యూఎస్ ఎలెక్షన్స్ బరిలో ట్రంప్, వివేక్ రామస్వామి

యూఎస్ ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ బరిలోకి చాలామంది పోటీదారులు చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి, జరిగిన పోల్ విధానం ప్రకారం రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఫీల్డ్‌లో రెండవ స్థానంలో నిలిచారు. అయితే అత్యధికంగా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు అమెరికా ప్రజలు పాల్గొన్న పోలింగ్ ద్వారా అత్యధికంగా ఆధార అభిమానాలు లభించినట్లు తెలుస్తోంది.  బరిలో ట్రంప్-వివేక్ రామస్వామి పోటీ:  ఇటీవల ఒక ఎమర్సన్ కాలేజీ నిర్వహించిన […]

Share:

యూఎస్ ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ బరిలోకి చాలామంది పోటీదారులు చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి, జరిగిన పోల్ విధానం ప్రకారం రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఫీల్డ్‌లో రెండవ స్థానంలో నిలిచారు. అయితే అత్యధికంగా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు అమెరికా ప్రజలు పాల్గొన్న పోలింగ్ ద్వారా అత్యధికంగా ఆధార అభిమానాలు లభించినట్లు తెలుస్తోంది. 

బరిలో ట్రంప్-వివేక్ రామస్వామి పోటీ: 

ఇటీవల ఒక ఎమర్సన్ కాలేజీ నిర్వహించిన పోల్‌ ప్రకారం చూసినట్లయితే, డిసాంటిస్ మరియు రామస్వామి 10 శాతం చొప్పున సమంగా ఉన్నారు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 56 శాతంతో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ సంవత్సరం జూన్‌లో జరిగిన పోల్ ప్రకారం 21 శాతం నమోదు చేసినప్పటికీ రెండో స్థానంలో ఉన్న ఫ్లోరిడా గవర్నర్ డిసాంటిస్ ప్రస్తుతం ఎమర్సన్ కాలేజ్ పోలింగ్ ప్రకారం 10 శాతంతో భారీ పతనాన్ని చవిచూడడం గమనార్హం. మరోవైపు రామస్వామి, యూఎస్ ఎలక్షన్స్ సందర్భంగా నిర్వహించిన ముందస్తు అంచనాల పోల్స్ ప్రకారం, గట్టి పోటీ ఇస్తూ రెండో స్థానానికి చేరుకున్నారు. ఈ పోల్స్ ప్రకారం చూసిన విధంగా 80 శాతం పోలింగ్ వేసిన ప్రజలు తాము ఖచ్చితంగా మాజీ ప్రెసిడెంట్ ఆయన డోనాల్డ్ ట్రంప్ కి తమ మద్దతు కచ్చితంగా తెలుపుతామని చెప్తున్నారు. మరోవైపు రామస్వామికి కూడా, పోటీలో ఉన్న గవర్నర్ తో పోలిస్తే మంచి స్పందన లభిస్తుందని తెలుస్తోంది.

రామస్వామికి ట్విట్టర్ అధినేత సపోర్ట్: 

టెక్ దిగ్గజం అయిన ఎలాన్ మస్క్ అమెరికాలో జరగబోయే ప్రెసిడెంట్ పోటీల్లో అభ్యర్థిగా పాల్గొంటున్న వివేక్ రామస్వామికి సపోర్ట్ చేస్తూ, ఆయన మాట్లాడిన కొన్ని మంచి విషయాలను ట్విట్టర్ లో కూడా షేర్ చేసుకోవడం కూడా జరిగింది ఎలాన్ మస్క్. అంతేకాకుండా, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, భారతీయ-అమెరికన్ గురించి ట్వీట్ చేయడం ద్వారా అమెరికా అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామికి సపోర్టర్స్ ఎక్కువగా ఉన్నట్లే తెలుస్తోంది. రామస్వామికి సపోర్ట్ చేస్తూ, మస్క్ తన ట్విట్టర్ ద్వారా, రామస్వామి తన ప్రామిసస్ ఎప్పుడూ కూడా కాన్ఫిడెన్స్ గా చెప్తాడని, తన వైపు నుంచి సపోర్ట్ ని అందిస్తూ రామస్వామి పోస్ట్ చేసిన కొన్ని ప్రకటనలు షేర్ చేశాడు.

మరోసారి, ఎలోన్ మస్క్ US ప్రెసిడెన్సీకి పోటీ చేస్తున్న భారతీయ-అమెరికన్ అభ్యర్థి వివేక్ రామస్వామికి తన మద్దతును చూపించాడు. వైట్ హౌస్‌లో తప్పకుండా రామస్వామి అడుగుపెడతాడని ట్విట్టర్ అధినేత తన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. దీని ద్వారా, యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న వివేక్ రామస్వామికి ప్రజలలో ఎంత ప్రాధాన్యత ఉందో మరొకసారి తెలుస్తోంది. రామస్వామి, హార్వర్డ్ మరియు యేల్ రెండింటి నుండి డిగ్రీలు పొందిన టెక్ వ్యవస్థాపకుడు. కేరళ రాష్ట్రం నుండి USకి వలస వచ్చిన భారతీయ తల్లిదండ్రులకు జన్మించాడు రామస్వామి. మాజీ US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పోటీ చేసిన పోటీదారు రాన్ డిసాంటిస్ కు కూడా మస్క్ తన మద్దతును వినిపించడం జరిగింది. ప్రెసిడెంట్ రేసులో పాల్గొంటున్నట్లు, అధికారికంగా డిసాంటిస్ ట్విట్టర్ లో ప్రకటించడం జరిగింది.

జనవరిలో జరగబోయే యుఎస్ ప్రెసిడెంట్ బరిలో పోటీపడుతున్న ముగ్గురు భారతీయ-అమెరికన్ వ్యక్తులలో, రామస్వామి, నిక్కీ హేలీ మరియు హర్ష్ వర్ధన్ సింగ్‌లతో కలిసి మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను సవాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకునేందుకు, ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాల్సిందే.