టర్కీ శిథిలాల నుంచి బయటపడిన పాపను ఎట్టకేలకు తల్లి చెంతకు చేర్చిన ఉక్రెయిన్ ప్రభుత్వం..

తల్లి చెంతకు బిడ్డ.. ఎటుచూసినా కన్నీళ్లు.. కాపాడండి.. కాపాడండి.. అంటూ ఆర్తనాదాలు.. హహాకారాలు, శిథిలాల కింద కుప్పలు కుప్పలు గా మృతదేహాలు.. ఇటీవల టర్కీ, సిరియాలో కళ్లెదుటే కనిపిస్తున్న విషాద ఛాయలు అందరి కళ్ళు చెమర్చాయి. రాకాసి భూకంపం టర్కీ, సిరియాలను అతలాకుతలం చేసింది. ఓవైపు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్న పసిపిల్లలు.. వారిని చూసి తల్లడిల్లిపోతున్న కన్నపేగులు. ఇలా భూకంపంతో ఎక్కడ చూసినా హృదయవిదారకమైన సంఘటనలే మనకు కనిపిస్తాయి. ఈ దృశ్యాలు అన్ని పక్కన పెడితే.. ప్రపంచమే […]

Share:

తల్లి చెంతకు బిడ్డ..

ఎటుచూసినా కన్నీళ్లు.. కాపాడండి.. కాపాడండి.. అంటూ ఆర్తనాదాలు.. హహాకారాలు, శిథిలాల కింద కుప్పలు కుప్పలు గా మృతదేహాలు.. ఇటీవల టర్కీ, సిరియాలో కళ్లెదుటే కనిపిస్తున్న విషాద ఛాయలు అందరి కళ్ళు చెమర్చాయి. రాకాసి భూకంపం టర్కీ, సిరియాలను అతలాకుతలం చేసింది. ఓవైపు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్న పసిపిల్లలు.. వారిని చూసి తల్లడిల్లిపోతున్న కన్నపేగులు. ఇలా భూకంపంతో ఎక్కడ చూసినా హృదయవిదారకమైన సంఘటనలే మనకు కనిపిస్తాయి. ఈ దృశ్యాలు అన్ని పక్కన పెడితే.. ప్రపంచమే కన్నీరు పెట్టుకునే ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. శిథిలాల కింద కొన ప్రాణాలతో కొట్టు మిట్టాడుతూ.. ఉన్న చిన్నారి ప్రాణాలు కాపాడిన సంగతి తెలిసిందే.. ఆ బిడ్డను ఆ రోజు నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం పరిరక్షిస్తూ వచ్చింది. కాగా ఆ బిడ్డ అసలైన తల్లిని కూడా గుర్తించి.. ఇద్దరినీ ఓ చెంతకు చేరింది ఆ దేశ ప్రభుత్వం.. తాజాగా ఇందుకు సంబంధించిన విషయాన్ని ఆ ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ ఓ ట్వీట్ కూడా చేసింది. ప్రస్తుతం అ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టర్కీ, సిరియాలో ఎటు చూసినా విషాదమే.. శిధిలాలు తవ్వే కొద్ది గుడ్డలు గుట్టలుగా శవాలు బయట పడుతున్నాయి. మృతుల సంఖ్య 58000 దాటిపోయింది.. అయితే శిథిలాల నుంచి కూడా కొందరు సజీవంగా బయటపడుతున్నారు.. తాజాగా శిథిలాల కింద ఐదు రోజులు సజీవంగా ఉన్నా ఓ రెండు నెలల చిన్నారిని తుర్కీయేలో సహాయక బృందాలు వెలికితీసాయి. హతయే లోని 128 గంటల తరువాత చిన్నారి ప్రాణాలతో బయటపడటం రెస్క్యూ సిబ్బంది ఆనందంతో చప్పట్లు కొట్టారు..  తాజాగా ఆ చిన్నారి తల్లిని ఆ పాప వద్దకు చేర్చిన ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. 

గడ్డకట్టే చల్లని సైతం లెక్కచేయకుండా వేలాది మంది రెస్క్యూ వర్కర్లు సహాయక చర్యలు చేశారు. ఏకంగా 128 గంటల తరువాత మృత్యుంజయురాలుగా బయటపడి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ముద్దులొలికే ఆ చిన్నారి ఫోటో అప్పట్లో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. అయితే పాప తల్లి ఈ ఘటనలో మృతి చెందినట్లు అంతా భావించారు. కానీ ఆమె బ్రతికే ఉన్నట్లు ఇటీవల తెలిసింది.. దాంతో తాజాగా శిశువును తల్లి చెంతకు చేర్చారు మంత్రి ఆంటన్ గెరా షెంక్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేశారు..

మంత్రి ఆంటన్ గెరా షెంక్  ట్వీట్.. 

తుర్కియాలో భూకంప శిధిలాల కింద 128 గంటల పాటు ప్రాణాలతో నిలదొక్కుకున్న పాప బహుశా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆమె తల్లి మరణించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆమె బ్రతికే ఉన్నారు. వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  54 రోజులు తర్వాత డిఎన్ఏ పరీక్షా అనంతరం బిడ్డను తల్లి చెంతకు చేర్చారు అని గెరా షెంక్ ట్విట్ చేశారు.. అంతకుముందు తుర్కియాలో కుటుంబ, సామాజిక సేవల శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీనిపై నేటిషన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక అద్భుతం అంటూ అభివర్ణించారు.  ప్రపంచంలో ఎంతో అద్భుతం ఏంటంటే తల్లి బిడ్డను కలపడమేనని పేర్కొన్నారు..