Justin Trudeau: జస్టిన్ ట్రూడో ఒక అసమర్థుడు

కెనడా.. కెనడా.. కెనడా ఎక్కడ చూసినా ప్రస్తుతం కెనడా  (Canada) గురించే చర్చ నడుస్తోంది. కేవలం ఆ దేశం గురించి మాత్రమే కాకుండా ఆ దేశాన్ని పాలిస్తున్న జస్టిన్ ట్రూడో (Justin Trudeau) గురించి కూడా అంతా చర్చిస్తున్నారు. కెనడా ఇంతలా వార్తల్లో నిలిచేందుకు ఆ దేశ ప్రధాని ట్రూడో (Justin Trudeau) ప్రవర్తించిన తీరే కారణం. దీంతో ఇండియాకు, కెనడాకు మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినా కానీ కెనడా ప్రధాని ట్రూడో (Justin Trudeau)  […]

Share:

కెనడా.. కెనడా.. కెనడా ఎక్కడ చూసినా ప్రస్తుతం కెనడా  (Canada) గురించే చర్చ నడుస్తోంది. కేవలం ఆ దేశం గురించి మాత్రమే కాకుండా ఆ దేశాన్ని పాలిస్తున్న జస్టిన్ ట్రూడో (Justin Trudeau) గురించి కూడా అంతా చర్చిస్తున్నారు. కెనడా ఇంతలా వార్తల్లో నిలిచేందుకు ఆ దేశ ప్రధాని ట్రూడో (Justin Trudeau) ప్రవర్తించిన తీరే కారణం. దీంతో ఇండియాకు, కెనడాకు మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినా కానీ కెనడా ప్రధాని ట్రూడో (Justin Trudeau)  మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎటైతే అటయింది తాను చేసిన ఆరోపణలను మాత్రం వదిలే ప్రసక్తే లేదని అతడు చెబుతున్నారు. దీంతో ఇండియా-కెనడాల మధ్య సంబంధాలు ఇంకా బలహీనపడే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. 

అతడో అసమర్థుడు 

కెనడాలోని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు, పియరీ పొయిలీవ్రే మాట్లాడుతూ.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. అతడు న్యూఢిల్లీతో దౌత్య సంబంధాలను సరిగ్గా నిర్వర్తించలేదని తెలిపారు. ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశంతో గొడవకు దిగడం సరైన పద్ధతి కాదంటూ అతడు చురకలంటించాడు. నేపాలీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొయిలీవ్రే ట్రూడో  (Justin Trudeau)పై విరుచుకుపడ్డారు. భారతదేశంలో జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ఒక లాఫింగ్ స్టాక్‌గా పరిగణించబడుతున్నాడని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ తో కవ్వింపులు అవసరం లేదని తెలిపాడు. కెనడియన్ దౌత్యవేత్తలను భారత్ విడిచి వెళ్ళమని ఇండియా ఆదేశించడం గురించి అడిగినప్పుడు.. పొయిలీవ్రే ట్రూడో (Justin Trudeau)పై ఒంటి కాలుపై లేచారు. అతనొక అసమర్థుడు మరియు వృత్తి లేనివాడని అన్నారు. 

Also Read: India-Canada: దౌత్య సిబ్బంది వివాదంపై కెనడాకు అమెరికా, బ్రిటన్ మద్దతు

ప్రతి దేశంతో వివాదమే.. 

కెనడా (Canada) కు ఇప్పుడు కేవలం భారత్ తో మాత్రమే కాదు.. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలతో వివాదాలు ఉన్నాయని అతడు పేర్కొన్నాడు. దీనంతటికీ కారణం ప్రధాని చేతకానితనమే అని వ్యాఖ్యానించారు. ఖలిస్తాన్ (Khalistan) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసును గురించి కెనడా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పై నిరాధార ఆరోపణలు చేయడం అసలు వివాదానికి దారి తీసింది. దీంతో రెండు దేశాల మధ్య దౌత్య పరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. నాటి నుంచి నేటి వరకు ఈ రెండు దేశాల మధ్య ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అనేక మంది దౌత్య వేత్తలను ఈ రెండు దేశాలు బ్యాన్ చేశాయి. దీనిపై ప్రతిపక్ష నేత మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో.కెనడాకు భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు చాలా అవసరం అని.. వ్యాఖ్యానించారు. తాను కనుక ప్రధానమంత్రి అయితే భారత్ తో సంబంధాలను పునరుద్ధరిస్తానని పొయిలీవ్రే తెలిపారు. ఈ భూమిపై ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా అని.. అటువంటి దేశంతో విబేధాలు పెట్టుకోవడం అవసరం లేదన్నారు. 

బైడెన్ ను చూసి నేర్చుకోవచ్చుగా.. 

ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోవడం గురించి ప్రతిపక్ష నేత మాట్లాడుతూ… అమెరికా అధ్యక్షుడిని చూసి మా ప్రధాని నేర్చుకోవచ్చుగా అని అన్నారు. ఇక కెనడాలోని హిందూ దేవాలయాల (Hindu Temples) పై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. హిందూ మందిరాలపై జరుగుతున్న దాడులన్నింటినీ నేను తీవ్రంగా ఖండిస్తున్నానని, హిందూ నాయకులపై బెదిరింపులు, బహిరంగ కార్యక్రమాల్లో భారతీయ దౌత్యవేత్తలపై చూపే దూకుడు ఆమోదయోగ్యం కాదని తెలిపాడు. నేను దానిని వ్యతిరేకిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. హిందువులపైనా, హిందూ దేవాలయాలపైనా దాడులు చేసేవారిపై క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని అన్నారు.

కెనడాలో హిందూ దేవాలయాలను (Hindu Temples) ధ్వంసం చేసినట్లు అనేక నివేదికలు వచ్చాయని విచారం వ్యక్తం చేశారు. ఈ ఆగస్టులో బ్రిటీష్ కొలంబియాలో ఉన్న ఏ హిందూ దేవాలయాన్ని ఖలిస్తానీలు పోస్టర్లతో ధ్వంసం చేశారు. ఈ ఏడాదిలో కెనడాలో హిందూ దేవాలయాల ధ్వంసం జరుగుతూనే ఉంది. ఇది ఈ ఏడాదిలో మూడో హిందూ దేవాలయం.