డోనాల్డ్ ట్రంప్ మగ్ షాట్.. రికార్డ్ లెవ‌ల్లో ఫండ్స్

డోనాల్డ్ ట్రంప్ గురించి ఆయన గురించి వస్తున్న వార్తలు గురించి మనం రోజు వింటూనే ఉంటాము. ఇటీవల కాలంలో ఆయన 2020లో ఎన్నికల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు స్పష్టమైన తర్వాత మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఫుల్టన్ కౌంటీ జైలులో బుక్ అయ్యాడు. అంతేకాకుండా అమెరికా చరిత్రలో మగ్ షార్ట్ తీయించుకున్న మొదటి ఎక్స్ ప్రెసిడెంట్గా డోనాల్డ్ ట్రంప్ పేరు నిలిచిపోయింది. ఆయన మగ్ షాట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు జో […]

Share:

డోనాల్డ్ ట్రంప్ గురించి ఆయన గురించి వస్తున్న వార్తలు గురించి మనం రోజు వింటూనే ఉంటాము. ఇటీవల కాలంలో ఆయన 2020లో ఎన్నికల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు స్పష్టమైన తర్వాత మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఫుల్టన్ కౌంటీ జైలులో బుక్ అయ్యాడు. అంతేకాకుండా అమెరికా చరిత్రలో మగ్ షార్ట్ తీయించుకున్న మొదటి ఎక్స్ ప్రెసిడెంట్గా డోనాల్డ్ ట్రంప్ పేరు నిలిచిపోయింది. ఆయన మగ్ షాట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తో సహా ప్రతి ఒక్కరూ డోనాల్డ్ ట్రంప్ మగ్ షాట్ మీద సెటైర్లు వేయడం కూడా మొదలుపెట్టారు. 

మగ్ షాట్ ఎఫెక్ట్:

2024 రిపబ్లికన్ ప్రైమరీ రేసులో ముందంజలో ఉన్న ట్రంప్, శుక్రవారం ఒక్కరోజే $7.1 మిలియన్లు సేకరించారు, ఇది అతని మొత్తం ప్రచారంలో అత్యధిక వసూళ్లు చేసిన రోజు అంటూ డోనాల్డ్ ట్రంప్ పార్టీకి సంబంధించిన ఒక ప్రతినిధి తెలిపారు. మాజీ అధ్యక్షుడి నిధుల సేకరణ గురించి మొదట పొలిటికో నివేదించింది. 2020 ఎన్నికల తర్వాత, అధికారంలోకి మళ్లీ తిరిగి వచ్చేందుకు మాజీ అధ్యక్షుడి తనదైన శైలిలో ప్రయత్నాలు జరుపుతున్నాడు. అయితే 2020 ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ మీద రెండు వేర్వేరు నేరారోపణల ముద్ర కూడా పడింది. 

2020 ఆరోపణల కారణంగా ట్రంప్ జార్జియాలోని ఫుల్టెన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయిన విషయం కలకలం రేపింది. అందుకే ఆ క్రమంలోనే పోలీసు రికార్డుల కోసం ట్రంప్ ఫోటో తీసుకోవడం జరిగింది. పోలీసుల ఆధ్వర్యంలో రికార్డుల కోసం తీసుకున్న ఫోటోని మగ్ షాట్ అని అంటారు. దీంతో ఇటువంటి ఫోటో తీయించుకున్న మొదటి మాజీ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించాడు. అంతే కాకుండా ఆయన ఖైదీ సిరీస్ నెంబర్ p01135809. కాకపోతే ఆయన లొంగిపోయి అరెస్టు అయిన అనంతరం కేవలం 20 నిమిషాల తరువాత రెండు లక్షల డాలర్ల ఖర్చుతో ఆయన మళ్లీ బెయిల్ మీద విడుదలయ్యారు. నేరారోపణల మధ్య ఉత్కంఠంగా జరుగుతున్న ట్రంప్ ప్రచారంలో భాగంగా గత మూడు వారాల్లో, దాదాపు $20 మిలియన్లను తెచ్చిపెట్టింది. 

బరిలో ట్రంప్-వివేక్ రామస్వామి పోటీ: 

ఇటీవల ఒక ఎమర్సన్ కాలేజీ నిర్వహించిన పోల్‌ ప్రకారం చూసినట్లయితే, డిసాంటిస్ మరియు రామస్వామి 10 శాతం చొప్పున సమంగా ఉన్నారు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 56 శాతంతో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ సంవత్సరం జూన్‌లో జరిగిన పోల్ ప్రకారం 21 శాతం నమోదు చేసినప్పటికీ రెండో స్థానంలో ఉన్న ఫ్లోరిడా గవర్నర్ డిసాంటిస్ ప్రస్తుతం ఎమర్సన్ కాలేజ్ పోలింగ్ ప్రకారం 10 శాతంతో భారీ పతనాన్ని చవిచూడడం గమనార్హం. మరోవైపు రామస్వామి, యూఎస్ ఎలక్షన్స్ సందర్భంగా నిర్వహించిన ముందస్తు అంచనాల పోల్స్ ప్రకారం, గట్టి పోటీ ఇస్తూ రెండో స్థానానికి చేరుకున్నారు. ఈ పోల్స్ ప్రకారం చూసిన విధంగా 80 శాతం పోలింగ్ వేసిన ప్రజలు తాము ఖచ్చితంగా మాజీ ప్రెసిడెంట్ ఆయన డోనాల్డ్ ట్రంప్ కి తమ మద్దతు కచ్చితంగా తెలుపుతామని చెప్తున్నారు. మరోవైపు రామస్వామికి కూడా, పోటీలో ఉన్న గవర్నర్ తో పోలిస్తే మంచి స్పందన లభిస్తుందని తెలుస్తోంది. 

ట్విట్టర్ లోకి మళ్ళీ అడుగుపెట్టిన ట్రంప్: 

“ఎప్పటికీ లొంగిపోవద్దు” అనే పదాలతో ఉన్న టీ-షర్టులు, మగ్‌లు, డెకరేషన్ వస్తువులు, బంపర్ స్టిక్కర్‌లను విరాళంగా ఇవ్వాలని, అంతేకాకుండా వాటిని ఇతరులకు అమ్మాలని మద్దతుదారులను కోరుతూ, ట్రంప్ మగ్ షాట్‌కు నిధులను సేకరించారు ట్రంప్ ప్రతినిధులు. మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తాను లొంగిపోయిన తర్వాత తీయించుకున్న మగ్ షాట్, అంతే కాకుండా అతని ప్రచార వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్‌ను పోస్ట్ చేయడానికి స్వయంగా ట్విట్టర్‌ ప్లాట్‌ఫారమ్కి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.

జనవరి 6, 2021, తర్వాత డోనాల్డ్ ట్రంప్, ట్విట్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ నుండి నిషేధించబడ్డాడు, అయితే ఎలోన్ మస్క్ ట్విట్టర్ అధిపతి అయిన తర్వాత, మళ్లీ డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ మల్లి రికవరీ చేయడం జరిగింది.