారణలో తదుపరి వివరణల కోసం పిలుపునిచ్చింది.

కొత్త చైల్డ్ కేర్ పాలసీకి సంబంధించి ప్రకటించడానికి మీకు ఏమైనా ఆసక్తి ఉందా అని లేబర్ ఎంపీ కేథరీన్ మెక్‌కిన్నెల్ సునక్‌ను అడిగారు. ” ఈ ప్రశ్నకు సంబంధించి సమాధానం చెప్పిన రిషి.. తనకు అలాంటి ఆసక్తి ఏమి లేదని, అన్ని సాధారణ పద్ధతిలో జరిగాయని సమయంలోనే జవాబిచ్చారు.. కాగా ప్రధాని సునక్ దీనిని మంత్రి వర్గ ప్రయోజనాల ప్రత్యేక రిజిస్టర్‌లో ఉదహరించారు. విచారణలో ప్రధాని సునక్ దోషిగా తెలితే క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది. దీంతో పాటు వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా ప్రధాని కుర్చీకి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటు ప్రధాని రిషి సునక్ భారత సంతతికి చెందిన వాడు కావడంతో ఇటు భారతదేశంలోను ఈ తీర్పుపై అందరూ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.