హిందువునని ఎన్నికల్లో పోటీపై అనర్హత.. భారతీయ విద్యార్థి ఎమోషనల్ పోస్ట్..

బ్రిటన్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ఎన్నికలలో అనర్హత వేటు వేశారని భారతీయ విద్యార్థి కరణ్ కటారియా సంచలన పోస్ట్…  బ్రిటన్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకుంటున్న భారత విద్యార్థి కరణ్ కటారియా సంచలన ఆరోపణలు చేశాడు.. తనపై వ్యతిరేక ప్రచారంతో విద్యార్థి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడిందని తెలిపాడు.. హర్యానాకు చెందిన కటారియా కరణ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ప్రస్తుతం అందరి […]

Share:

బ్రిటన్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ఎన్నికలలో అనర్హత వేటు వేశారని భారతీయ విద్యార్థి కరణ్ కటారియా సంచలన పోస్ట్… 

బ్రిటన్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకుంటున్న భారత విద్యార్థి కరణ్ కటారియా సంచలన ఆరోపణలు చేశాడు.. తనపై వ్యతిరేక ప్రచారంతో విద్యార్థి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడిందని తెలిపాడు.. హర్యానాకు చెందిన కటారియా కరణ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ప్రస్తుతం అందరి నోటా ఈ చర్చే నడుస్తోంది.. 

కరణ్ కటారియా ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చదువుతున్నాడు.  కరణ్ కటారియా తన తోటి విద్యార్థుల సహకారంతో స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రెటరీ పదవికి పోటీపడ్డాడు.  కాగా ఎన్నికల్లో పాల్గొనకుండా అతనిపై గతవారం అనర్హత వేటు పడిందని చెప్పుకొచ్చాడు.. ఈ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు అన్ని నిరాధారమని కరణ్ తెలిపాడు. స్వలింగ సంపర్కులు,  ముస్లింలను నేను ద్వేషిస్తానంటూ దుష్ప్రచారం చేశారు.. నేను హిందూజాతి వాదినని ఆరోపించారు.  

అనర్హత వేటు.. 

ఓ భారతీయ హిందువు ‘ఎల్ఎస్ఇఎస్‌యు’ కి నాయకత్వం వహించడానికి చూసి తట్టుకోలేక పోతున్నారని నా మూలాలు తెలిసే నన్ను పోటీలో నిలబడేందుకు అనర్హుడిగా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  విద్యార్థుల సంక్షేమం కోసం తాను చాలా ఆలోచించానని కానీ భారతీయ హిందూ అనే ఒకే ఒక్క కారణంతో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని తెలిపారు. 22 ఏళ్ల కటారియా తాను మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్లు, తన కుటుంబంలో తానే మొట్టమొదటి సారిగా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్‌‌నని అని తెలిపారు. నాపై విష ప్రచారానికి పూనుకున్న వారిని శిక్షించకుండా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ స్టూడెంట్ యూనియన్ నాపై అనర్హత వేటు వేసింది. ఈ విషయంలో నా వాదనను కనీసం వినను కూడా వినలేదని తన గోడు చెప్పుకున్నాడు సోషల్ మీడియాలో కరణ్ కటారియా.

విద్యార్థులు ఈ సమస్యను లేవనెత్తినప్పటికి.. ఎల్ఎస్ఈఎస్‌యు దీనిని ఏ మాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కటారియా మాత్రం తనకు మద్దతుగా నిలవాలని ఎల్‌ఎస్‌ఇ నాయకత్వాన్ని కోరారు విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విద్యార్ధి సంఘంలో 11000 మంది విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు వీరిలో 60 శాతానికి పైగా మంది యూకేకు వెలుపల నుంచి వచ్చిన వారే.

అన్ని దేశాల విద్యార్థుల నుంచి తనకు సపోర్టు లభించినప్పటికీ.. స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఎన్నికలకు అనర్హుడిని అయ్యానని స్వలింగ సంపర్కులు, ఇస్లామోఫోబియా, హిందూ జాతీయ వాది అనే నిరాధారమైన ఆరోపణలతో నాకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రచారాన్ని ప్రారంభించారని తెలిపాడు. ఈ ఎన్నికల్లో భారతీయ విద్యార్థులను బెదిరించినట్లు ఫిర్యాదు చేసిన యూనివర్సిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కటారియా అన్నారు. దీనిపై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ స్పందించింది. 

మా తప్పేం లేదు..

ఎల్ఎస్ఇఎస్‌యు కూడా సోమవారం ఓ ప్రకటన చేసిన ప్రకటనలో తాము న్యాయ సమ్మతంగా, ప్రజాస్వామికంగా ఉంటామని… వేధింపులను ఏ రూపంలోనూ సహించమని తెలిపింది. కాగా ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలపై బయట వ్యక్తులతో సమీక్షకు ఆదేశించామని కూడా తెలిపింది. తమ వైపు ఎలాంటి తప్పులేదు అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తన వాదన తెలిపింది..